ETV Bharat / sitara

బయోపిక్​లో ఆమిర్​ఖాన్​​.. తమిళంలోకి మహేశ్ హీరోయిన్​ ఎంట్రీ! - sudheer babu new movie

Kriti Sanon New Movie: కొత్త సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. ఆమిర్​ ఖాన్​ నటించబోయే ఓ ఆసక్తికర బయోపిక్​ సహా ఆది సాయికుమార్, కృతిసనన్​​ కొత్త సినిమాల విశేషాలున్నాయి.

telugu new movies
aadi saikumar black movie release date
author img

By

Published : Mar 30, 2022, 8:34 AM IST

Kriti Sanon New Movie: 'వన్‌ నేనొక్కిడినే' చిత్రంలో మహేష్‌బాబుతో కలిసి తొలిసారి తెలుగు తెరపై సందడి చేసిన భామ కృతిసనన్‌. ఇప్పుడు ఆమె తమిళ చిత్రసీమలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హిందీలో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ప్రస్తుతం విజయ్‌-66 వర్కింగ్‌ టైటిల్‌తో మొదలు కానున్న చిత్రంలో కథానాయిక పాత్రకు ఎంపికైనట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ 2న ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీన్ని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో అటు తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

kriti sanon new movie
కృతిసనన్‌

ఇప్పటికే 'బీస్ట్‌'ను పూర్తిచేసిన తమిళ కథానాయకుడు విజయ్‌ తర్వాత ఈ సినిమా కోసమే రంగంలోకి దిగనున్నారు. ప్రకాష్‌రాజ్‌, వివేక్‌ ఓబరాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా తొలుత రష్మిక, తమన్నా పేర్లు వినిపించాయి. ఇప్పుడు కృతిసనన్‌ పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇటీవలే 'బచ్చన్‌పాండే'తో ప్రేక్షకులను అలరించిన కృతి.. ప్రస్తుతం 'అదిపురుష్‌'లో నటిస్తోంది.

Sudheer Babu New Movie: సుధీర్‌బాబు కథా నాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం రూపొందుతోంది. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుధీర్‌బాబు ఇందులో ఓ శక్తివంతమైన పోలీస్‌ అధికారి పాత్రని పోషిస్తున్నారు.

sudheer babu new movie
సుధీర్​ బాబు

Aadi Saikumar Black Movie: ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా జి.బి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్లాక్‌'. మహంకాళి మూవీస్‌ పతాకంపై మహంకాళి దివాకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తోంది చిత్రబృందం.

aadi saikumar black movie release date
ఆది సాయికుమార్​ 'బ్లాక్​'

Laal Singh Chaddha: 'లాల్‌సింగ్‌ చద్ధా' చిత్రం విడుదల పనుల్లో తలమునకలై ఉన్నారు ఆమిర్‌ఖాన్‌. మరి ఈ సినిమా తర్వాత ఆయన ఏ ప్రాజెక్టు చేస్తారు? అనే సందేహం బాలీవుడ్‌ అంతా ఉంది. అది ఎలా ఉన్నా వచ్చే ఏడాది 'మొఘల్‌' చిత్రం షూటింగ్‌ ప్రారంభిస్తామని చెబుతున్నారు నిర్మాత భూషణ్‌కుమార్‌. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బాలీవుడ్‌ నిర్మాత ఈయన. ఇటీవల ఈయన నిర్మించిన 'ఝుండ్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చేనెలలో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా, సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్‌' చిత్రం ప్రారంభించనున్నారు.

aamir khan news
ఆమిర్​ ఖాన్​

ఈ నేపథ్యంలో భూషణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ "'మొఘల్‌' అనేది సినిమా కాదు. మా కల. మా నాన్న గుల్షన్‌కుమార్‌ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రమది. ఆమిర్‌ఖాన్‌ ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి అంగీకారం తెలిపారు. 2023లో సెట్స్‌పైకి వెళ్లనుంది. మిగతా చిత్రబృందం వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం" అన్నారు.

ఇదీ చదవండి: 'మిషన్​ ఇంపాజిబుల్'​ కోసం చిరు.. ఓటీటీలోకి 'స్టాండప్‌ రాహుల్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.