ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ అంటే తెలియనివారుండరు. వాట్సాప్ అనేది అన్ని గ్రూప్‌ల వారు ఉపయోగించుకునేందుకు వీలుగా తయారు చేశారు. దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభంగా ఉంటుంది. అయితే లోతుగా పరిశీలిస్తే వాట్సాప్‌లో మనకు తెలియని కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మీకోసం..
గ్రూప్‌లలోని మెసేజ్‌లకు ప్రైవేట్‌గా రిప్లై
వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా మెసేజ్ పెడితే వారికి పర్సనల్‌గా రిప్లై ఇవ్వాలనుకుంటాం. అప్పుడు ఆ వ్యక్ పెట్టిన మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే రిప్లై ప్రైవేట్లీ అనే ఆప్షన్ వస్తుంది. దాంతో మీరు రిప్లైను అనుకున్న ఒక వ్యక్తికే పెట్టవచ్చు. యాపిల్ ఫోన్లలో ఇది కొంత వేరేగా ఉంటుంది. గ్రూప్‌లో మనకు సందేహం ఉన్న చాట్ మీద హోల్డ్ చేసి మోర్ అనే ఆప్షన్‌ను మీద క్లిక్ చేసి రిప్లై ప్రైవేట్లీ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి వ్యక్తిగతంగా చాట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా మనం వాట్సాప్ గ్రూప్‌లో అందరికి కనిపించేలా రిప్లై ఇవ్వొద్దు అనుకున్నప్పుడు.. పర్సనల్‌గా చాట్ చేయవచ్చు.
చాలా సులభంగా వాయిస్ మెసెజెస్
మనలో చాలా మంది చాట్ చేయలేనప్పుడు వాయిస్ మెసేజెస్ పంపుతుంటారు. అలాంటి సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు. మైక్ మీద హోల్డ్ చేసి వాయిస్ రికార్డు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సరిగ్గా పంపలేం. అలాంటప్పుడు మనం పంపాలనుకున్న వాయిస్ మధ్యలోనే ఆగిపోతుంది. వాయిస్ మెసేజ్‌ను పూర్తిగా పంపలేము. ఈ సమస్య నుంచి బయటపడటానికి వాట్సాప్‌లో ఒక ఆప్షన్ ఉంది. మైక్ ఐకాన్‌ను హోల్డ్ చేసి పైకి స్వైప్ చేస్తే మనం బటన్‌ను పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కావాల్సినంత సేపు వాయిస్ రికార్డు చేసుకోవచ్చు. మధ్యలో రికార్డింగ్‌ను ఆపి వాయిస్ ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు. మనం రికార్డు చేసిన దానిని డిలీట్ కూడా చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.
కావాల్సిన టెక్ట్స్‌ని ప్రత్యేకంగా చూపించవచ్చు
మనం ఏదైనా మెసేజ్‌ను పంపుతున్నప్పుడు దానిలో కొన్ని ముఖ్యమైన పదాలుంటాయి. దానిని ప్రత్యేకంగా పెట్టాలనుకుంటాం. అలాంటి వాటి కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మనం పంపిన సందేశంలో ముఖ్యమైన వాక్యాన్ని లేదా పదాన్ని ప్రత్యేకంగా పెట్టాలి అనుకున్నప్పుడు కింద చెప్పినట్లు చేయాలి.
- పదం లేదా వాక్యానికి రెండు చివరలలో స్టార్(*) పెడితే అది బోల్డ్ అయ్యి ప్రత్యేకంగా కనిపిస్తుంది.
- పదాలను ఇటాలిక్గా పెట్టాలనుకుంటే వాక్యాల చివరన అండర్స్కోర్ (_) పెడితే అది ఇటాలిక్గా మారుతుంది.
- అలాగే టెక్ట్స్‌ను స్ట్రైక్‌త్రూ చేయాలనుకుంటే ఇరువైపులా టిల్డెస్ (~) ను పెడితే అది ప్రత్యేకంగా మారుతుంది.
చాట్‌ను అన్‌రీడ్ చేయొచ్చు
మనం చాలా సందర్భాలలో మెసేజ్‌లను చూసి బిజీగా ఉండటం వల్ల రిప్లై ఇవ్వడం మర్చిపోతుంటాం. రిప్లై ఇవ్వకపోవడం వల్ల ఎదుటి వారు బాధపడే అవకాశం ఉంది. అలాంటప్పుడు చాట్‌ను అన్‌రీడ్ చేయాలి. మరి అలా చేయాలంటే ఎలా అనుకుంటున్నారా.. మనం చాట్ చదివినట్లు వారికి తెలియొద్దు అనుకుంటే టెక్ట్స్‌ను హోల్డ్డౌన్ చేస్తే కుడివైపున మూడు చుక్కలు కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే అన్‌రీడ్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే అవతలి వ్యక్తికి మనం ఇంకా చాట్ చదవనట్లు చూపిస్తుంది. యాపిల్ ఫోన్లలో ఇది కొంత వేరుగా ఉంటుంది. చాట్‌ను కుడి లేదా ఎడమవైపుకు స్వైప్ చేస్తే మూడు చుక్కలు కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే అన్‌రీడ్ వస్తుంది. క్లిక్ చేస్తే అన్‌రీడ్ అయిపోతుంది.
అన్ని చాట్లను క్లియర్ చేయవచ్చు
మన ఫోన్లో స్టోరేజ్‌ను మించి చాటింగ్ ఉంటుంది. దీంతో ఫోన్ స్లో అయ్యే ప్రమాదం ఉంది. అందుకు కొన్నాసార్లు చాటింగ్‌ను క్లియర్ చేయాలనుకుంటాం. ఆండ్రాయిడ్ ఫోన్లలో చాట్ క్లియర్ చేయడం చాలా ఈజీ. క్లియర్ ఆల్ చాట్స్ అంటే మొత్తం కంటెంట్ పోతుంది.
మెసెజ్ టైమింగ్స్ తెలుసుకోవచ్చు
మనం ఎవరికైనా మెసేజ్ పెడుతాం. మనం వారికి మెసేజ్ పెట్టి ఎంత సమయం అయ్యింది. ఎదుటివారు మెసేజ్‌ను ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు. ఎప్పుడు చదివారు అనే సమయం అంతా చూపిస్తుంది. ఎలా అంటే మనం పెట్టిన ఏదైనా మెసేజ్‌ను హోల్డ్ చేస్తే కుడివైపున మూడు చుక్కలు కనిపిస్తాయి. అక్కడ ఇన్ఫో అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద నొక్కితే మెసేజ్ టైమింగ్స్ అంతా కనిపిస్తుంది. యాపిల్ ఫోన్లలో మనం పెట్టిన మెసేజ్‌ను కుడి లేదా ఎడమకు స్వైప్ చేస్తే దానికి సంబంధించిన టైమింగ్స్ అంతా కనిపిస్తాయి.
వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ వేగాన్ని పెంచవచ్చు
ఏదైనా వాయిస్ మెసేజ్ పెద్దగా ఉంది. దానిని వినడానికి చాలా సమయం పడుతుంది అనుకున్నప్పుడు వాయిస్ మెసేజ్ స్పీడ్‌ను పెంచవచ్చు. ఎలా అంటే వాయిస్ మెసేజ్ ప్లే అవుతున్నప్పుడు ప్లే సింబల్‌కు ఎడమవైపున 1x స్పీడ్ కనిపిస్తుంది. దాని మీద మళ్లీ క్లిక్ చేస్తే 1.5x కనిపిస్తుంది. ఇలా మనకు కావాల్సిన వేగంలో వాయిస్ మెసేజ్‌ను వినవచ్చు.
ఇలా వాట్సాప్ రకరకాల కొత్త ఫీచర్లను తీసుకొచ్చి యూజర్లను ఆకట్టుకుంటుంది. యాప్ వాడకాన్ని మరింత సులభతరం చేస్తోంది. కొత్త ఫీచర్ల గురించి అన్నీ తెలుసుకున్నారుగా ఆలస్యమెందుకు ఈ షాట్కట్స్ను మీరు కూడా ట్రై చేయండి.