Redmi Note 11 Pro Series: రెడ్మీ (Redmi) కంపెనీ నోట్ 11 సిరీస్లో రెండు కొత్త ఫోన్లను మార్చి 9న విడుదల చేయబోతుంది. అయితే ఈ ఫోన్లకు సంబంధించి ఫీచర్లు లీకయ్యాయి. ఈ ఫోన్లలో హై రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా సెన్సార్లు అమర్చినట్టు తెలుస్తోంది. మరి ఈ ఫోన్ల ధర, ఇతర ఫీచర్లతో పాటు వీటి అమ్మకాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Redmi Note 11 Pro Price:
రెడ్మీ నోట్ 11 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ మొత్తంగా రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటిని ఫోన్ స్టోరేజ్ ఆధారంగా విభజించారు. వాటి ధరలు ఇలా ఉన్నాయి..
- 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999
- 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,999
Redmi Note 11 Pro Specifications:
రెడ్మీ నోట్ 11 ప్రో 5జీ ఫీచర్లు..
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- 120 హెర్జ్ రిఫ్రెష్ రేటు
- మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్
- వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరా
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్
కలర్స్-ఫాంటమ్ వైట్, స్కై బ్లూ, స్టీల్త్ బ్లాక్
Redmi Note 11 Pro Plus Price:
రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్ మొత్తంగా రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. స్టోరేజ్ ఆధారంగా వాటి ధరలు ఇలా ఉన్నాయి..
- 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.21,999
- 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.23,999
Redmi Note 11 Pro Specifications:
రెడ్మీ నోట్ 11ప్రో ప్లస్ 5జీ ఫీచర్లు..
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్
- స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
- వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరా
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్
కలర్స్-ఫాంటమ్ వైట్, మిరేజ్ బ్లూ, స్టీల్త్ బ్లాక్
మార్చి 9న విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ ఫోన్లను మార్చి 15 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, పేటీఎం, టాటా, బజాజ్ ఫిన్‌సర్వ్ ఆన్‌లైన్ స్టోర్లతోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
ఇదీ చదవండి: వాట్సాప్లో ఐదు సరికొత్త ఫీచర్లు.. ఇక చాటింగ్లో సూపర్ ఫన్!