ETV Bharat / science-and-technology

జీమెయిల్, యూట్యూబ్ డౌన్.. నెటిజన్ల తీవ్ర అవస్థలు

గూగుల్​ సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా గురువారం జీమెయిల్, యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

youtube server down today
youtube server down today
author img

By

Published : Mar 23, 2023, 11:33 AM IST

Updated : Mar 23, 2023, 12:23 PM IST

జీమెయిల్, యూట్యూబ్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాల్లోని నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్​ వర్క్​స్పేస్​లోకి లాగిన్​ కాలేకపోతున్నామని వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఫిర్యాదులు చేశారు. యూట్యూబ్​లోనూ వీడియోలు చూడడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయారు. యూట్యూబ్ సహా జీమెయిల్ పని చేయట్లేదని యూజర్లు స్క్రీన్​ షాట్లు పెట్టారు. అలాగే ట్విట్టర్​లో తమ జీమెయిల్​ను సైన్ ఇన్ చేయగా ఓపెన్ కావట్లేదని ట్వీట్లు చేశారు.

జీమెయిల్.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉపయోగించే ఈమెయిల్ సర్వీస్. అనేక సంస్థలు, కోట్లాది మంది యూజర్లు జీమెయిల్​ను, గూగుల్​ వర్క్​స్పేస్​ను రోజువారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. యూట్యూబ్​ కూడా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ఈ రెండింటి సేవల్లో అంతరాయం ఏర్పడడం వల్ల వారంతా ఇబ్బంది పడ్డారు. జీమెయిల్, యూట్యూబ్​.. రెండూ గూగుల్​లో భాగమే. సమస్యకు కారణం ఏంటనే విషయంపై గూగుల్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అంతకుముందు 2022 అక్టోబరు 25న ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ సేవలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రంగంలోకి దిగిన వాట్సాప్ మాతృ సంస్థ 'మెటా' సర్వీసులను పునరుద్ధరించింది. మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్​ ద్వారా మెసేజ్​లు పంపడం, అందుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సాప్‌ వెబ్‌కు కనెక్ట్‌ చేస్తున్నప్పుడు 'కనెక్టింగ్‌' అని వచ్చిందని, ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదని యూజర్లు వాపోయారు. ట్విట్టర్​లో 'వాట్సాప్​ డౌన్'​ హ్యాష్​ట్యాగ్​ సైతం ట్రెండ్ అయ్యింది. దీనిపై సోషల్​ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్​చల్​ చేశాయి.

అప్పట్లో వాట్సాప్ సేవలకు అంతరాయం కలగడంపై వాట్సాప్​ మాతృసంస్థ 'మెటా' అధికార ప్రతినిధి స్పందించారు. 'వాట్సాప్ సేవలు ఆగాయని మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా సేవలకు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాం' అని తెలిపారు. కాసేపటికే సేవలు పునరుద్ధరించినట్లు ప్రకటించారు.

సీఈఓ క్షమాపణ..
వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ సేవలు 2021 అక్టోబరు 5న 6 గంటలపాటు నిలిచిపోయాయి. ఫలితంగా మెటా సంస్థ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఈ క్రమంలో ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంపై మార్క్ జుకర్​బర్గ్ క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలిపారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆన్​లైన్​లోకి వచ్చినట్లు ఫేస్​బుక్ పోస్ట్​లో వెల్లడించారు. అలాగే వాట్సాప్ సైతం తన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం యాప్ సాధారణంగా పనిచేస్తోందని వెల్లడించింది.

కోటి రిపోర్టులు
అంతర్జాల సమస్యలపై దృష్టి సారించే డౌన్​డిటెక్టర్.. ఫేస్​బుక్ అంతరాయంపై కీలక ప్రకటన చేసింది. ఫేస్​బుక్ సమస్యపై ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా కోటికి పైగా ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్ దేశాల్లో ఎక్కువ ప్రభావం కనిపించిందని చెప్పింది. ఫేస్​బుక్​ సేవల్లో ఏర్పడిన సుదీర్ఘ అంతరాయం ఇదేనని వెల్లడించింది.

Last Updated : Mar 23, 2023, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.