ETV Bharat / science-and-technology

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌.. వీడియోలో నచ్చిన కంటెంట్‌ చూసేలా..

యూట్యూబ్‌లో వీడియోలో తమకు కావాల్సిన కచ్చితమైన అంశం గురించి వెతికేందుకు కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్ల సమయం ఆదా అవుతుందని గూగుల్ చెబుతోంది.

youtube new feature
యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌
author img

By

Published : Dec 24, 2022, 9:18 AM IST

Youtube New Features : తనదైన శైలిలో యూజర్లకు ఆకట్టుకుంటూ సోషల్​మీడియాను ఒక ఊపు ఊపేస్తుంది యూట్యూబ్. మనకు కావాల్సిన ప్రతి సమాచారం ఇక్కడ లభిస్తుంది. రోజుకు కొత్త అప్​డేట్లతో సరికొత్త ఫీచర్​లను తీసుకొచ్చి యూజర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్లతో సమయం ఆదా..పని సులువు రెండూ జరుగుతున్నాయి.యూట్యూబ్‌లో వీడియోలో తమకు కావాల్సిన కచ్చితమైన అంశం గురించి వెతికేందుకు కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్ల సమయం ఆదా అవుతుందని గూగుల్ చెబుతోంది.

వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరియం చేయనుంది. దిల్లీలో జరుగుతున్న గూగుల్ ఫర్‌ ఇండియా 2022 కార్యక్రమంలో కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. సెర్చ్‌ ఇన్‌ వీడియో పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు వీడియోలో తమకు నచ్చిన అంశం గురించి సులువుగా వెతకొచ్చని యూట్యూబ్‌ చెబుతోంది.

యూట్యూబ్‌లో యూజర్‌ దిల్లీ గురించిన వీడియో చూస్తున్నారు. అందులో దిల్లీలోని ఎర్రకోట (రెడ్​ఫోర్ట్) ఎలా ఉందో చూడాలనుకుంటే..? వీడియోలో కుడివైపు కింద భాగంలో సెర్చ్‌బార్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసి రెడ్‌ఫోర్ట్‌ అని టైప్‌ చేస్తే.. వీడియోలో దానికి సంబంధించిన విజువల్స్‌ను చూపిస్తుంది. ఈ ఫీచర్‌ వల్ల యూజర్‌కు కావాల్సిన కంటెంట్ సులువుగా వెతకడంతోపాటు, సమయం ఆదా అవుతుందని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న వీడియో త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఫీచర్‌తోపాటు యూట్యూబ్‌ మల్టీసెర్చ్‌ ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో యూజర్లు సెర్చ్‌ ఇన్‌ వీడియో చేసేప్పుడు ఫొటో, స్క్రీన్‌షాట్‌ ద్వారా వెతకడంతోపాటు, సందేహాలకు సంబంధించిన ప్రశ్నలను తమకు అనువైన భాషలో అడగొచ్చు. ఇవేకాకుండా బైలింగ్వల్‌ సెర్చ్‌ రిజల్ట్‌ అనే ఫీచర్‌ను కూడా పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్‌ ఆంగ్లంలో ప్రశ్నను అడిగి తెలుగులో సమాధానం పొందొచ్చు. ముందుగా ఈ ఫీచర్‌ను హిందీ భాషలో పరిచయం చేయనున్నారు. తర్వాత తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో తీసుకురానున్నట్లు గూగుల్ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.