ETV Bharat / science-and-technology

డేటా భద్రత ముఖ్యమా?.. ఈ బ్రౌజర్లు వాడండి! - గూగుల్​ క్రోమ్

ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయాలంటే బ్రౌజర్ కావాలి. ఇందుకోసం ఎక్కువ మంది గూగుల్ క్రోమ్ వాడుతుంటారు. ఇవే కాకుండా ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, తదితర బ్రౌజర్లు కూడా ఉన్నాయి. అయితే మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్ ఎలాంటి డేటాను సేకరిస్తుంది. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే బ్రౌజర్లు ఏవో తెలుసుకోండి.

web browsers privacy, వెబ్​బ్రౌజర్లు
ఈ బ్రౌజర్లతో మీ గోప్యతకు భద్రత!
author img

By

Published : Aug 6, 2021, 12:51 PM IST

బ్రౌజర్ అనేది వాహనం లాంటిది. అది కావాల్సిన వెబ్​సైట్​కు తీసుకెళ్తుంది. చూసిన వెబ్​సైట్​, వెబ్​సైట్లో గడిపిన సమయం, క్లిక్ చేసిన లింక్​లు తదితర వివరాలు బ్రౌజర్​కు తెలుస్తాయి. మనం ఇంటర్నెట్​లో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలంటే బ్రౌజర్​పైనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ మనలో చాలామంది గూగుల్ క్రోమ్​నే వాడుతుంటారు. దీనితో పాటు ఇంకా చాలా బ్రౌజర్లు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

బ్రౌజర్ ద్వారా ఇతరులకు మీ వ్యక్తిగత వివరాలను తెలిసే అవకాశాలు ఉన్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని ప్రైవసీని కాపాడే బ్రౌజర్లను ఉపయోగించుకోవటం ఉత్తమం. టెక్ కంపెనీల బ్రౌజర్లకు సంబంధించిన డేటా చాలా ఉపయోగపడుతుంది. ఏ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు? ఏవి కొనుగోలు చేసేందుకు చూస్తున్నారు? ఏ కంటెంట్ చూస్తున్నారు? తదితరాల విషయాలను తెలుసుకునేందుకు కంపెనీలు డేటా విశ్లేషణ చేస్తాయి.

కొన్ని బ్రౌజర్లను సాంకేతిక కంపెనీలే తీసుకొస్తున్నాయి. దీనివల్ల డేటా ప్రత్యక్షంగా ఆయా కంపెనీలకు చేరే అవకాశం ఉంటుంది. ఆన్​లైన్​లో ప్రకటనలు ఇచ్చే సంస్థలు, థర్డ్ పార్టీ ట్రాకర్ల వల్ల కూడా ఆన్​లైన్ ప్రైవసీ దెబ్బ తింటుంది. ప్రకటనలిచ్చే సంస్థలు, ట్రాకర్లు.. ఆన్​లైన్ యాక్టివిటీ ఎంత వీలైతే ఎక్కువ ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇందువల్ల రెండు రకాలుగా ప్రైవసీ దెబ్బ తింటుంది.

  • వెబ్​సైట్​ను ఆప్టిమైజ్ చేసేందుకు ఉపయోగించే కంప్యూటర్ లేదా ఫోన్ సమాచారం బ్రౌజర్, వెబ్​సైట్​కు చేరుతుంది. దీన్ని ఫింగర్ ప్రింటింగ్ అంటారు.
  • వెబ్ సైట్ కుకీస్.. బ్రౌజర్​లో సేవ్ అవుతుంటాయి. దీనివల్ల బ్రౌజర్​ను వెబ్​సైట్లు గుర్తు పడుతుంటాయి.

డేటా ఇవ్వాల్సిన అవసరం ఎంత?

ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం డేటా ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆన్​లైన్ యాక్టివిటీని తెలుసుకోకుండా, ట్రాకర్స్ నుంచి కాపాడే ఇంటర్నెట్ బ్రౌజర్లు కూడా ఉన్నాయి. వీటి వల్ల బ్రౌజర్​తో పంచుకునే డేటా భారీగా తగ్గిపోతుంది.

గూగుల్ క్రోమ్..

ఇది టెక్ దిగ్గజం గూగుల్ తయారు చేసిన బ్రౌజర్. వెబ్ బ్రౌజింగ్, ప్రైవసీ గురించి మాట్లాడుకోవాలంటే గూగుల్ క్రోమ్ గురించి చర్చ తప్పనిసరి. వెబ్ ట్రాఫిక్​లో 60 శాతం క్రోమ్ నుంచే వస్తుంది. క్రోమ్ ద్వారా గూగుల్ వెబ్ యాక్టివిటీని తెలుసుకోవచ్చు. గూగుల్ ప్రైవసీ సెట్టింగ్స్​లో మార్పు చేసుకోనంత వరకు గూగుల్ ప్రతి సైట్ వివరాలను సేకరిస్తుంది. అంతేకాకుండా.. ఆన్​లైన్​లో ప్రకటనలు ఇచ్చే సంస్థలు, ట్రాకర్స్​ను బ్లాక్ చేయదు.

బ్రేవ్

ఇది ఒక ఓపెన్ సోర్స్ బ్రౌజర్. ఇది క్రోమ్​ను పోలి ఉంటుంది. ఇది ఆన్​లైన్ యాక్టివిటీ సంబంధించిన డేటాను తీసుకోదు. థర్డ్ పార్టీ, యాడ్ కూకీస్​ను అటోమెటిక్​గా బ్లాక్ చేస్తుంది. ఉపయోగించే డివైస్​కు సంబంధించిన డేటాను కూడా పంచుకోదు. డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్​ అన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది.

ఫైర్ ఫాక్స్

ఇది కూడా ఓపెన్ సోర్స్ బ్రౌజర్. ఇటీవల అడ్వాన్స్​డ్​ యాంటీ ఫింగర్ ప్రింటింగ్, ఎన్​హాన్స్​డ్​ ట్రాకింగ్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్​ను తీసుకొచ్చారు. దీనివల్ల ఆన్​లైన్ యాక్టివిటీని ట్రాక్ చేయటం కష్టం అవుతుంది. ఇది ప్రకటనలను ఆటోమేటిక్​గా బ్లాక్ చేయదు. దీనికోసం చాలా బ్రౌజర్ ఎక్స్​టెన్షన్లు ఉన్నాయి. డెస్క్​టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్​లకు ఈ బ్రౌజర్ అందుబాటులో ఉంది.

టార్ బ్రౌజర్

ప్రైవసీ విషయంలో దీన్ని అత్యంత ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు. టార్​ను ఉపయోగిస్తున్నప్పుడు డేటా అనేది వైబ్​సైట్​ను చేరే ముందు మూడు సార్లు ఎన్​క్రిప్ట్ అవుతుంది, మూడు సర్వర్లకు అందుతుంది. ఒక్కో సర్వర్​కు ఒక సెట్ ఆదేశాలు మాత్రమే అందుతాయి. దీనివల్ల ఏ సర్వర్​కు కూడా మీ ఐపీ అడ్రస్, వెబ్​సైట్ వివరాలు ఒకేసారి తెలియవు. దీంతో ఆన్​లైన్ యాక్టివిటీ ట్రాక్ కాదు. అలాగే బ్రౌజర్ మూసేసినప్పుడు కుకీస్, హిస్టరీ డిలీట్ అయిపోతుంది. ఫింగర్ ప్రింటింగ్ బ్లాక్ చేసేందుకు వీలుగా బ్రౌజర్ డిజైన్ అయింది. అంతేకాకుండా అన్ని రకాల ఆన్​లైన్ ట్రాకర్లు బ్లాక్ అవుతాయి. డెస్క్​టాప్​, ఆండ్రాయిడ్​కు అందుబాటులో ఉంది. ఐఓఎస్ విషయంలో ఆనియన్ బ్రౌజర్​ను ఉపయోగించుకోవచ్చు.

డక్ డక్ గో

ఈ బ్రౌజర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్​లకు అందుబాటులో ఉంది. క్రోమ్, ఫైర్​ఫాక్స్​లకు ఎక్స్​టెన్షన్ రూపంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా బ్రౌజింగ్ హిస్టరీ డివైస్​ను దాటి వెళ్లదు. బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేయటం ఒక్క క్లిక్​తో సులభంగా అవుతుంది. ఆటోమెటిక్ యాడ్ బ్లాక్, థర్డ్ పార్టీ ట్రాకర్లను నిలిపివేయటం, హెచ్​టీటీఎస్ ఎన్​క్రిప్షన్ లాంటివి ఈ బ్రౌజర్​లో ఉన్నాయి.

ఇదీ చదవండి : Shortcuts in Gmail: జీమెయిల్‌ను 'అన్‌డూ' చేసేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.