Wifi routers uses in Telugu : ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మన ఇంటికి అంతర్జాలం వచ్చేలా చూసే సాధనం మోడెమ్. అలా వచ్చిన ఇంటర్నెట్ను మన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఇతర డివైజ్లతో కనెక్ట్ చేసే మాధ్యమమే వైఫై రౌటర్. ఇన్కమింగ్, ఔట్‌గోయింగ్ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మేనేజ్ చేయడమే కాక.. ఈ రౌటర్‌తో అనేక ఉపయోగాలు ఉంటాయి. ఆయా ఫీచర్స్‌ను వాడుకుంటే.. మనం చాలా పనుల్ని సులభంగా, సురక్షితంగా పూర్తి చేయవచ్చు. అవేంటంటే..
1. ఫైల్ షేరింగ్
How to share files using wifi router : బ్లూటుత్ ద్వారా వేర్వేరు డివైజ్‌ల మధ్య ఫైల్ షేరింగ్ కాస్త కష్టమే. ఫైల్ సైజ్ పెద్దగా ఉంటే.. ట్రాన్స్ఫర్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అయితే.. వైఫై రౌటర్‌తో ఈ పని చాలా సులువుగా, వేగంగా పూర్తవుతుంది. హోమ్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన అనేక డివైజ్‌లకు ఒకేసారి ఫైల్ షేర్ చేయవచ్చు.
విండోస్ 11లో ఏదైనా ఫైల్ లేదా ఫోల్డర్‌ను నెట్‌వర్క్‌లో షేర్ చేయాలంటే.. ఆ ఫైల్‌పై రైట్ క్లిక్ చేయాలి. "Give access to > Specific people" సెలక్ట్ చేయాలి. Share with > Homegroup (Read or Read/Write) ఎంచుకుంటే మన ఇంట్లోని ఇతర డివైజ్లకూ ఫైల్స్ షేర్ చేయవచ్చు. తర్వాత.. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి.. Network and sharing centre on the home network కు వెళ్లాలి. లెఫ్ట్ ప్యానల్లో "Change advanced sharing options" ఎంచుకుని.. "Turn on file and printer sharing" పై క్లిక్ చేయాలి.
2. ఫైల్స్ ప్రింటింగ్
wifi router printer sharing : వైఫై ద్వారా ఫైల్ ప్రింటింగ్ కమాండ్స్ ఇవ్వవచ్చు. అయితే.. ఇందుకోసం మన దగ్గర ఉన్న ప్రింటర్‌కు వైర్డ్ నెట్వర్క్ కనెక్టర్ లేదా వైఫై అడాప్టర్ ఉండి తీరాలి. వాటి సాయంతో ప్రింటర్‌ను కూడా హోమ్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేస్తే.. ఇంట్లోని ఏ డివైజ్ నుంచైనా ఫైల్స్ ప్రింట్ చేయవచ్చు.
3. పేరెంటల్ కంట్రోల్స్
wifi router parental control : మన వైఫై నెట్వర్క్ ద్వారా ఇబ్బందికరమైన వెబ్‌సైట్స్‌ను యాక్సెస్ చేయకుండా నిలువరించేందుకు రౌటర్లలోని 'పేరెంటల్ కంట్రోల్స్' ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం.. హోం నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన డివైజ్‌లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. 192.168.1.1 ఐపీ అడ్రెస్‌తో వైఫై రౌటర్‌కు కనెక్ట్ కావాలి. admin, password ను యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేయాలి(ఇవి డిఫాల్ట్‌గా ఉంటాయి. మీరు మార్చి ఉంటే.. అవి ఎంటర్ చేయాలి). లాగిన్ అయ్యాక.. Advanced > Security > Block sites కు వెళ్లి.. అవసరం లేని వెబ్‌సైట్స్ బ్లాక్ చేయండి.
ఇదీ చదవండి : బ్రౌజింగ్ హిస్టరీ సరే.. బ్రౌజర్ కహానీ తెలుసా?
4. గెస్ట్ నెట్వర్క్ సెట్ అప్
wifi router guest network : అతిథులు/ బయటి వ్యక్తులకు ఒక్కోసారి మన వైఫై పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. అది కాస్త ఇబ్బందికరమే. ఇతరులు కనెక్ట్ అయితే.. హోం నెట్‌వర్క్‌లోని డివైజ్‌లు అన్నింటికీ హ్యాకింగ్ ముప్పు ఉండొచ్చు. గెస్ట్ నెట్వర్క్ సెట్ చేసుకుంటే.. ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇందుకోసం పెద్దగా చేయాల్సిందేమీ లేదు. పేరెంటల్ కంట్రోల్స్ తరహాలోనే రౌటర్లోకి లాగిన్ కావాలి. అక్కడ గెస్ట్ వైఫై యాక్సెస్ ఎనేబుల్ చేయాలి. అప్పుడు మన పాస్వర్డ్ చెప్పకుండానే అతిథులు/బయటి వ్యక్తులు వైఫై వాడుకోవచ్చు.
5. షెడ్యూల్ యాక్సెస్
గెస్ట్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన డివైజ్‌లు ఎంతసేపు, ఏమేర ఇంటర్నెట్ యాక్సెస్ చేయవచ్చు అనేదానికీ పరిమితులు విధించవచ్చు. ఒకటికన్నా ఎక్కువ డివైజ్‌లు గెస్ట్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉంటే.. ఏదైనా ఒకదానికి మాత్రమే ఇవి వర్తించేలా చేయవచ్చు.
6. పర్సనల్ క్లౌడ్ స్పేస్
wifi router cloud storage : యూఎస్బీ పోర్ట్ ఉన్న వైఫై రౌటర్లకు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ కనెక్ట్ చేయవచ్చు. ఆ డ్రైవ్స్లోని ఫైల్స్‌ను హోం నెట్‌వర్క్‌లోని ఏ డివైజ్ నుంచైనా యాక్సెస్ చేయవచ్చు.
ఈ ఫీచర్స్‌లో చాలా వరకు దాదాపు అన్ని రౌటర్స్లో ఉంటాయి. మిగిలినవి కొన్ని ప్రత్యేక మోడల్స్‌లో మాత్రమే ఉంటాయి.