ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో కొత్త అప్డేట్స్.. ఆకర్షణీయంగా సెర్చ్​ బార్​.. ఈజీగా గ్రూప్ క్రియేషన్! - WhatsApp Beta Version

WhatsApp Latest Features : మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్​ మరో కొత్త ఫీచర్​తో యూజర్స్​ ముందుకు వచ్చింది. యాప్​లో ఉండే సెర్చ్​ బార్​కు సంబంధించి కీలక మార్పులు చేసింది. ఈ విషయాన్ని వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్లను పర్యవేక్షించే వెబ్‌సైట్ వెల్లడించింది.

WhatsApp Latest Update 2023
వాట్సాప్​లో మరో కొత్త అప్డేట్​.. ఏంటో తెలుసా..
author img

By

Published : Jul 27, 2023, 4:54 PM IST

WhatsApp Latest Update 2023 : ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్​తో వినియోగదారులకు మరింత చేరువవుతోంది. ఈసారి.. సెర్చ్​ బార్​ను రీడిజైన్​ చేసి మరికొన్ని ఫీచర్స్​ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది వాట్సాప్​. తాజా ఫీచర్​​ వాట్సాప్​ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​ 2.23.16.5 వారికి మాత్రమే అందుబాటులో ఉందని.. భవిష్యత్​లో దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోందని వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్లను పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo నివేదించింది.

WhatsApp Beta New Update : వాట్సాప్​ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడమే కాకుండా మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయడమే లక్ష్యంగా ఈ రీడిజైన్ అప్డేట్​ను తెచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయితే తాజా అప్డేట్​ కేవలం యాప్​ పైభాగంలో ఉండే సెర్చ్ బార్​కు మాత్రమే పరిమితం కాదని.. చాటింగ్​ హిస్టరీని వెతికి పెట్టే యాప్‌లోని సెట్టింగ్స్​లో ఉండే సెర్చ్​ ఆప్షన్​లోనూ ఈ అప్డేట్​ తెచ్చినట్లు వాట్సాప్​ తెలిపింది.

WhatsApp Latest Version : ఈ సరికొత్త అప్డేట్​లో కొందరు బీటా టెస్టర్లు మరొక ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించారు. అదేంటంటే.. వాట్సాప్ తెరవగానే కనిపించే సెర్చ్ బార్​లోని అన్​రెడ్​, ఫొటోలు, వీడియోలు, లింక్స్​ వంటి ఆప్షన్​లు ఇప్పుడు కొత్తగా తెలుపు రంగులో కనిపిస్తున్నాయి. ఇది యాప్​ విజువలైజేషన్​ను మరింతగా మెరుగుపరుస్తుందని బీటా టెస్టర్లు అంటున్నారు.

వారికి మాత్రమే ఛాన్స్​..
WhatsApp Beta Version : గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి వాట్సాప్​ బీటాను ఇన్​స్టాల్​ చేసుకున్న బీటా టెస్టర్లకు మాత్రమే రీడిజైన్ చేసిన సెర్చ్​ బార్​ కనిపిస్తోంది. క్రమంగా దీనిని మరింత మంది వినియోగదారులకు చేరువ చేస్తామని వాట్సాప్​ చెప్పింది.

WhatsApp Latest Update Features : సెర్చ్​ బార్​ రీడిజైన్​ అప్డేట్​తో పాటు.. మరో కొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది ఈ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​. ఇది వినియోగదారులు సందేశాలు ఫార్వర్డ్ చేసే సమయంలో కొత్త గ్రూప్​ను క్రియేట్​ చేసే విధంగా ఈ ఫీచర్​ ఉంటుంది. మెసేజ్​లను ఫార్వర్డ్​ చేసే సమయంలో 'క్రియేట్​ గ్రూప్' అనే గుర్తును యూజర్స్​ ఈ ఫీచర్​లో గమనించవచ్చు. దీంతో గ్రూపును సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇలా​ కొత్తగా క్రియేట్​ చేసిన గ్రుప్​లోకి సులువుగా మీ స్నేహితులను యాడ్​ చేయవచ్చు. దీంతో మీరు ఫార్వర్డ్​ చేయాలనుకున్న సందేశం నేరుగా అందరికీ ఒకేసారి వెళ్లిపోతుంది.

మరి ఈ నయా​ ఫీచర్​ మీ వాట్సాప్​ అకౌంట్​లో కూడా వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి మీరు కూడా ఒక మెసేజ్​ను ఫార్వర్డ్​ చేయడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో ఫార్వర్డింగ్​ స్క్రీన్​పై క్రియేట్​ గ్రూప్​ అని మీకు కనిపిస్తే గనుక మీ ఫోన్​లో కూడా ఈ కొత్త అప్డేట్​ వచ్చినట్లు అర్థం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.