Low Budget Apple Laptop : యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఎక్కువ ధర కలిగి ఉంటాయి. అందుకే వీటిపై ఇష్టం ఉన్నప్పటికీ సాధారణ ప్రజలు వీటిని కొనలేని పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని యాపిల్ కంపెనీ ఓ బడ్జెట్ మ్యాక్‌బుక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని మార్కెట్ వర్గాల టాక్.
గూగుల్, విండోస్‌కు పోటీగా
Apple Vs Windows Vs Google Laptop : డిజిటైమ్స్ అనే సంస్థ తన రిపోర్ట్‌లో.. యాపిల్ కంపెనీ బడ్జెట్ ధరలో ఓ మ్యాక్‌బుక్ రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ప్రధానంగా దీనిని.. నేడు మార్కెట్లో హవా కొనసాగిస్తున్న గూగుల్ క్రోమ్‌బుక్, విండోస్ ల్యాప్‌టాప్‌లకు పోటీగా తీసుకువస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.
త్వరలోనే..
Apple Low Cost MacBook Launch Date : యాపిల్ కంపెనీ తన సరికొత్త బడ్జెట్ మ్యాక్‌బుక్‌ను 2024 ద్వితీయార్థంలో మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది.
బడ్జెట్ సెగ్మెంట్‌పై టార్గెట్
Apple Budget Segment Products : సాధారణంగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులు అన్నీ చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అయితే వీటిలో ఉండే క్వాలిటీ, బ్రాండ్ అస్యూరెన్స్ అద్భుతంగా ఉంటుంది. అందుకే అవి అంటే యూజర్స్‌కు చాలా ఇష్టం. సాధారణంగా యాపిల్ ల్యాప్టాప్స్ ధరలు రూ.80,000 కంటే ఎక్కువగానే ఉంటాయి. వీటిని సామాన్యులు కొనలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ ధరలో గూగుల్‌కు చెందిన క్రోమ్‌బుక్ అందుబాటులో ఉంది. దీని ధర సుమారుగా రూ.30,000 వరకు ఉంటుంది. ఇక మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ ల్యాప్టాప్స్ అయితే అతి తక్కువ ధర నుంచి అత్యంత ఎక్కువ ధర వరకు అన్ని ప్రైస్ రేంజ్‌ల్లో లభిస్తాయి. అందుకే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. యాపిల్ కంపెనీ కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తోంది.
డిజిటల్ ఎరా!
Low Cost Laptop For Students : కరోనా తరువాత డిజిటల్ మోడ్ ఎడ్యుకేషన్ పెరిగింది. ఫలితంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్ తప్పనిసరి అయ్యింది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితులు కూడా పెరిగాయి. అందువల్ల సాధారణ ఆఫీస్ వర్క్‌కు కూడా ల్యాప్టాప్స్ అవసరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు.. వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలో ల్యాప్‌టాప్స్‌ను తీసుకువస్తున్నాయి.
లో-కాస్ట్ ఐఫోన్
Upcoming Low Cost IPhone : యాపిల్ కంపెనీ త్వరలో ఎస్ఈ సిరీస్‌లో భాగంగా ఓ తక్కువ ధర ఐఫోన్‌ను తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే దీనిపై మార్కెట్ వర్గాల్లో చాలా ఉత్సుకత నెలకొంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. యాపిల్ తన ఫస్ట్ జనరేషన్ ఐఫోన్‌ను రూ.39,000 ధరతో లాంఛ్ చేసింది. సెకెండ్ జనరేషన్ ఐఫోన్‌ను రూ.42,500కు తెచ్చింది. అలాగే ఐఫోన్ ఎస్ఈ-3ను రూ.43,900 ధరతో విడుదల చేసింది. మరి ఇప్పుడు వీటి కంటే తక్కువ ధరలో ఐఫోన్ తెస్తుందా? లేదా? అనేది చూడాలి.