ETV Bharat / sitara

నాకు ఎప్పుడు పెళ్లి అవుతుందో: నటి పూర్ణ - telugu new movies

పూర్ణ, పాయల్ రాజ్​పుత్, ఈషారెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ '3 రోజెస్'. దీని ట్రైలర్​ గురువారం రిలీజ్​ కాగా.. అభిమానుల్ని అలరిస్తూ అంచనాల్ని పెంచుతోంది.

3 roses web series trailer
3 రోజెస్ ట్రైలర్
author img

By

Published : Nov 11, 2021, 3:14 PM IST

'నేను పుష్పవతి అయినప్పుడు ఇది ఇంకా స్కూల్‌లో కూడా జాయిన్‌ అయి ఉండదు. అలాంటిది ఇప్పుడు దానికి కూడా పెళ్లి అయిపోతుంది. నాకు ఎప్పుడు అవుతుందో ఏంటో' అని నటి పూర్ణ అసహనం వ్యక్తం చేస్తోంది. ఆమె, పాయల్‌ రాజ్‌పుత్‌, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ '3 రోజెస్‌'. మగ్గీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. 'ఆహా' ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా నవంబర్‌ 12 నుంచి ఈ సిరీస్‌ అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో '3 రోజెస్‌' ట్రైలర్‌ను నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విడుదల చేసింది.

30 సంవత్సరాలు వయసు వచ్చినా పెళ్లి కానీ అమ్మాయి పాత్రలో పూర్ణ.. అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునే యువతిగా ఈషా.. ట్రెక్కింగ్‌పై ఆసక్తి కనబరిచే అమ్మాయిగా పాయల్‌ కనిపించారు. మూడు విభిన్నమైన మనస్తత్వాలు.. కుటుంబ నేపథ్యాలు.. కలిగిన ఈ ముగ్గురు అమ్మాయిలు కామన్‌గా కోరుకునేది మాత్రం స్వేచ్ఛ. మరి స్వేచ్ఛ కోసం పాకులాడే ఈ అమ్మాయిల కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది..? అనేది తెలియాలంటే '3 రోజెస్‌' చూడాల్సిందే..!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.