ETV Bharat / science-and-technology

Pink WhatsApp : పింక్​ 'వాట్సాప్'​ స్కామ్​.. డౌన్​లోడ్ చేశారో జేబులకు చిల్లే! - ఆండ్రాయిడ్​ ఫోన్లపై పింక్​ వాట్సాప్​ స్కామ్

Pink WhatsApp : వాట్సాప్​ వినియోగదారులకు హెచ్చరిక. సైబర్​ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త ఫీచర్స్​ కోసం పింక్​ వాట్సాప్ డౌన్​లోడ్​ చేసుకోవాలని వల విసురుతున్నారు. దీనిపై ఆండ్రాయిడ్​ వాట్సాప్​ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని​ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Pink WhatsApp
Beware of pink whatsapp scam for android users
author img

By

Published : Jun 25, 2023, 7:45 AM IST

Pink WhatsApp : ఆధునిక సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్​ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్​ లోగో పింక్​ కలర్​లోకి మారిందని, సరికొత్త ఫీచర్ల కోసం పింక్​ వాట్సాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలని ఫేక్ మెసేజ్​లు పంపిస్తున్నారు. ప్రస్తుతం పింక్​ వాట్సాప్​ స్కామ్​ బాగా వ్యాపిస్తోంది. ముంబయి, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈ స్కామ్​ ఉధృతంగా జరుగుతోంది. అందుకే ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖలు ఈ స్కామ్​పై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.

అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
Police warns about Pink WhatsApp Scam : ముంబయి సైబర్​ పోలీసు క్రైమ్​ వింగ్ ఆండ్రాయిడ్​ వాట్సాప్​ వినియోగదారుల కోసం.. 'పింక్​ వాట్సాప్ - ఆండ్రాయిడ్​ వినియోగదారులకు రెడ్​ అలెర్ట్​' అంటూ ఓ ట్వీట్​ చేసింది. ప్రభుత్వ సైబర్​ సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా దీనిపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తమవుతున్నాయి.

  • *... WHATSAPP PINK -A Red Alert For Android Users ...*'

    *... व्हॉट्सॲप पिंक Android वापरकर्त्यांसाठी रेड अलर्ट ...*

    *...व्हाट्सएप गुलाबी (पिंक) Android उपयोगकर्ताओं के लिए एक रेड अलर्ट...*#CyberSafeMumbai

    REGARDS,
    NORTH REGION CYBER POLICE STATION,
    CRIME BRANCH, CID, MUMBAI pic.twitter.com/viTbVrcWrn

    — NORTH REGION CYBER POLICE CRIME WING (@north_mum) June 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పింక్ స్కామ్​ అంటే ఏమిటి?
What is Pink WhatsApp Scam : వాట్సాప్​లో లేటెస్ట్​ ఫీచర్స్​ కోసం పింక్​ వాట్సాప్ డౌన్​లోడ్​ చేసుకోవాలని సైబర్​ నేరగాళ్లు వినియోగదారులకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాళ్లు పంపిన లింక్​ను కనుక క్లిక్​ చేస్తే.. వెంటనే పింక్​ వాట్సాప్​ మీ డివైజ్​లోకి డౌన్​లోడ్​ అయిపోతుంది. యూజర్​కు తెలియకుండానే హానికరమైన సాఫ్ట్​వేర్లు ఫోన్​లో ఇన్​స్టాల్​ అయిపోతాయి. ఫలితంగా​ వినియోగదారుడు తన ఫోన్​ యాక్సెస్​ను కోల్పోతాడు.

మన గుట్టు.. హ్యాకర్ల చేతిలో
పింక్​ వాట్సాప్​ ఇన్​స్టాల్​ అయిన తరువాత యూజర్​కు తెలియకుండానే ఫోన్​లోని సున్నితమైన సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

పింక్​ వాట్సాప్ డౌన్​లోడ్​ చేసుకుంటే.. మన ఫోన్​లోని కాంటాక్ట్​ నెంబర్స్​ అన్నీ సైబర్​ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. దీనితో వాళ్ల మన పేరుతో మన స్నేహితులందరికీ పింక్ వాట్సాప్​ డౌన్​లోడ్​ లింక్​లను పంపిస్తారు. అందువల్ల ఈ స్కామ్​ విషయంలో వాట్సాప్​ వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే డౌన్​లోడ్​ చేసుకుని ఉంటే?
Uninstall Pink WhatsApp : ఒక వేళ పొరపాటున ఇప్పటికే పింక్​ వాట్సాప్​ డౌన్​లోన్​ చేసుకుని ఉంటే.. వెంటనే దానిని అన్​ఇన్​స్టాల్​ చేయాలి. తరువాత ఫోన్​ను బ్యాక్​అప్​ చేయాలి. పటిష్టమైన యాంటీ వైరస్​ సాఫ్ట్​వేర్​లను ఇన్​స్టాల్​ చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం వారు అందిస్తున్న ఉచిత యాంటీ సాఫ్ట్​వేర్​లను ఉపయోగించుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం సైబర్​ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్​లో అనేక ఉచిత యాంటీ వైరస్​ సాఫ్ట్​వేర్​లను అందిస్తోంది. అలాగే ఆండ్రాయిడ్​ వినియోగదారుల కోసం యూఎస్​బీ ప్రతిరోధ్​, యాప్​ సంవిధ్​ అప్లికేషన్లను కూడా ఉచితంగా అందిస్తోంది. వీటిని ఆండ్రాయిడ్​ వినియోగదారులు కచ్చితంగా ఇన్​స్టాల్​ చేసుకోవడం మంచిది.

నోట్​ : అపరిచితులు పంపే లింకుల ద్వారా యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకోకండి. కేవలం గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి మాత్రమే అవసరమైన యాప్స్​ డౌన్​లోడ్ చేసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.