Laptop Charging Tips In Telugu : ఈ కంప్యూటర్ యుగంలో యంత్రాల వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కార్యాలయ పనుల్లో కంప్యూటర్లు తప్పని సరి. పీసీ, ల్యాప్‌టాప్.. ఇలా రెండు రకాలుగా ఇవి దొరుకుతాయి. అయితే పీసీని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లలేం కనుక చాలా మంది ల్యాప్‌టాప్‌లు కొనేందుకు మొగ్గు చూపుతారు. అయితే, వీటి వాడకంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. అందులో ఛార్జింగ్ సమస్య కూడా ఒకటి. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టినా కొన్ని సార్లు ఛార్జ్ కాదు. అలాంటప్పుడు కింద చెప్పిన ముఖ్యమైన ( Laptop Charging Tips ) టిప్స్ పాటించి చూడండి. బ్రాండ్‌తో, కంపెనీతో సంబంధం లేకుండా Windows తో పాటు macOS, Linux సాఫ్ట్వేర్లతో నడిచే అన్నింటికీ ఈ టిప్స్ వర్తిస్తాయి. మీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఒకసారి ఈ టిప్స్ ట్రై చేసి చూడండి.
1. కనెక్షన్ సరి చేసుకోవడం
Laptop Battery Connector Socket : ఛార్జింగ్ పెట్టిన తర్వాత ప్లగ్‌లో సాకెట్ సరిగా ఉందో లేదో చూసుకోండి. అయినా ఛార్జింగ్ కావడం లేదంటే.. వేరే ప్లగ్‌లో సాకెట్ పెట్టి చూడండి. కొన్ని సార్లు ఆ సాకెట్ పనిచేయకపోయినా, పవర్ సప్లై లేకపోయినా ఛార్జింగ్ కాదు. కనుక రెండో సాకెట్లో చెక్ చేసుకోవడం ఉత్తమం. దీనితో పాటు మీ ల్యాప్‌టాప్ ఛార్జింగ్ కేబుల్ కూడా అందులో ఫిట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
2. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టడం
Laptop Removable Battery Charging : ఒకవేళ మీ ల్యాప్‌టాప్ రిమూవబుల్ బ్యాటరీ అయితే.. దాన్ని తీసేసి ఛార్జింగ్ పెట్టి చూడండి. తీసే ముందు దాన్ని షట్‌డౌన్ చేయండి. బ్యాటరీ తీసిన తర్వాత ఆ ప్రాంతంలో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఒక శుభ్రమైన వస్త్రంతో వాటిని తొలగించండి. అలా బ్యాటరీ తొలగించి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ అయితే.. బ్యాటరీ ప్రొబ్లమ్ అని గుర్తించండి. ఒక వేళ మీ ల్యాప్‌టాప్‌లో రిమూవల్ బ్యాటరీ ఆప్షన్ లేకుంటే.. సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే.. సమస్య ఏమిటో చెబుతారు. మీ అంతట మీరే బ్యాటరీ తీయాలని ప్రయత్నిస్తే.. రిస్కులో పడతారు జాగ్రత్త!
3. ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడటం
Laptop Original Charger Usage : ఒరిజినల్ ఛార్జర్ పాడైన తరువాత, చాలా మంది థర్డ్ పార్టీ ఛార్జర్లు ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల అది ల్యాప్‌టాప్ ఛార్జింగ్, బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అవి తక్కువ వోల్టేజీతో పనిచేసే అవకాశముంది. ఛార్జింగ్ మెల్లగా అవడం, కొన్నిసార్లు కాకపోవడం లాంటివి జరుగుతాయి. వీటితో పాటు వోల్టేజీ, విద్యుత్తు సరఫరాను అనుసరించి, మనం ఛార్జింగ్ పెట్టే సాకెట్ల పైనా దృష్టి పెట్టాలి.
4. ఛార్జింగ్ కేబుల్ చెక్ చేసుకోవడం
Laptop Charger Cable Damage : మన ఛార్జింగ్ కేబుల్ డ్యామేజ్ కావడం వల్ల కూడా ఛార్జింగ్ కాదు. కనుక ఛార్జింగ్ పెట్టే ముందు మన కేబుల్ వైర్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మనకు తెలియకుండా ఎక్కడో చిన్నపాటి డ్యామేజ్ అయ్యే అవకాశముంది. కనుక ఒకసారి వైర్ సరి చూసుకుని ఛార్జింగ్ పెట్టాలి. దీనితో పాటు పోర్టర్ కూడా క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు కేబుల్ అందులో ఫిట్ అయ్యిందో? లేదో? చూసుకోవాలి.
5. వనరుల వినియోగాన్ని తగ్గించడం
Laptop Heating Issue : మీరు మీ ల్యాప్‌టాప్‌లో ఎక్కువ పని చేస్తుంటే, అది మళ్లీ ఛార్జింగ్ కావడానికి టైం పట్టవచ్చు. సిస్టం హీట్ అయినప్పుడు దాన్ని కూల్ చేయడానికి ఫ్యాన్ తిరగాలి. దీనికి ఎక్కువ బ్యాటరీ పవర్ ఖర్చవుతుంది. ల్యాప్‌టాప్‌లో ఏయే ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయో, అవి ఎంత బ్యాటరీ పవర్‌ను వినియోగించుకుంటున్నాయో తెలుసుకునేందుకు Ctrl + Shift + Esc ప్రెస్ చేసి More details పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఎక్కువ ప్రోగ్రాములుంటే కొన్ని ఆపేసి సిస్టం షట్‌డౌన్ చేయడం మంచిది.
6. మానుఫ్యాక్చర్ పవర్ చెకింగ్
Laptop Manufacture Power Issue : ఇతర సాఫ్ట్వేర్ సమస్యలు కూడా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఛార్జ్ కాకుండా ఉండేలా చేస్తాయి. విండోస్‌లోని పవర్ ప్లాన్స్.. మీ బ్యాటరీని ఛార్జ్ చేయకుండా నిరోధించే అవకాశముంది. ఇది తెలుసుకోవడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి System > Power & sleep and clicking Additional power settings లో చూడాలి. అక్కడ ఇతర ప్లాన్లు కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది.
7. బ్యాటరీ డ్రైవ్‌లు అప్‌గ్రేడ్ లేదా మార్చడం
Laptop Driver Update : బ్యాటరీ అనేది ఎక్స్టర్నల్ డివైజ్ కనుక Windows దానితో సరిగ్గా ఇంటర్ఫేస్ చేయడానికి నిర్దిష్ట డ్రైవర్లను ఉపయోగిస్తుంది. ఛార్జింగ్ కాకపోవడానికి ఇవి కూడా ఒక కారణం కావచ్చు. వీటిని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా లేదా మార్చడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీనికోసం Win + X ప్రెస్ చేసి Device Manager సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత Batteries పై క్లిక్ చేస్తే Microsoft AC Adapter, Microsoft ACPI-Compliant Control Method Battery అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిపై Right-click చేసి అప్‌గ్రేడ్ చేయవచ్చు.
పైన పేర్కొన్న స్టెప్స్, టిప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత మళ్లీ ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూడండి. ఇవన్నీ చేసినా.. ఫలితం రాలేదంటే కొత్త ఛార్జర్ కొనుగోలు చేయండి. వీలైతే ఒరిజినల్ కంపెనీ ఛార్జర్ తీసుకోండి. ఒకవేళ అలా వీలుకాకపోతే.. ఆన్లైన్లో మంచి రివ్యూస్, రేటింగ్స్ ఉన్న థర్డ్ పార్టీ ఛార్జర్లు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు.
Smartphone Security Tips : స్మార్ట్‌ఫోన్‌ను వాలెట్‌లా వాడుతున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!