వినూత్న ఫీచర్లు, కొత్తదనంతో ఆకట్టుకోవడంలో ముందుంటుంది గూగుల్. అదే సంస్థకు చెందిన ఆండ్రాయిడ్ అంటే ఇక చెప్పక్కర్లేదు. ఓ విప్లవమే. ఎంతో మంది మదిని దోచిన ఆ ఆపరేటింగ్ సిస్టమ్.. త్వరలో కొత్త అప్డేట్తో రానుంది.
తాజాగా ఆసక్తికరమైన ఫీచర్లతో కూడిన ఆండ్రాయిడ్ 11 బీటా వెర్షన్‌ను విడుదల చేసింది గూగుల్. అయితే ప్రస్తుతం ఇది పిక్సెల్ ఫోన్లు వాడేవారికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రతీ ఏడాదిలా మే నెలలో జరగబోయే గూగుల్ I/Oలో దీని విశేషాలు వెల్లడించాల్సి ఉన్నా.. జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ వేడుకను రద్దు చేసింది. అయితే కొత్తగా వచ్చే ఈ అప్డేట్లో ఫీచర్లు తక్కువగా ఉన్నా.. యూజర్ ప్రైవసీపైనే ఎక్కువ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
-
Today we announced:
— Android Developers (@AndroidDev) June 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
🎉 Android 11 Beta 1
🛠 Android Studio 4.1 Beta
⚙️ Android Studio 4.2 Canary
📚 New Android Jetpack libraries
🚀 Jetpack Compose Developer Preview 2
▶️ Play Console Beta
➕ More
Read → https://t.co/tD8f21lbAF
All talks → https://t.co/Efjxz9VwDm#Android11 pic.twitter.com/L3b1KHtzcM
">Today we announced:
— Android Developers (@AndroidDev) June 10, 2020
🎉 Android 11 Beta 1
🛠 Android Studio 4.1 Beta
⚙️ Android Studio 4.2 Canary
📚 New Android Jetpack libraries
🚀 Jetpack Compose Developer Preview 2
▶️ Play Console Beta
➕ More
Read → https://t.co/tD8f21lbAF
All talks → https://t.co/Efjxz9VwDm#Android11 pic.twitter.com/L3b1KHtzcMToday we announced:
— Android Developers (@AndroidDev) June 10, 2020
🎉 Android 11 Beta 1
🛠 Android Studio 4.1 Beta
⚙️ Android Studio 4.2 Canary
📚 New Android Jetpack libraries
🚀 Jetpack Compose Developer Preview 2
▶️ Play Console Beta
➕ More
Read → https://t.co/tD8f21lbAF
All talks → https://t.co/Efjxz9VwDm#Android11 pic.twitter.com/L3b1KHtzcM
స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు
ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న స్క్రీన్ రికార్డింగ్ సౌకర్యాన్ని ఈ వెర్షన్ తెస్తోంది. దీంతో ఇకపై ఫోన్లోనే వీడియో ట్యుటోరియల్స్ చేయడం సులభం అవుతుంది. కేవలం వీడియోని రికార్డు చేయడం కాదు. వాయిస్ కూడా జోడించొచ్ఛు. అందుకు కావాల్సిన ఆప్షన్స్‌ని నోటిఫికేషన్స్ ప్యానల్లోనే పొందుపరిచారు. ఒక్కసారి ట్యాప్ చేసి స్క్రీన్ రికార్డింగ్‌ని మొదలెట్టొచ్ఛు ఇకపై థర్డ్ పార్టీ యాప్‌లతో పని లేదు.
తెరపైకి 'బబుల్స్'
ఎవరైనా టెక్స్ట్ మెసేజ్ చేస్తే తెరపై నోటిఫికేషన్ వస్తుంది. మెసేజ్ ఐకాన్ని ట్యాప్ చేసి చూస్తాం. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. ఎవరైనా మెసేజ్ పంపితే తెరపైకి ఛాట్ బబుల్ (ఛాట్ హెడ్) వస్తుంది. ఎలాగంటే.. ఫేస్బుక్ మెసెంజర్ మాదిరిగా అన్నమాట. ఎవరైనా ఛాట్ మెసేజ్ పంపితే బబుల్ ఐకాన్ ఎలా వస్తుందో అచ్చంగా అలానే టెక్స్ట్ మేసేజ్‌లు కూడా కనిపిస్తాయ్. బబుల్‌ని సెలెక్ట్ చేసి మెసేజ్‌లు చూడొచ్ఛు.. స్పందించొచ్ఛు. దీని కోసం ముందే మెసేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బబుల్స్‌ని ఎనేబుల్ చేసుకోవాలి.
నోటిఫికేషన్ నుంచే స్పందన
ఫోన్‌కి ఏమేం నోటిఫికేషన్స్ వచ్చాయో చూసేందుకు తెరని కిందికి లాగుతాం. అన్ని అలర్ట్‌లను చూస్తాం. వాటికి స్పందించాలంటే.. వాటిని సెలెక్ట్ చేసి సంబంధిత మెసెంజర్ యాప్‌లోకి వెళ్లాల్సిందే. ఇకపై అంత శ్రమ లేకుండా నోటిఫికేషన్ విభాగంలోనే మెసేజ్‌ని చదివి అక్కడ నుంచే రిప్లై ఇవ్వొచ్ఛు. ఏదైనా మేటర్ని కాపీ, పేస్ట్ చేయొచ్ఛు అంటే.. మెసేజ్‌ల ద్వారా చేసే కమ్యూనికేషన్‌ని మరింత సులభతరం చేస్తోంది అన్నమాట. దీన్నో 'కన్వర్షన్' సెక్షన్‌గా పిలుస్తున్నారు. ఎమోజీలు, ఫొటోలు కూడా అక్కడే ఎటాచ్ చేసి పంపొచ్ఛు
మరికొన్ని..
ఫోన్‌ని ఫ్లైట్ మోడ్‌లో పెడితే అన్ని నెట్‌వర్క్‌లు డిజేబుల్ అవ్వడం తెలుసు. కానీ, వచ్చే వెర్షన్లో ఫ్లైట్ మోడ్‌లో పెట్టినా బ్లూటూత్ ఎనేబుల్లోనే ఉంటుంది. దీంతో విమానంలో వెళ్తున్నప్పుడు 'ఏరోప్లేన్' మోడ్‌లో పెట్టినా కూడా వైర్లెస్ హెడ్సెట్లతో ఫోన్లో పాటలు వినొచ్ఛు.
మోషన్ సెన్సార్ ద్వారా ఫోన్ కెమెరాను ఆన్ చేయడం, నియంత్రించడం చేయొచ్చు. కెమెరా ముందు చేతుల్ని కదుపుతూనే కమాండ్స్‌ని రన్ చేయొచ్ఛు. ఉదాహరణకు ప్లే అవుతున్న మ్యూజిక్‌ని పాజ్ చేయాలంటే ఫోన్ కెమెరాకి చేతులతో సైగ చేస్తే చాలు.
'పర్మిషన్స్' పదిలం..
ఏ యాప్‌ని ఇన్స్టాల్ చేసినా అన్ని అనుమతులు కోరుతూ తికమక పెట్టేస్తున్నాయ్. మన ప్రైవసీపై మనకే అనుమానం వస్తున్న పరిస్థితి. దీనికి కాస్త ఊరట కలిగేలా యాప్ పర్మిషన్స్‌ని కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేక సెట్టింగ్స్‌ని అందిస్తోంది. వాటితో యాప్‌ల అనుమతిని నిర్దేశించొచ్చు. ఒక్కసారి మాత్రమే యాక్సెస్ ఇవ్వడం.. లేదంటే యాప్‌ని వాడుతున్నప్పుడు మాత్రమే పర్మిషన్స్ ఎనేబుల్ అవ్వడం చేయొచ్చు. యాప్‌ని క్లోజ్ చేశాక అనుమతులు అన్నీ డిజేబుల్ అయిపోతాయి. దీంతో యాప్‌లు నిత్యం కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్.. ట్రాక్ చేస్తున్నాయేమో అని భయపడాల్సిన పని లేదు.
డార్క్ థీమ్ ఆటోమేటిక్‌గా మారిపోతుంది. అంటే.. రాత్రి ఏడు తర్వాత ఎక్కువ లైటింగ్‌తో కళ్లకి ఒత్తిడి కలగకుండా డార్క్‌మోడ్‌ని నిర్ణీత సమయానికి ఎనేబుల్ అయ్యేలా చేయొచ్ఛు.
ఇదీ చూడండి: జులైలో మార్కెట్లోకి రూ.20వేల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ..