ETV Bharat / science-and-technology

X.COM గా మారిన ట్విట్టర్​!.. మస్క్​ మజాక్​ ఆలోచనలు! - Elon musk X sentiment analysis

Twitter as X.COM : ట్విట్టర్​ వైబ్​సైట్​ను x.comకు అనుసంధానం చేసినట్లు ఎలాన్​ మస్క్​ స్పష్టం చేశారు. ఇప్పటికే లోగోను మార్చేసిన మస్క్​, ఇప్పుడు వెబ్​సైట్​ పేరులో కూడా పూర్తిగా మార్పులు చేసేందుకు నిశ్చయించుకున్నారు.

Twitter new domain name is x.com
Twitter as X.COM
author img

By

Published : Jul 24, 2023, 5:25 PM IST

Twitter as X.COM : ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్​ ట్విట్టర్​తో ఒక ఆటఆడుకుంటున్నారు. తాజాగా ట్విట్టర్​ వెబ్​సైట్​ను x.comకు అనుసంధానం చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే బ్లూబర్డ్ లోగోను మార్చేసిన ఎలాన్​ మస్క్​.. దాని స్థానంలో X సింబల్​ లోగోను తీసుకొచ్చారు. ఇది మస్క్​ మస్తిష్కంలో 'X'కు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. రానున్న రోజుల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని X కార్పొరేషన్​ ద్వారానే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.

ఎక్స్​ ప్రస్థానం.. అలా మొదలైంది!
Elon musk x.com history : ఎలాన్​ మస్క్​కు X అంటే చాలా ఇష్టం. 1990 సంవత్సరం నుంచే మస్క్​కు Xతో బాగా అనుబంధం ఉంది. వాస్తవానికి 1999లో ఎలాన్​ మస్క్​ X.COM పేరుతో స్టార్టప్​ను ప్రారంభించారు. కానీ తరువాత ఆ డొమైన్​ PayPal చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే 2017లో ఎలాన్​ మస్క్​ x.comను మరలా కొనుగోలు చేశారు. ఇది తన సెంటిమెంట్ అని కూడా ఆ సందర్భంలో మస్క్ పేర్కొనడం విశేషం. తనకు ఆ డొమైన్​ను తిరిగి అందించిన పేపాల్​కు ధన్యవాదాలు కూడా తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్తబ్దుగా ఉంచిన ఆ డొమైన్​తో.. ప్రస్తుతం ట్విట్టర్​ను అనుసంధానం చేశారు.

X - సెంటిమెంట్​
Elon musk X sentiment analysis : ఎలాన్​ మస్క్​కు X అంటే ఎంతో సెంటిమెంట్​. అందుకే తను ప్రారంభించిన కంపెనీల్లో X అక్షరం వచ్చేలా చాలా జాగ్రత్త తీసుకుంటారు. అంతరిక్ష ప్రయోగాల కోసం 2022లో ప్రారంభించిన సంస్థ SpaceX; ఎలక్ట్రిక్​ కారు మోడల్​ X, చివరకు తన కుమారుల్లో ఒకరికి పెట్టిన పేరులోనూ (ఎక్స్ ఏఈ ఏXII) X అనే పదాన్ని వదలలేదు. ఇటీవల xAI పేరుతో ఒక కృత్రిమ మేధ సంస్థను కూడా మస్క్ స్థాపించారు. తాజాగా ట్విట్టర్ పేరెంట్ సంస్థ పేరునూ 'ఎక్స్​ కార్పొరేషన్'​గా మార్చారు.

తాజా పరిణామాలతో ట్విట్టర్​ లోగోతోపాటు ట్విట్టర్.కామ్ స్థానంలో x.com చేరిపోయింది. సోమవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇవి అందుబాటులోకి వచ్చేశాయి.

ఎవ్రిథింగ్​ యాప్​
Elon musk Everything app : సామాజిక వేదికగా, పేమెంట్స్ యాప్​గా అన్ని సేవలు ఒకే యాప్​లో అందించేందుకు ఎలాన్ మస్క్ కృషి చేస్తున్నారు. దీనికి ఎవ్రిథింగ్ యాప్​ అని కూడా ఆయన అంటున్నారు. ముఖ్యంగా ఇది చైనాలో చాలా పాపులర్ అయిన వీచాట్ మాదిరిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. దాదాపు 100 కోట్ల క్రియాశీల యూజర్లు ఉన్న వీచాట్​ యాప్​లో.. సోషల్​ మీడియా పోస్టులు పెట్టవచ్చు, పర్షనల్​ మెసేజ్​లు పంపవచ్చు. అలాగే ఫుడ్​ ఆర్డర్​, క్యాబ్​ సేవలు పొందవచ్చు. ఇదే విధంగా తన ఎవ్రిథింగ్​ యాప్​ ఉండాలని మస్క్ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ట్విట్టర్ యాప్​ను కొనుగోలు చేసినట్లు ఇంతకు ముందే ఆయన ప్రకటించారు.

భారీ మార్పులు తథ్యం!
Twitter CEO : ట్విట్టర్​లో త్వరలో భారీ మార్పులు వస్తాయని ఆ సంస్థ సీఈఓ లిండా యకారినో స్పష్టం చేశారు. భవిష్యత్​లో ఆడియో, వీడియో, మెసేజ్​, పేమెంట్స్​/ బ్యాంకింగ్ సేవలు అన్నీ ఒకే యాప్​లో అందుబాటులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.