ETV Bharat / science-and-technology

ట్విట్టర్​ యూజర్లకు గుడ్​న్యూస్​.. ఆ ఫీచర్​ వచ్చేస్తుంది..

Twitter Edit Option: ట్విట్టర్​లో ఎడిట్‌ ఫీచర్‌ కావాలంటూ చాలా రోజుల నుంచి యూజర్లు కోరుతున్నారు. అయితే ఈ ఫీచర్​ కొద్దిమందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. పూర్తిస్థాయి యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ట్విట్టర్ ​ప్రకటించింది.

twitter
ట్విట్టర్
author img

By

Published : Sep 2, 2022, 3:40 PM IST

Twitter Edit Option: ట్విట్టర్​లో ఎడిట్‌ ట్వీట్ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. కానీ, ఈ ఫీచర్‌ కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తిస్థాయి యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ట్విట్టర్​ ప్రకటించింది. "మీ ట్విటర్‌ ఖాతాలో ఎడిట్ బటన్‌ కనిపిస్తే కంగారుపడకండి.. ఈ ఫీచర్‌ ఇంకా పరీక్షల దశలోనే ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తాం" అని ట్వీట్‌లో పేర్కొంది. ముందుగా ఈ ఫీచర్‌ను ట్విట్టర్​ బ్లూ యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం యూజర్లకు కనిపించే ఎడిట్ బటన్‌ పనిచేయదని తెలిపింది.

ట్విట్టర్​లో ఎడిట్‌ ఫీచర్‌ కావాలంటూ చాలా రోజుల నుంచి యూజర్లు కోరుతున్నారు. గతంలో ఎడిట్‌ ఆప్షన్‌ను ప్రవేశపెట్టబోమని ట్విట్టర్​ ప్రకటించింది. కానీ, యూజర్ల నుంచి డిమాండ్‌ పెరుగుతుండడం వల్ల ఎడిట్‌ ఆప్షన్‌ తీసుకురాబోతున్నట్లు ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎడిట్‌ ఆప్షన్‌లో ఫీచర్ల గురించి ఆసక్తికర సమాచారం లీకైంది. ఈ ఫీచర్‌లో ట్వీట్‌ చేసిన 30 నిమిషాల వరకు ఎడిట్‌ చేయొచ్చట. ఆ తర్వాత ట్వీట్‌లో మార్పులు చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. అలానే ట్వీట్‌ను ఎడిట్‌ చేసినట్లు లేబుల్ కూడా కనిపిస్తుందట. ఎడిట్‌ చేయకముందు ట్వీట్‌ను యూజర్లు చూసే సౌలభ్యం ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి: అన్ని 5G ఫోన్లలో జియో 5G పనిచేస్తుందా ?

సరికొత్త ఫీచర్స్​తో నయా స్మార్ట్​ఫోన్స్​, సెప్టెంబర్​లో రిలీజయ్యేవి ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.