ETV Bharat / science-and-technology

ఫేక్ వెబ్​సైట్స్​ను గుర్తించాలా? ఈ సింపుల్​ ట్రిక్స్​ ఫాలో అవ్వండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 3:46 PM IST

Updated : Dec 3, 2023, 3:51 PM IST

How To Check Credibility Of A Website In Telugu : మనం ప్రతిరోజూ అనేక వెబ్​సైట్లను చూస్తుంటాం. వాటిల్లో కొన్ని ఫేక్ ​వెబ్​సైట్లు కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఒక వెబ్​సైట్ నకిలీదా, ఒరిజినల్​దా? అలాగే అది సురక్షితమైనదా, లేదా.. అని తెలుసుకునేందుకు టెక్ ​నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

how to identify fake websites in google
how to check credibility of a website

How To Check Credibility Of A Website : సమాచార సాంకేతిక విప్లవం ఆధునిక మానవునికి ఒక వరమని చెప్పవచ్చు. ప్రపంచంలోని సమాచారం అంతటినీ క్షణాల్లో వెబ్​సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో జ్ఞాన సముపార్జనకు కావలసిన సమాచారం వెబ్​సైట్స్​లో కుప్పలు తెప్పలుగా లభిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని నకిలీ వెబ్​సైట్లు యూజర్లకు పెద్ద సమస్యగా తయారయ్యాయి. మరి ఒక వెబ్​సైట్​ విశ్వసనీయమైనదా? లేదా? అనేది ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. డొమైన్​ పేరును పరిశీలించాలి : వెబ్​సైట్​ని యాక్సెస్​ చేసేందుకు ఉపయోగించే అడ్రస్​నే డొమైన్​ నేమ్​ అని అంటారు. సాధారణంగా .Com, .Org, .Gov, .Edu లాంటి డొమైన్​లు ఉన్న వెబ్​సైట్​లు విశ్వసనీయమైనవిగా ఉంటాయి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఫేక్ డొమైన్​ పేర్లు కాస్త తప్పుగా ఉంటాయి.
  2. HTTPS చూసుకోవాలి : వెబ్​సైట్​ URLలో మొదట HTTPS (హైపర్​టెక్ట్స్​​​ ట్రాన్స్​ఫర్​​ ప్రోటొకాల్ సెక్యూర్) ఉండాలి. ఇలా ఉంటే ఆ వెబ్​సైట్​ సురక్షితమైనది అని అర్థం.
  3. రీడైర్ట్ అవుతుంటే.. : కొన్ని వెబ్​సైట్లు ఓపెన్ చేసినప్పుడు.. అవి మరో వైబ్​సైట్​కు రీడైరెక్ట్ చేస్తుంటాయి. అలాంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
  4. About us, Contact పేజ్​లు పరిశీలించాలి : ఒరిజనల్ వెబ్​సైట్​లో About us, Contact పేజ్​లు ఉంటాయి. ఫేక్​ వెబ్​సైట్లలో ఈ వివరాలు ఉండవు. అందువల్ల ఒక వెబ్​సైట్​ సరైనదా కాదా అని తెలుసుకునేందుకు.. About us పేజ్​పై క్లిక్ చేసి పరిశీలించాలి. కాంటాక్ట్​ పేజ్​లోకి వెళ్లి వెబ్​సైట్ యజమాని వివరాలు చూడాలి. ఒక వేళ ఈ వివరాలు లేకపోతే దానిని ఫేక్ వెబ్​సైట్​గా గుర్తించాలి.
  5. వెబ్​సైట్​ క్రెడిబిలిటీని తెలిపే ఆన్​లైన్​ టూల్స్​ : WOT( Web of Trust) అనే ఎక్స్​టెన్షన్​ ఫేక్ వెబ్​సైట్లను గుర్తించడానికి ఉపయోపగపడుతుంది. దీనిని గూగుల్​ క్రోమ్​కు బ్రౌజర్​కు యాడ్​ చేసుకోవాలి. తరువాత మీరు మీకు కావాల్సిన వెబ్​సైట్​ను సెర్చ్ చేయాలి. వెంటనే మీకు ఒర్జినల్ సైట్​ ముందు గ్రీన్​ టిక్​, ఫేక్ వెబ్​సైట్​ ముందు రెడ్​ టిక్ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు నకిలీ వెబ్​సైట్లను చాలా సులువుగా గుర్తించవచ్చు.
  6. క్రోమ్ ఎక్స్​టెన్షన్​ : వెబ్​సైట్​ ఎంత కచ్చితమైనదో తెలుసుకునేందుకు ఈ Stopaganda Plus అనే ఎక్స్​టెన్షన్​ ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్​టెన్షన్​లో మోర్ డీటైల్స్ ఆప్షన్​ను క్లిక్​ చేస్తే అది https://mediabiasfactcheck.com/ కు డైరెక్ట్​ చేస్తుంది. అక్కడ సదరు వెబ్​సైట్​కు చెందిన క్రెడిబిలిటీ రిపోర్ట్​ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఫేక్ వెబ్​సైట్లను గుర్తించగలుగుతారు.

సైబర్​ స్కామ్​లు విపరీతంగా పెరిగిపోతున్న నేటి కాలంలో.. వెబ్​సైట్​ సర్ఫింగ్​ చేస్తున్నప్పుడు, సదరు సైట్లు ఒర్జినల్​వా, కాదా అని తెలుసుకోవడం చాలా అవసరం. లేదంటే మీ కష్టార్జితమైన సొమ్మును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదా మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లు చిక్కుతుంది. తస్మాత్త్ జాగ్రత్త!

ఇన్​యాక్టివ్ జీ-మెయిల్స్​ తొలగించనున్న గూగుల్​​ - ఈ టెక్నిక్స్​ పాటిస్తే మీ అకౌంట్ సేఫ్!

మీ​ ఫోన్​లో ఈ సీక్రెట్ కోడ్స్​ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!

Last Updated : Dec 3, 2023, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.