గూగుల్ పే వెబ్ యాప్‌లో.. పీర్-టూ-పీర్ పేమెంట్ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నిలిపేసేందుకు సిద్ధమైంది. దీనితో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు వసులు చేయాలని భావిస్తున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలిసింది.
గూగుల్ పే ప్రస్తుతం మొబైల్ యాప్ సహా.. పే డాట్ గూగుల్ డాట్‌కామ్ ద్వారా నగదు బదిలీ సేవలందిస్తోంది. జనవరి నుంచి వెబ్ యాప్ సేవలు నిలిచిపోనున్నట్లు ఓ నోటీసులో పేర్కొంది గూగుల్ పే. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి.
ఐఓఎస్, ఐఓఎస్ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది.
ఇదీ చూడండి:బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి మస్క్