Chandrayaan 3 Latest Update : చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో భాగంగా జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్న ఇస్రో, తాజా ప్రయోగం ఆ మిషన్‌కు దోహదపడుతుందని పేర్కొంది. నమూనాలను తీసుకొని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంది.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Ch-3's Propulsion Module (PM) takes a successful detour!
In another unique experiment, the PM is brought from Lunar orbit to Earth’s orbit.
An orbit-raising maneuver and a Trans-Earth injection maneuver placed PM in an Earth-bound orbit.… pic.twitter.com/qGNBhXrwff
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) December 5, 2023
Ch-3's Propulsion Module (PM) takes a successful detour!
In another unique experiment, the PM is brought from Lunar orbit to Earth’s orbit.
An orbit-raising maneuver and a Trans-Earth injection maneuver placed PM in an Earth-bound orbit.… pic.twitter.com/qGNBhXrwffChandrayaan-3 Mission:
— ISRO (@isro) December 5, 2023
Ch-3's Propulsion Module (PM) takes a successful detour!
In another unique experiment, the PM is brought from Lunar orbit to Earth’s orbit.
An orbit-raising maneuver and a Trans-Earth injection maneuver placed PM in an Earth-bound orbit.… pic.twitter.com/qGNBhXrwff
కాగా, చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ ఈ ఏడాది ఆగస్టు 23న సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. 'విక్రమ్ ల్యాండర్', 'ప్రజ్ఞాన్ రోవర్' పరికరాల సాయంతో వివిధ ప్రయోగాలను పూర్తి చేశారు. దీంతో చందమామ సౌత్ పోల్‌పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ముందుగా చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టగా కొద్ది గంటల్లోనే రోవర్ బయటకు వచ్చింది. తనకు నిర్దేశించిన ప్రయోగాలను జాబిల్లిపై కలియతిరుగుతూ విజయవంతంగా పూర్తి చేసింది. చేపట్టిన ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రో సైంటిస్టులకు చేరవేసింది. జీటీఓ(జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్) నుంచి చంద్రుడి చివరి పోలార్ కక్ష్యకు ల్యాండర్ మాడ్యూల్‌ను తీసుకురావడం; ల్యాండర్‌ను వేరుచేయడం ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన లక్ష్యాలని ఇస్రో తెలిపింది.
"ల్యాండర్ విడిపోయిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్లో ఉన్న స్పెక్ట్రో-పొలారిమెట్రి ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(షేప్) పేలోడ్‌ను ఆపరేట్ చేశాం. ఈ పేలోడ్‌ను ప్రొపల్షన్ మాడ్యూల్ జీవితకాలంలో మూడుసార్లు ఆపరేట్ చేయాలన్నది మా లక్ష్యం. చంద్రయాన్-3ని కక్ష్యలోకి సమర్థవంతంగా ప్రవేశపెట్టడం, కక్ష్య తగ్గింపు-పెంపు ప్రక్రియలు సక్రమంగా నిర్వహించడం వల్ల ఇంధనం ఆదా అయింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నెల రోజులు పని చేసిన తర్వాత అందులో వంద కిలోలకు పైగా ఇంధనం మిగిలింది. ఆ ఇంధనాన్ని ఉపయోగించి ప్రొపెల్షన్ మాడ్యూల్‌లోని అదనపు సమాచారాన్ని సేకరించాలని భావించాం. భూపరిశీలనకు అనుకూలంగా షేప్ పేలోడ్‌ను భూకక్ష్యలోకి తిరిగి తీసుకొచ్చే చర్యలు తీసుకున్నాం. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అదేసమయంలో, భూమికి 36వేల కి.మీ దూరంలో ఉన్న జీయోసింక్రనస్ ఈక్వటోరియల్ ఆర్బిట్‌లోకి ప్రవేశించకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాం."
-ఇస్రో
చంద్రయాన్-4కు ఇస్రో రెడీ- జాబిల్లి నుంచి మట్టి తీసుకురావడమే టార్గెట్