Google Drive Issues: డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోల వంటి ఫైళ్లను ఎక్కడైనా చూసుకోవటానికి గూగుల్ డ్రైవ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు ఇది విండోస్‌కు సింక్ కాకుండా ఇబ్బంది పెడుతుంది. మరి దీన్ని పరిష్కరించుకోవటమెలా?
- కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేస్తే విండోస్‌కు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. విండోస్ ప్రోగ్రామ్ క్రాష్ అయినా, కంప్యూటర్ తెర ఫ్రీజ్ అయినా దీంతో తొలగిపోతాయి. అలాగే గూగుల్ డ్రైవ్, వన్‌డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజీ యాప్‌ల సమస్యలూ పరిష్కారమవుతాయి.
- డ్రైవ్ సెటప్ అయ్యే క్రమంలో గూగుల్ ఖాతా సరిగా అనుసంధానం కాకపోయినా సింకింగ్ ఎర్రర్లు తలెత్తొచ్చు. కాబట్టి డ్రైవ్‌లో ఏవైనా ఫైళ్లను మోడిఫై చేయటానికి వీలు కాకపోతే గూగుల్ ఖాతాకు తిరిగి కనెక్ట్ కావటం మంచిది. అయితే ముందుగా గూగుల్ డ్రైవ్ ప్రిఫరెన్సెస్ నుంచి దీన్ని డిస్‌కనెక్ట్ చేయాలని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత స్టార్ట్ మెనూ నుంచి గూగుల్ డ్రైవ్‌ను ఓపెన్ చేసి.. బ్రౌజర్‌తో సైన్ ఇన్ కావాలి.
- కొన్నిసార్లు గూగుల్ ఖాతకు రీకనెక్ట్ అయినా డ్రైవ్ సింక్ కాకపోవచ్చు. ఇలాంటిప్పుడు విండోస్‌లో తాత్కాలిక ఫైళ్లను తొలగించుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్‌లోని అన్ని ఫైళ్లు సజావుగా పనిచేయటానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తాత్కాలిక ఫైళ్లను సృష్టించుకుంటుంది. అయితే కొన్నిసార్లు ఇవి కరప్ట్ కావొచ్చు. దీంతో పోగ్రామ్‌లు సరిగా పనిచేయవు. కాబట్టి టెంపరరీ ఫైళ్లను తొలగించుకుంటే మంచిది.
- అన్నీ సజావుగానే ఉన్నా సింకింగ్ కావటం లేదంటే ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ బలహీనంగా ఉంటే సింకింగ్‌తో పాటు చాలా సమస్యలు ఎదురవుతాయి. డీఎన్‌ఎస్ క్యాచీని క్లియర్ చేసుకుంటే ఇంటర్నెట్‌కు సంబంధించిన సమస్యలను చాలావరకు తొలగించుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేసి, ipconfig /flushdnsఅని టైప్ చేయాలి. తర్వాత ఎంటర్ బటన్‌ను నొక్కాలి. దీంతో డీఎన్‌ఎస్ క్యాచీ క్లియర్ అవుతుంది.
- ఇవీ చదవండి:
- గూగుల్‌లో కొత్త ఫీచర్.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను చదివేయొచ్చు
- వినూత్నం ఛాట్‌బోట్ ప్రపంచం.. అమెరికా శాస్త్రవేత్తల అరుదైన ఆవిష్కరణ