ETV Bharat / science-and-technology

WhatsApp Video Call : వాట్సాప్​ నయా ఫీచర్​​​.. ఒకేసారి 15 మందితో గ్రూప్​ వీడియో కాల్! - వాట్సాప్ వీడియో కాల్ ఫీచర్స్​

WhatsApp Group video Call : మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ ఎప్పటికప్పుడు సరికొత్త అప్​డేట్స్​తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే ఒకేసారి 15 మందితో గ్రూప్​ వీడియో కాల్​ను ప్రారంభించేందుకు వీలుగా నయా ఫీచర్​ను లాంఛ్​ చేసింది. దీనితో పాటు మరి కొన్ని ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.

Whatsapp New Features
వాట్సాప్​ నుంచి మరో కొత్త ఫీచర్​ అప్డేట్​​.. ఒకేసారి 15 మందితో గ్రూప్​ కాల్..!
author img

By

Published : Jul 24, 2023, 5:57 PM IST

WhatsApp Group Video Call : ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్​ను లాంఛ్ చేసింది. ఒకేసారి 15 మందితో ​ గ్రూప్​ వీడియో కాల్​ను మాట్లాడుకునేందుకు వీలుగా నయా ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది కేవలం ఐఓఎస్​ యూజర్లతో పాటు బీటా టెస్టర్ల డివైజ్​లలో మాత్రమే పనిచేయనుంది. దీనితో ఐఓఎస్​ యూజర్లు ఒకేసారి 15 మంది వ్యక్తులతో గ్రూప్ వీడియో కాల్​ మాట్లాడడానికి వీలవుతుంది.

WhatsApp video call limit : అయితే ఇంతకుముందు వాట్సాప్​ గ్రూప్​ వీడియో కాల్​ను ప్రారంభించాలంటే కేవలం ఏడుగురికి మాత్రమే అనుమతి ఉండేది. ఇక తాజాగా తెచ్చిన అప్డేట్​ ద్వారా ఒకేసారి 15 మందితో వీడియో కాల్​ మాట్లాడవచ్చు. దీనిని క్రమంగా 32 మందికి పెంచుకోవచ్చు. ఈ అప్‌డేట్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. వ్యక్తులు ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తులతో వీడియో కాల్‌లలో మాట్లడగలరు. దీని వల్ల వారి సమయం కూడా ఆదా అవుతుంది. ఇక ఈ ఫీచర్​ను భవిష్యత్​లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్లను పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo తెలిపింది.

మోస్ట్ ఫేమస్ మెసేజింగ్ యాప్​
WhatsApp user base : వాట్సాప్ అంటే తెలియని వ్యక్తి ఉండడు. అంతలా దీనిని వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది.. భారత్​లో 50 కోట్ల మంది వాట్సాప్​లో యాక్టివ్​ యూజర్స్​గా​ ఉన్నారంటే దీని పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మెటా యాజమాన్యంలోని వాట్సాప్​ తమ వినియోగదారులకోసం ముఖ్యంగా ఐఓఎస్​ (యాపిల్​ ఫోన్​ వినియోగదారులు​) యూజర్స్​ కోసం సరికొత్త ఫీచర్​ అప్డేట్స్​ను లాంఛ్​ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే మరికొన్ని అదిరిపోయే ఫీచర్ల​తో ప్రజల ముందుకొచ్చింది.

WhatsApp latest features : యాప్​ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఐఓఎస్​, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఇటీవలే సరికొత్త అవతార్స్​, స్టికర్స్​ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్​ వినియోగదారులు వారి సొంత ఫోటోలతో అవతార్‌ను క్రియేట్​ చేసుకోవడానికి వీలును కల్పిస్తోంది. అంటే మీరు అవతార్‌ను మాన్యువల్‌గా సృష్టించాల్సిన అవసరం లేదు. ఇక ఐఓఎస్​ వినియోగదారుల కోసం వాట్సాప్​ వీడియో కాల్​ను ల్యాండ్‌స్కేప్ మోడ్​లో కూడా మాట్లాడుకునే విధంగా ఉండే ఫీచర్​ను కూడా లాంఛ్​ చేసింది వాట్సాప్. వీడియో చాటింగ్​ సమయంలో వినియోగదారులు మరింత లీనమయ్యే అనుభవాన్ని ఆస్వాదించడానికి ఇది సహాయపడుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.