జూన్ 1 తేదీనుంచి గూగుల్ ఫొటోస్ స్టోరేజ్‌లో కొన్ని మార్పులు తీసుకురాబోతోంది. దాంతో గూగుల్ ఫొటోస్‌లో ఇకపై అపరిమితంగా హై క్వాలిటీ ఫొటోలను అప్‌లోడ్ చేయటం కుదరదు. ఇప్పటికే అప్‌లోడ్ చేసే ఫొటోలు, వీడియోలు ఏవైనా సరే ఉచిత 15 జీబీ స్టోరేజ్ పరిధిలోకే వస్తాయి. ఇది నిండిపోతే, అదనపు స్టోరేజీ కోసం గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. లేదంటే కొన్ని ఫొటోల్ని తొలగించాలి. అయితే ఉచిత 15 జీబీ ఇతర గూగుల్ యాప్స్‌కి కూడా క్లౌడ్ స్టోరేజ్‌గా పనిచేస్తుంది. ఇప్పటికే ఫొటోలను గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌కి అప్‌లోడ్ చేయడం వల్ల కొంత మెమొరీని ఆక్రమించి ఉంటాయి. దాంతో జీమెయిల్ స్టోరేజ్ తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భంలో జీమెయిల్ మెమొరీని పెంచుకోవడానికి ఏం చేయాలంటే..
మొదటిగా మీ కంప్యూటర్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో "has:attachment larger:10M" అని టైప్ చేయండి. 10 ఎంబీల కన్నా ఎక్కవ మెమొరీతో ఆటాచ్‌మెంట్లతో ఉన్న మెయిల్స్ ప్రత్యక్షమవుతాయి. వాటిల్లో అవసరం లేని మెయిల్స్‌కు టిక్ పెట్టి డిలీట్ చేయండి.
వివిధ వెబ్‌సైట్లకు లాగిన్ అయినప్పడు మన మెయిల్ ఇస్తే ఆ సైట్ నుంచి మనకు కాల్ లెటర్స్ వస్తుంటాయి. వాటితో జీమెయిల్ స్టోరేజ్ నిండిపోయే ప్రమాదం ఉంది. ఆ మెయిల్స్ రాకుండా ఉండటానికి మెయిల్ చివరలో ఉన్న "Unsubscribe" మీద క్లిక్ చేయాలి. అలా చేస్తే రకరకాల వెబ్‌సైట్ల నుంచి వచ్చే మెయిల్స్‌కు స్వస్తి చెప్పొచ్చు. అదేవిధంగా జీమెయిల్‌లోని ట్రాష్, స్పామ్ మెయిల్స్‌ను ఎప్పటికప్పడు పరిశీలిస్తూ అనవసరమైన వాటి తొలగిస్తూ ఉంటే స్టోరేజ్ పెరుగుతుంది.
ఇదీ చదవండి : ఈ సెట్టింగ్స్‌తో మెయిళ్లు మరింత సురక్షితం!