ETV Bharat / science-and-technology

How To See What Google Knows About You : గూగుల్​లో స్టోర్​ అయిన మీ డేటాను చూడాలా?.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - గూగుల్​లో మన డేటాను చూడడం ఎలా

How To See What Google Knows About You In Telugu : నేటి కాలంలో మన డిజిటల్ లైఫ్ మొత్తం గూగుల్​లో స్టోర్ అవుతోంది. ఒక వేళ ఎవరైనా మన అకౌంట్​ను అనధికారికంగా యాక్సెస్ చేయగలిగితే.. మనకు సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం వారి చేతిలోకి వెళ్లిపోతుంది. అందుకే గూగుల్​లో స్టోర్ అయిన మీ డేటాను ఎలా చూడాలి? అందులోని సమాచారాన్ని లేదా సర్వీసులను ఎలా డిలీట్ చేయాలి? అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

How to find out what Google knows about you
How To See What Google Knows About You
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 1:45 PM IST

How To See What Google Knows About You : నేటి టెక్నాలజీ యుగంలో వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) అనేది ఒక ఎండమావిలా తయారైంది. పేరుకు మాత్రమే ప్రైవసీ ఉంటోంది. మన డిజిటల్ లైఫ్ మొత్తాన్ని ఎవరో ఒకరు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. ఇది వినడానికి క్రేజీగా ఉన్నప్పటికీ.. ఇది చాలా భయానకమైన పరిణామం.

మనం ప్రతిరోజూ గూగుల్, యూట్యూబ్​, క్రోమ్​, జీమెయిల్​, మ్యాప్స్ ఇలా చాలా గూగుల్ సర్వీసులను వాడుతూ ఉంటాం.​ ఆన్​లైన్​లో మనకు కావాల్సిన సమాచారం గురించి సెర్చ్ చేస్తూ ఉంటాం. అలాగే చాలా మంది ఆండ్రాయిడ్​ ఫోన్లను, డివైజ్​లను వాడుతూ ఉంటారు. వాటిల్లోనూ ఎంతో ఇన్ఫర్మేషన్​ను సేవ్​ చేస్తూ ఉంటారు. కానీ ఈ సమాచారం అంతా గూగుల్​ సర్వర్​లలో సేవ్​ అవుతూ ఉంటుందని మీకు తెలుసా?

మీ గుట్టు.. నెట్టింట్లో..
Online Privacy And Security : మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు.. ఆన్​లైన్​లో మీరు చేసే ప్రతీ పని, చూసే ప్రతి అంశం కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ సమాచారం అంతా మీ గూగుల్ అకౌంట్​లోనే నమోదు అవుతూ ఉంటుంది. ఒక వేళ ఎవరైనా దానిని అక్రమంగా యాక్సెస్​ చేయగలిగితే.. ఇక మీ పని అంతే!

జాగ్రత్త పడండి!
How To Find Out What Google Knows About You :
వాస్తవానికి గూగుల్​లో నిక్షిప్తమై ఉన్న మీ సమాచారాన్ని చాలా సులువుగా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు గూగుల్ డ్యాష్​బోర్డ్ సర్వీసెస్​ను ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా మీరు https://www.google.com/dashboard వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లోకి మీ జీమెయిల్ అకౌంట్​తో లాగిన్​ అవ్వాలి.
  • Recently Used Google Services అనే ట్యాబ్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ఇటీవల మీరు ఆన్​లైన్​లో చేసిన పనుల సమాచారం అంతా కనిపిస్తుంది.
  • మీరు ఇంకా కిందకు స్క్రోల్ చేస్తూ వెళ్తే Other Google Services ఆప్షన్​ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేస్తే.. ఆన్​లైన్​లో స్టోర్ అయిన మీ సమాచారం అంతా కనిపిస్తుంది.
  • ముఖ్యంగా మీరు ఉపయోగించిన యాప్​ లేదా సర్వీస్​ను అనుసరించి.. కేటగిరీల వారీగా సమాచారం మీకు కనిపిస్తుంది.
  • మీరు సదరు సమాచారాన్ని లేదా సర్వీస్​ను డిలీట్ చేయవచ్చు. లేదా అవసరమైన డేటాను డౌన్​లోడ్​ లేదా బ్యాక్అప్​ చేసుకోవచ్చు.

X Calling Feature : ఎక్స్‌లో ఆడియో-వీడియో కాల్స్‌ ఫీచర్‌.. యాక్టివేట్‌ చేసుకోండిలా..

WhatsApp Channel Facts : వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారా.. ఈ 10 విషయాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.