ETV Bharat / science-and-technology

JioPhone 5G : జియోఫోన్​ 5జీ పిక్స్​ లీక్​.. ఫీచర్స్, ధర వివరాలివే! - జియోఫోన్​ 5జీ లిక్స్​ లీక్​

JioPhone 5G : జియోఫోన్​ 5జీ ఫొటోలు కొన్ని ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ టిప్​స్టర్​ తన ట్విట్టర్​ హ్యాండిల్​లో.. ఈ స్మార్ట్​ఫోన్ కెమెరా వివరాలతో పాటు స్పెషల్​ ఫీచర్స్​ గురించి కూడా వివరించాడు. రిలయన్స్ జియో దీపావళి లేదా కొత్త సంవత్సరంలోపు ఈ బడ్జెట్ స్మార్ట్​ఫోన్​ను మార్కెట్​లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పూర్తి వివరాలు మీరే చూడండి.

JioPhone 5G
JioPhone 5G leak reveals design and key specifications
author img

By

Published : Jun 23, 2023, 3:11 PM IST

Updated : Jun 23, 2023, 3:17 PM IST

JioPhone 5G : రిలయన్స్​ జియో త్వరలో 5జీ స్మార్ట్​ఫోన్​ను లాంఛ్​ చేయనుంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాకముందే.. జియోఫోన్​ 5జీ పిక్స్ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. దీనితో పాటు ఈ స్మార్ట్​ఫోన్​లోని కెమెరా, ప్రాసెసర్​తో సహా పలు స్పెసిఫికేషన్స్, ఫీచర్స్​, ధర వివరాలు కూడా లీక్​ అయ్యాయి.

జియో 5జీ ఫోన్​ లాంఛ్​ ఎప్పుడు?
దీపావళి లేదా కొత్త సంవత్సరంలోపు ఈ బడ్జెట్​ 5జీ స్మార్ట్​ఫోన్​ను మార్కెట్​లో విడుదల చేయడానికి రిలయన్స్​ జియో సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.​ ఇదే జరిగితే 5జీ మొబైల్​ విపణిలో ఒక సంచలనం చెలరేగుతుంది.

టిప్​స్టర్​ లీక్స్​
JIO Phone 5G Specifications : జియో 5జీ ఫోన్​కు చెందిన కొన్ని ఫొటోలు ఆన్​లైన్​లో దర్శనమిస్తున్నాయి. అర్పిత్​ సత్యప్రకాశ్​ పటేల్​ అనే ఓ టిప్​స్టర్ ట్విట్టర్​ హ్యాండిల్​లో ఈ జియో 5జీ ఫోన్ పిక్స్ కనిపించాయి. ఈ చిత్రాల్లో​ జియో 5జీ స్మార్ట్​ఫోన్​ నలుపు రంగులో కనిపిస్తోంది. డ్యూయెల్​ రియర్​ కెమెరా ఫోన్​ పైభాగం మధ్యలో ఉంది. బహుశా ఇది 13 మెగా పిక్సెల్​ ఏఐ కెమెరాతో సహా 2 మెగా పిక్సెల్​ సెకెండరీ లెన్స్​ కూడా కలిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఫ్రంట్​ కెమెరా విషయానికి వస్తే వాటర్​ డ్రాప్​ నాచ్​ 5 మెగా పిక్సెల్​ కెమెరాలాగా అనిపిస్తోంది. ఫోన్​ వెనుక భాగం ఫైబర్​ ప్లాస్టిక్ బాడీతో తయారు చేసినట్లు తెలుస్తోంది. జియో లోగో కూడా దానిపై స్పష్టంగా కనిపిస్తోంది.

రూ.10,000 లకే 5జీ స్మార్ట్​ఫోన్​!
జియో 5జీ స్మార్ట్​ఫోన్​ ధర బహుశా రూ.10,000 వరకు ఉండొచ్చని అంచనా. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనిలో యూనిసోక్​ లేదా డైమెన్సిటీ 700 ప్రాసెసర్​ ఉండొచ్చని భావిస్తున్నారు.

  • Exclusive!!🔥Here's a sneak-peek at the upcoming unreleased JioPhone 5G.
    The phone is expected to release between Diwali and New Year. The expected price is under ₹10k.
    Not much specs known but possibly a Unisoc 5G or a Dimensity 700 processor.
    13+2MP Rear
    5MP Front camera. pic.twitter.com/bzRRIH8Sdn

    — Arpit 'Satya Prakash' Patel  (@ArpitNahiMila) June 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నోట్​ : ఆన్​లైన్​లో​ కనిపిస్తున్న ఈ జియో 5జీ ఫోన్ ఇమేజెస్​ వాస్తవమైనవా? కాదా? అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు.

ఫ్లాష్​బ్యాక్​ లీక్స్​
గతంలో కౌంటర్​పాయింట్ రీసెర్చ్​ రిపోర్ట్​ జియోఫోన్ 5జీ ఫీచర్స్​,​ స్పెసిఫికేషన్స్​ గురించి తెలియజేసింది. అందులో జియోఫోన్​ 5జీలో స్నాప్​డ్రాగన్ 480 ప్రాసెసర్​ ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీనితో పాటు ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ 4జీబీ+32జీబీ స్టోరేజీతో వస్తుందని వివరించింది.

జియోఫోన్​ 5జీ స్పెసిఫికేషన్స్​!

  • డిస్​ప్లే : 6.5 అంగుళాల హెచ్​డీ + ఎల్​సీడీ డిస్​ప్లే; 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​
  • బ్యాటరీ : 5,000ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ
  • ఫాస్ట్ ఛార్జింగ్​ : 18 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 12

జియోఫోన్​ 5జీలో.. గూగుల్ మొబైల్​ సర్వీసెస్​, జియో యాప్స్​ను ముందుగానే లోడ్​ చేసి ఇవ్వనున్నారని కౌంటర్​పాయింట్ రీసెర్చ్​ రిపోర్ట్​ తెలిపింది.

గూగుల్​తో కలిసి..
రిలయన్స్ జియో కూడా తాము గూగుల్​తో కలిసి బడ్జెట్​ ధరలో 5జీ ఫోన్​ను తీసుకొస్తున్నట్లు గతంలోనే స్పష్టంగా చెప్పింది. ముఖేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్​ జియో బడ్జెట్​ ధరలో.. సామాన్యులకు అందుబాటులో ఉండే డివైజ్​లను మార్కెట్​లోకి విడుదల చేస్తోంది. 2022 అక్టోబర్​లో జియోబుక్​ పేరుతో తన మొదటి ల్యాప్​టాప్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. 11.6 అంగుళాల డిస్​ప్లే, స్నాప్​డ్రాగన్​ 665 ప్రాసెసర్​, 5000ఎమ్​ఏహెచ్​ బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ ల్యాప్​టాప్​ ధర కేవలం రూ.15,799 కావడం గమనార్హం.

Last Updated : Jun 23, 2023, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.