అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనికి దాదాపు రెండు బిలియన్ల (whatsapp scam messages) పైనే యూజర్లు ఉన్నారు. ఇంత ఎక్కువ ట్రాఫిక్ కలిగిన వాట్సాప్ హ్యాకర్లకు టార్గెట్‌గా మారింది. యాప్ యూజర్లకు హ్యాకర్లు మాల్వేర్ను పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వాట్సాప్‌లో ఇలాంటి (whatsapp scam messages) స్కామ్ జరిగింది. ఇండియన్ డైరీ కంపెనీ అమూల్ 75వ వార్షిక ఉత్సవాల పేరుతో ఆరువేల గిఫ్ట్ అంటూ ఓ ఫేక్ లింక్ చక్కర్లు కొడుతోంది. లింక్‌ను క్లిక్ చేస్తే ఆరువేలు (whatsapp scam messages) గెలుచుకోవచ్చు అనే సందేశం ఉంటోంది. ఒకవేళ కనుక ఈ మెసేజ్‌కు మీరు స్పందిస్తే ప్రమాదకరమైన మాల్వేర్ మీ ఫోన్లో చేరినట్లే. ఎందుకంటే ఆ మెసేజ్‌తో పాటు లింక్ కూడా ఫేక్.
క్యాష్ రివార్డ్ పేరుతో యూజర్లను ట్రాప్ చేయడానికి హ్యాకర్లు ఇలాంటి మెసేజ్ సెండ్ చేస్తున్నారు. యూజర్లకు తెలియక ఆ లింక్‌పై క్లిక్ చేసి ఈ స్కామ్‌లో చిక్కుకుపోతున్నారు. రివార్డ్ ఏమీ రాకపోగా.. 10 లేక 15 గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తే రివార్డ్ గెలుచుకునే అవకాశం ఉందని యూజర్లకు గాలం వేస్తున్నారు.
జాగ్రత్త సుమా!
ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు చాలామంది ఫోన్లలో దర్శనమిస్తుంటాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డైరెక్ట్ మెసేజ్‌ల రూపంలో కనిపిస్తుంటాయి. వీటికి వీలైనంత వరకూ దూరంగా ఉండండి. అలాంటి సందేశాలు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు తెలియజేయండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకూ ఇలాంటి లింక్‌లపై అవగాహన కల్పించండి.
ఇదీ చదవండి: టీనేజర్ల కోసం ఇన్‌స్టా సరికొత్త ఫీచర్.. వారి ప్రైవసీనే ముఖ్యం!