'టోటల్ ధమాల్' చిత్రం నుంచి 'స్పీకర్ పట్ జాయే' పాట విడుదలైంది. ఇందులో అనిల్ కపూర్-మాధురీ దీక్షిత్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. అజయ్ దేవగణ్ సింహంతో ఎంట్రీ ఇచ్చి, ఇషా గుప్తాతో కాలు కదిపాడు. ఈ సినిమాకు ఇంద్రకుమార్ దర్శకత్వం వహించాడు. చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కానుంది.
గౌరవ్-రోషిన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. మాధురీ దీక్షిత్‌తో 15 సంవత్సరాల తర్వాత వెండితెర పంచుకుంటున్నాడు అనిల్.
'ప్రేక్షకుల కోసం మంచి కామెడీ కమర్షియల్ చిత్రంతో వస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాం. మా మధ్య వచ్చిన పుకార్లను పట్టించుకోవట్లేదు' -అనిల్ కపూర్
'స్రిప్టు వినగానే చాలా కామెడీగా అనిపించింది. ఇలాంటి చిత్రాల్లో స్టోరీ లోతుగా లేకపోయినా ఫన్ మాత్రం ఉంటుంది' -అజయ్ దేవగణ్
మాధురీ పేరు వాడుకొని ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటిగులు పొందినట్లు అనిల్‌పై పుకార్లు వచ్చాయి. ఈ విషయంలో విభేదాల వల్లే ఇన్ని సంవత్సరాలు విడిగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి.
వాటిపై స్పందించిన అనిల్..'ఒకరోజు నా భార్య సునీత ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ కావాలని అడిగింది. అప్పుడు అంత డబ్బులు లేవు. అందుకే మాధురీని అడిగితే ఇద్దరం కలిసినపుడు ఇస్తా అని చెప్పింది. కాని ఈ విషయం తెలుసుకున్న హస్సేన్ గిఫ్ట్‌గా పెయింటింగ్ పంపించారు. ఇప్పటికీ అది మా ఇంట్లోనే ఉంది. నా భార్య కలెక్షన్‌కు ఆమె ఈ విధంగా సహాయం చేసింది. ఆ క్రెడిట్ మొత్తం మాధురీకే దక్కుతుంద'ని వెల్లడించాడు.