How To Be A Gmail Ninja : మనం ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కోసం జీ-మెయిల్ వాడుతూ ఉంటాం. అయితే ఒకేసారి బల్క్ ఈ-మెయిల్స్ పంపించాలన్నా లేదా వాటికి రిప్లై ఇవ్వాలన్నా, ఫార్వార్డ్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా సమయం కూడ వృథా అవుతుంది. అయితే కొన్ని సింపుల్ షార్ట్‌కట్స్ నేర్చుకుంటే.. మనం జీ-మెయిల్ నింజా (ఎక్స్పర్ట్) అయిపోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో రోజువారీ పనులకు ఉపయోగపడే.. బెస్ట్ అండ్ సింపుల్ షార్ట్‌కట్స్ గురించి తెలుసుకుందాం.
How To Enable Gmail Shortcuts : జీ-మెయిల్లో షార్ట్‌కట్స్‌ను ఎనేబుల్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే..
- ముందుగా మీరు మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- గేర్ ఐకాన్‌పై క్లిక్ చేసి Settings ఓపెన్ చేయాలి.
- ఈ సెట్టింగ్స్‌లోనే Keyboard Shortcuts అనే ఆప్షన్ ఉంటుంది.
- ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఆప్షన్‌ను ON చేసుకోవాలి. తరువాత Save బటన్‌పై క్లిక్ చేయాలి.
- అంతే సింపుల్! షార్ట్‌కట్స్ అన్నీ ఎనేబుల్ అయిపోతాయి.
Best Gmail Shortcuts For Daily Use :
- How To Compose Email : మీరు ఈ-మెయిల్ కంపోజ్ చేయాలనుకుంటే.. సింపుల్‌గా మీ కీబోర్డ్‌లోని C అనే అక్షరాన్ని ప్రెస్ చేయాలి. వెంటనే న్యూ ఈ-మెయిల్ విండో ఓపెన్ అవుతుంది.
- How To Reply To Email : మీరు కీబోర్డ్‌లోని A అక్షరాన్ని ప్రెస్ చేస్తే.. అన్ని ఈ-మెయిల్స్‌కు ఒకేసారి రిప్లై ఇవ్వవచ్చు. అలాకాకుండా R అనే అక్షరాన్ని ప్రెస్ చేస్తే.. మీరు చివరిసారిగా ఎవరికైతే ఈ-మెయిల్ పంపారో.. వారికే మరలా రిప్లై ఈ-మెయిల్ పంపించవచ్చు.
- How To Forward Email : మీరు ఏదైనా ఈ-మెయిల్ తెరిచి ఉండి.. దానిని ఇతరులకు ఫార్వర్డ్ చేయాలంటే.. సింపుల్‌గా మీ కీబోర్డ్‌లోని F అక్షరాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది.
- How To Archive Email : మీరు ఏదైనా ఈ-మెయిల్‌ను ఇన్‌బాక్స్ నుంచి తీసివేయాలన్నా లేదా దానిని ఆర్కైవ్ చేయాలన్నా.. సింపుల్‌గా మీ కీబోర్డ్‌లోని E అక్షరాన్ని ప్రెస్ చేయాలి.
- How To Labeling Email : మీరు ఏదైనా ఒక ఈ-మెయిల్‌ను కేటగిరైజ్ చేయాలన్నా, లేదా ఆర్గనైజ్ చేయాలన్నా.. సింపుల్‌గా దానికి ఒక లేబుల్ వేసుకోవాలి. దీని కోసం మీ కీబోర్డ్‌లోని L అక్షరాన్ని నొక్కితే చాలు. అలాగే మీరు V అక్షరాన్ని ప్రెస్ చేసి కూడా ఈ-మెయిల్స్‌కు లేబుల్ వేసుకోవచ్చు. వాటిని మరో ప్లేస్‌కు మూవ్ కూడా చేసుకోవచ్చు.
- How To Star An Email : మీరు ఏదైనా ఈ-మెయిల్ ఓపెన్ చేసి, దానికి స్టార్ గుర్తు ఇవ్వాలనుకుంటే.. సింపుల్‌గా కీబోర్డ్‌లోని S అక్షరాన్ని నొక్కితే సరిపోతుంది.
బోలెడు షార్ట్‌కట్స్
Gmail Shortcuts List : జీ-మెయిల్లో ఇవే కాదు.. ఇంకా చాలా షార్ట్‌కట్స్ ఉన్నాయి. వీటన్నింటినీ ఉపయోగించుకుంటే.. మీరు కచ్చితంగా జీ-మెయిల్ నింజా అయిపోతారు. మీరు కనుక పూర్తి జీ-మెయిల్ షార్ట్‌కట్స్ గురించి తెలుసుకోవాలంటే.. సింపుల్‌గా SHIFT + ? ప్రెస్ చేస్తే సరిపోతుంది. జీ-మెయిల్ షార్ట్‌కట్స్ లిస్ట్ అంతా మీకు కనిపిస్తుంది.
SMS పంపిన తర్వాత కూడా ఎడిటింగ్‌కు ఛాన్స్ - మీ ఫొటోలతో ఎమోజీల క్రియేషన్ - గూగుల్ నయా ఫీచర్స్!