ETV Bharat / science-and-technology

Switching Android To Iphone : ఈ 10 పాయింట్స్​ త‌ప్ప‌కుండా తెలుసుకోండి..! లేదంటే ఇబ్బందే.. - android to iphone

Switching Android To Iphone : చాలా మంది యాపిల్ ఫోన్లు వాడాల‌నుకుంటారు. కేవ‌లం ఫోన్లు మాత్రమే కాకుండా ఆ కంపెనీ ఉత్ప‌త్తి చేసిన ఇత‌ర వ‌స్తువులను కూడా వాడ‌టానికి ఆస‌క్తి చూపిస్తారు. మీరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి యాపిల్​కు మారాల‌నుకుంటున్నారా.. అయితే క‌చ్చితంగా ఈ 10 విష‌యాలు తెలుసుకోవాల్సిందే.

tips for switching from android to iphone
ఆండ్రాయిడ్ నుండి ఐఓఎస్​ మారడం ఎలా
author img

By

Published : Apr 14, 2023, 7:01 AM IST

ప్ర‌స్తుత కాలంలో యాపిల్ ఫోన్లు వాడాల‌ని చాలా మంది అనుకుంటారు. ధ‌ర ఎక్కువే అయిన‌ప్ప‌టికీ.. సెక్యూరిటీ, బ్రాండ్ విలువ లాంటి కొన్ని కార‌ణాల వ‌ల్ల వాటిని ఉప‌యోగించ‌డానికి ఆసక్తి చూపిస్తారు. అప్ప‌టిదాకా ఆండ్రాయిడ్ ఫోన్ వాడి.. ఐఓఎస్​కు మారితే అంతా గంద‌ర‌గోళంగా ఉంటుంది. మీరు కూడా అలాంటి నిర్ణ‌య‌మే తీసుకుంటే మారే ముందు ఈ 10 విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోండి.

  1. డేటా బ‌దిలీ
    ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్​కు మారిన‌ప్పుడు మీ ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబ‌ర్లు, డాక్యుమెంట్లు ఇత‌ర ఫైల్స్ బ‌దిలీ చేయ‌డం క‌ష్టం. అదే మీరు అప్ప‌టికే ఐఫోన్ క‌లిగి ఉండి కొత్త మోడ‌ల్​కు అప్​గ్రేడ్ అయితే మాత్రం అదంతా సెట్ చేయ‌డానికి త‌క్కువ స‌మ‌యమే ప‌డుతుంది. కంప్యూట‌ర్ విష‌యంలోనూ అంతే. విండోస్ నుంచి మ్యాక్ బుక్​కు ఫైల్స్ బ‌దిలీ క‌ష్టం.
  2. ఐఓఎస్​ను ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం
    జ‌నాలు యాపిల్​ను ఇష్ట‌ప‌డ‌టానికి గల కారణం.. ప్రొడ‌క్ట్ డిజైన్​తో పాటు దాని సాఫ్ట్​వేర్​ను ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. ఆండ్రాయిడ్​లో ఒక బ్రాండ్ నుంచి మ‌రొక బ్రాండ్​కి మారిన ప్ర‌తిసారీ ఆ సాఫ్ట్​వేర్​ను వాడటం అల‌వాటు ప‌డటానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఐఫోన్ల‌లో ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌దు. ఫోన్లు అప్​గ్రేడ్ అవుతున్న ప్ర‌తిసారీ తాజా వెర్ష‌న్​ను ఉప‌యోగించ‌డంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
  3. ఫైల్ నిర్వ‌హ‌ణ క‌ష్టం
    డేటా ట్రాన్స్​ఫ‌ర్ లాగే ఫైల్ మేనేజ్​మెంట్ కూడా క‌ష్టం. ఆండ్రాయిడ్​లో మీరు ఫైల్, ఫోల్డ‌ర్​ల‌ మేనేజ్ మెంట్‌, బ్యాక‌ప్ త‌దిత‌ర వాటిని సుల‌భంగా చేసుకునే వారు. కానీ ఐఓఎస్​లో ఇది అంత సుల‌భం కాదు. కొన్ని రివ్యూల ప్ర‌కారం.. యాపిల్ ఫోన్ల‌లో ఐ క్లౌడ్ నుంచి మీ ఐఫోన్​కు ఫైళ్ల‌ను డౌన్​లోడ్ చేయ‌డం చాలా కష్టంగా ఉంటుంది.
  4. ఆండ్రాయిడ్ ఫీచ‌ర్లు కోల్పోవ‌డం
    ఆండ్రాయిడ్ వినియోగ‌దారుడిగా ఆ ఫోన్లు వాడుతున్న‌ప్పుడు కొత్త ఫీచ‌ర్లు పొంద‌టానికి అల‌వాటైన మీరు.. ఐఫోన్ల‌లో దాన్ని మిస్​ అవుతారు. ఆండ్రాయిడ్​తో పోలిస్తే.. యాపిల్​లో త‌క్కువ ఫీచ‌ర్లు ఉంటాయి. కంపెనీ వాటిని తీసుకురావ‌టంలో నిదానంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. దీంతో ఈ విష‌యంలో మీకు నిరాశ క‌ల‌గ‌వ‌చ్చు.
  5. కెమెరా క్వాలిటీ
    నేడు మ‌ధ్య త‌ర‌గ‌తి ఆండ్రాయిడ్ ఫోన్లు అందించే కొన్ని కెమెరా ఫీచ‌ర్లు ఐఫోన్ల‌లో ఉండ‌వు. ఇందులో త‌క్కువ మెగా పిక్స‌ల్ క‌లిగిన కెమెరాలు ఉంటాయి. కానీ.. వేగ‌వంత‌మైన షట్ట‌ర్ స్పీడ్‌, ఉత్త‌మ‌మైన నాణ్య‌త‌తో ఫొటోలు, వీడియోలు తీసుకోవ‌చ్చు.
  6. సాఫ్ట్​వేర్ అప్‌డేట్​లు తొంద‌ర‌గా పొంద‌వ‌చ్చు
    ఆండ్రాయిడ్ సాఫ్ట్​వేర్ త‌యారీదారులు కొత్త సాఫ్ట్​వేర్ అప్​డేట్ ఇవ్వ‌డానికి స‌మ‌యం తీసుకుంటారు. గూగుల్‌, శాంసంగ్ వంటి కంపెనీలు ఈ విష‌యంలో ముందున్నా.. ఇత‌ర సంస్థ‌లు నెమ్మ‌దిగా ఉంటాయి. అదే ఐఫోన్ల‌లో ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. కంపెనీ సాఫ్ట్​వేర్ ను విడుద‌ల చేసిన వెంట‌నే మీరు తాజా అప్​డేట్​ల‌ను పొంద‌వ‌చ్చు.
  7. ర‌క‌ర‌కాల కంపెనీల గ్యాడ్జెట్స్ వాడ‌లేరు
    ఆండ్రాయిడ్ ఫోన్లు ఉప‌యోగించేట‌ప్ప‌డు అవి వేరే కంపెనీ అయినా.. ఇయ‌ర్ ఫోన్ లాంటి వ‌స్తువుల్ని ఇత‌ర కంపెనీవి వాడే స్వేచ్ఛ ఉండేది. కానీ యాపిల్​లో అలా కాదు. మీరు ఐఫోన్​కు మారిన త‌ర్వాత మీకు న‌చ్చినా.. న‌చ్చ‌క‌పోయినా ఎయిర్ పాడ్స్, ఎయిర్ ట్యాగ్స్ వంటి ఆపిల్ ఉత్ప‌త్తుల్నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
  8. ఉత్త‌మ‌మైన క‌స్ట‌మ‌ర్ స‌ర్వీసు అనుభ‌వం
    చాలా మంది వినియోగ‌దారుల‌కు మంచి క‌స్ట‌మ‌ర్ కేర్ స‌ర్వీసు అనుభవం కావాలి. ఆండ్రాయిడ్ త‌యారీదారులు త‌మ లైన‌ప్​ల‌్లో అనేక ఫోన్ల‌ను విక్ర‌యించ‌డం వ‌ల్ల సేవ‌ల్లో జాప్యం అవుతుంది. కానీ ఈ విష‌యంలో యాపిల్ ప‌రిస్థితి అలా ఉండ‌దు. కాబ‌ట్టి క‌స్ట‌మ‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో ఆల‌స్యం ఉండ‌దు.
  9. మెసేజింగ్ ఎక్స్​పీరియెన్స్
    ఆండ్రాయిడ్​లో మెసేజింగ్ అనుభ‌వం కొంచెం గంద‌ర‌గోళంగా ఉంటుంది. ఎందుకంటే ప్ర‌తి మొబైల్ తన సొంత ఫ్రీ ఇన్‌స్టాల్డ్ యాప్‌ను ఉప‌యోగిస్తుంది. ఫోన్ మారేకొద్దీ ఆ అనుభవం మారుతుంది. అదే యాపిల్​లో అయితే.. ఈ విష‌యంలో మంచి ఫీచ‌ర్ ఉంటుంది. ఉప‌యోగించే వారికి సౌక‌ర్యంగానూ ఉంటుంది.
  10. ఆప్టిమైజ్డ్ యాప్స్, గేమ్స్
    యాపిల్ ఏటా కొన్ని ఫోన్లు మాత్ర‌మే విడుద‌ల చేస్తుంది. కాబ‌ట్టి దాని డెవ‌ల‌ప‌ర్స్ అందులో ఆప్టిమైజ్డ్ యాప్స్, గేమ్స్ త‌యారు చేస్తారు. దీని వ‌ల్ల వాటి వినియోగం సుల‌భ‌మ‌వుతుంది.
    యాపిల్ ఉత్ప‌త్తులు వాడ‌టానికి కొన్ని విష‌యాల్లో రాజీ అవ‌స‌రం. మీరు దానికి సిద్ధ‌మైతే ఉప‌యోగించవ‌చ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.