ETV Bharat / science-and-technology

వన్​ ప్లస్​ నుంచి కొత్త ప్రొడక్ట్​.. 100W ఫాస్ట్​ ఛార్జర్.. లాంచ్ అప్పుడే! - వన్​ ప్లస్​ 100 W చార్జర్లు

వన్​ప్లస్​ నుంచి మరో కొత్త ప్రొడక్ట్ రానుంది. వన్​ప్లస్​ 100 వాట్ సామర్థ్యం కలిగిన డ్యూయల్​ పోర్ట్​ ఛార్జర్​ను విడుదల చేయనుంది. ఇలాంటి ప్రొడక్ట్ విడుదల చేయడం ఇదే మొదటి సారి అని సంస్థ పేర్కొంది. ఈ క్రేజీ ఛార్జర్​ అద్భుతమైన ఫీచర్లపై ఓ లుక్కేయండి. ​

OnePlus 100W charger
OnePlus 100W charger
author img

By

Published : Jan 3, 2023, 11:13 AM IST

స్మార్ట్​ ఫోన్ల కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యాపిల్​, సామ్​సంగ్, షావోమి, వన్​ప్లస్​ లాంటి కంపెనీలు కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నాయి. అందులో ముఖ్యంగా వన్​+ కంపెనీ కొద్ది రోజులుగా మొబైల్​ ఫోన్లు కాకుండా ఇతర ఉపకరణాలపై దృష్టిసారించింది. ఇటీవల ఈ సంస్థ టీడబ్ల్యూఎస్​ (ట్రూ వైర్​లెస్​ స్టీరియో) ఇయర్​ బర్డ్స్​, కొత్త మానిటర్లు, టీవీలు తదితర పరికరాలను ఆవిష్కరించింది. కాగా, మొబైల్​ ఫోన్లకు ఫేమస్​ అయిన ఈ సంస్థ నుంచి ఇప్పుడు మరో కొత్త ప్రొడక్ట్​ రాబోతుంది. అదే 100 వాట్ సామర్థ్యం కలిగిన ఛార్జర్.

వన్​ ప్లస్ 100W​ ఫాస్ట్​ ఛార్జింగ్​ ఫీచర్లు :
ఈ వన్​ ప్లస్ 100W​ ఫాస్ట్​ ఛార్జింగ్​ బ్యాటరీకి ఓ యూనిక్​ ఫీచర్​ ఉంది. అదే డ్యూయల్​ పోర్ట్ సూపర్​ ఫ్లస్​ ఛార్జింగ్ సదుపాయం​. ఈ ఛార్జర్​లో రెండు పోర్టులుంటాయి. అందులో ఒకటి యూఎస్​బీ-ఏ కాగా, మరొకటి టైప్​సీ పోర్టు. ఈ రెండింటినీ ఒకే సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఈ ఛార్జర్​ 65 వాట్స్​ పీడీ(పవర్​ డెలివరీ) సామర్థ్యం కలిగి ఉన్నట్లు సమాచారం.

డ్యూయర్​ పోర్ట్​ ఫీచర్​:
ఈ డ్యూయల్​​ పోర్ట్ ఛార్జర్​కు​ చాలా ప్రత్యేకత ఉంది. మార్కెట్లలో ఉన్న వాటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఛార్జర్​ను స్మార్ట్​పోన్లు, టీడబ్య్లూఎస్​, ల్యాప్​టాప్​లకు కూడా వాడొచ్చు. ఈ ఛార్జర్​ పన్​ప్లస్​ నుంచి వస్తున్న కొత్త ఫోన్ 'వన్​ప్లస్​ 11' కోసం ప్రత్యేకంగా డిజైన్​ చేసినట్లు తెలుస్తోంది. సంస్థ చెబుతున్న దాని ప్రకారం ఈ ఛార్జర్​తో 25 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్​ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్​ అవుతుంది.

ఛార్జింగ్​ రక్షణకు అనుగుణంగా ఉన్న మొదటి ప్రొడక్ట్​గా ఈ ఛార్జర్​ను పేర్కొంటోంది సంస్థ. ఈ ఛార్జర్ వాడే స్మార్ట్​ ఫోన్​లో 'బ్యాటరీ మేనేజ్​మెంట్​ చిప్​'ను పొందుపరిచారు. దీంతో పాటు కచ్చితమైన బ్యాటరీ పరిస్థితిని తెలుసుకోవడానికి 13 సెన్సార్లతో డిజైన్​ చేశారు. తొలుత చైనాలో ఈ ప్రొడక్ట్​ లాంచ్​ చేయబోతున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలోకి ఎప్పుడు రానుందో అనే విషయంపై క్లారిటీ లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.