OnePlus Nord N30 5g launch : వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్. OnePlus Nord N30 5G మార్కెట్లోకి విడుదల అయ్యింది. విద్యార్థులకు 10 శాతం డిస్కౌంట్‌తో సహా ఒక సంవత్సరం పాటు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా అందిస్తోంది. ప్రీ- ఆర్డర్ చేసిన వారికి రూ.4,900 విలువ చేసే OnePlus Nord Bud 2ను ఉచితంగా ఇస్తోంది.
OnePlus Nord N30 5G Features and Specifications
- డిస్ప్లే: 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400x1080 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేషియో
- ఆస్పెక్ట్ రేషియో: 20:9
- ప్రాసెసర్: ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
- బ్యాటరీ: 5,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- ఫాస్ట్ ఛార్జింగ్: 50వాట్ సూపర్VOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- స్టోరేజ్: 8జీబీ + 128జీబీ
- కలర్: క్రోమాటిక్ గ్రే కలర్
- ఓఎస్: ఆండ్రాయిడ్ 13 - ఆక్సిజన్ ఓఎస్ 13
- ప్రైమరీ కెమెరా: 108 మెగా పిక్సెల్ + 2ఎమ్పీ + ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్
- ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
-
OnePlus Nord N30 5G launch imminent, receives FCC certification https://t.co/QW0yyxw8o1
— 91mobiles (@91mobiles) May 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">OnePlus Nord N30 5G launch imminent, receives FCC certification https://t.co/QW0yyxw8o1
— 91mobiles (@91mobiles) May 10, 2023OnePlus Nord N30 5G launch imminent, receives FCC certification https://t.co/QW0yyxw8o1
— 91mobiles (@91mobiles) May 10, 2023
వన్‌ప్లస్ నార్డ్ ఎన్30 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పొందుపరిచారు. ఇది కేవలం 195 గ్రాముల బరువుతో చాలా స్లీక్ లుక్‌లో ఉంటుంది. ప్రస్తుతం యూఎస్ మార్కెట్ విడుదలైన ఈ OnePlus Nord N30 5G ధర సుమారుగా రూ.24,800 వరకు ఉంటుంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో ప్రస్తుతం ప్రీఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. జూన్ 8 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను షిప్పింగ్ చేయనున్నట్లు వన్‌ప్లస్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
జూన్‌లో మరిన్ని కొత్త స్మార్ట్‌ఫోన్స్
గూగుల్, సామ్సంగ్, ఐకూ, నోకియా లాంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు ఇప్పటికే భారత మార్కెట్లో విడుదల అయ్యి మంచి ఆదరణ పొందుతున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో యూజర్ల మతులు పోగొడుతున్నాయి.
ఈ జూన్ నెలలోనూ చాలా మంచి బ్రాండెడ్ ఫోన్లు మనల్ని పలుకరించనున్నాయి. ప్రధానంగా రియల్మీ 11ప్రో 5జీ సిరీస్, ఐకూ నియో 7 ప్రో, ఒప్పో ఎఫ్23 ప్రో, ఒన్‌ప్లస్ 11 మార్బుల్ ఒడిస్సీలు ఈ నెలలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. మంచి ఐకానిక్ ఫీచర్లతో, స్పెసిఫికేషన్స్‌తో, కెమోరా సెటెప్తో, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కొన్ని బ్రాండ్లు అయితే ప్రీ ఆర్డర్ చేసిన వారికి డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం, త్వరపడండి.
ఇవీ చదవండి: