Jio AirFiber Launch : దేశంలో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో .. రిలయన్స్ జియో సెప్టెంబర్ 19న సరికొత్త జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఇది హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, పుణె నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే త్వరలోనే దీనిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది.
జియో ఎయిర్‌ఫైబర్ - లక్ష్యాలు
- దేశంలోని ప్రతీచోట ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం.
- ప్రతి ఇల్లు, ప్రతీ చిన్న వ్యాపారం సహా భారతదేశం మొత్తాన్ని ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా మార్చడం.
- టీవీ లేదా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు అందరూ నాణ్యమైన సర్వీస్‌లు పొందేలా అప్‌గ్రేడ్ కావడానికి జియో ఎయిర్‌ఫైబర్ సహకరిస్తుంది.
- జియో ఎయిర్‌ఫైబర్ ప్రధానంగా.. ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్
యూజర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. జియోఫైబర్ వేరు.. జియో ఎయిర్‌ఫైబర్ వేరు. ఈ రెండింటి ప్లాన్లు కూడా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం రిలయన్స్ జియో రెండు రకాల జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అవి:
- జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్
- Vanilla జియో ఎయిర్‌ఫైబర్
Jio AirFiber Max Plans : దీనిలో ప్రధానంగా మూడు ప్లాన్లు ఉన్నాయి. ఇవి అన్నీ అపరిమితమైన డేటాను అందిస్తాయి. అవి:
1. రూ.1499 ప్లాన్ : ఈ ప్లాన్‌లో 300 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
2. రూ.2499 ప్లాన్ : ఈ ప్లాన్‌లో 500 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
3. రూ.3,999 ప్లాన్ : ఈ ప్లాన్‌లో 1000 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
నోట్ : ఈ మూడు ప్లాన్స్‌లోనూ 550+ డిజిటల్ ఛానల్స్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రైమ్ సహా 16 ఓటీటీ యాప్స్ లభిస్తాయి. ముఖ్యంగా ఈ జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి.. రిలయన్స్ జియో కంపెనీ 4కె సెట్-టాప్ బ్యాక్స్, వాయిస్ యాక్టివ్ రిమోట్, రౌటర్ అందిస్తుంది.
జియో ఎయిర్‌ఫైబర్ - ప్లాన్స్
జియో ఎయిర్‌ఫైబర్‌లో మూడు సాధారణ ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా అపరిమితమైన డేటా ఫెసిలిటీ కలిగి ఉంటాయి.
1. రూ.599 ప్లాన్ : ఈ ప్లాన్‌లో 30 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. దీనిలో 550+ డిజిటల్ ఛానల్స్, 14 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది.
2. రూ.899 ప్లాన్ : ఈ ప్లాన్‌లో 100 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
3. రూ.1199 ప్లాన్ : ఈ ప్లాన్‌లో 100 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
నోట్: రూ.899, రూ.1199 ప్లాన్స్‌లో 550+ డిజిటల్ ఛానల్స్, 14 ఓటీటీ యాప్స్‌తో పాటు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం లభిస్తాయి.
నోట్ : ఈ జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ అన్నీ 6 నెలలు/ 12 నెలల కాలపరిమితితో లభిస్తాయి. మరీముఖ్యంగా జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్ తీసుకున్నవారు.. రూ.1000 ఇన్స్టాల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. అయితే కొన్ని సెలెక్టెడ్ సిటీల్లో మాత్రం ఈ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుంది.
జియో ఎయిర్‌ఫైబర్ బుక్ చేసుకోవడం ఎలా?
ఎవరైతే జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ కావాలని అనుకుంటారో.. వారు 60008-60008 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. లేదా జియో అధికారిక వెబ్సైట్లో ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ - బెనిఫిట్స్
1. డిజిటల్ ఎంటర్టైన్మెంట్
- 550+ డిజిటల్ టీవీ ఛానల్స్
- క్యాచ్-అప్ టీవీ
- మోస్ట్ పాప్యులర్ 16+ ఓటీటీ యాప్స్ విత్ సబ్స్క్రిప్షన్
2.బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్
- హై స్పీడ్ వై-ఫై సర్వీస్. ఇది మీ పరిసరాలు అంతటినీ, అన్ని డివైజ్‌లను కవర్ చేస్తుంది.
3. స్మార్ట్ హోమ్ సర్వీసెస్
- వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం - క్లౌడ్ పీసీ
- భద్రత, నిఘా వ్యవస్థ ఏర్పాటు (CCTV కెమెరా ఏర్పాటు)
- హెల్త్‌కేర్
- ఎడ్యుకేషన్
- స్మార్ట్‌హోం ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)
- గేమింగ్
- హోమ్ నెట్వర్కింగ్
4. హోమ్ డివైజెస్ :
- రిలయన్స్ జియో కంపెనీ.. జియో ఎయిర్‌ఫైబర్‌తో పాటు, అదనపు ఖర్చు లేకుండా (ఉచితంగా) హోమ్ డివైజ్‌లు అందిస్తుంది. ముఖ్యంగా వై-ఫై రౌటర్ అందిస్తారు.
- 4కె స్మార్ట్ సెట్ టాప్ బాక్స్
- వాయిస్-యాక్టివ్ రిమోట్
మార్కెట్ మొత్తం జియో గుప్పెట్లో..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ మొబైల్ డేటా నెట్వర్క్ 'రిలయన్స్ జియో'. ఇది ఈ సెప్టెంబర్ 19న జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసెస్ ప్రారంభించింది. దీనిని ప్రస్తుతం దేశంలోని 8 ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే మిగతా సిటీలకు కూడా దీనిని విస్తరించనుంది. జియో తీసుకువచ్చిన ఈ జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌తో.. దేశంలో 1.5 మిలియన్ కి.మీ మేర జియో ఆప్టికల్ ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రెక్చర్ విస్తరించినట్లు అయ్యింది.