ETV Bharat / priya

'పల్లెటూరి చేపల పులుసు' రుచి అదుర్సు!

పల్లెటూరి ఘుమఘుమలే వేరు. పట్నం మోజులోపడి ఆనాటి పల్లె పరిమళలాకు దూరమయ్యాం. కానీ, ఆ రుచులు, ఆ రెసిపీలు మన తరతరాలకు అందించాలంటే.. అప్పుడప్పుడు పల్లెటూరి చేపల పులుసు చేసుకోవాల్సిందే.

village style fish  curry try with this recipe
'పల్లెటూరి చేపల పులుసు' రుచి అదుర్సు!
author img

By

Published : Aug 17, 2020, 1:00 PM IST

Updated : Aug 17, 2020, 1:39 PM IST

పల్లెటూరి చేపల పులుసు అంటే.. బోలెడన్ని పదార్థాలు కావాలేమో అనుకోకండి. ఊర్లో ఉన్నంతలో వండుకోవడం అలవాటే కదా.. ఆ పద్ధతిని పాటిస్తూ అతితక్కువ పదార్థాలతో చేపల పులుసు చేసుకోండిలా...

కావలసినవి

చేపముక్కలు: కిలో, కారం: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, నూనె: అరకప్పు, కొత్తిమీర: కట్ట, మంచినీళ్లు: 2 కప్పులు, చింతపండురసం: 2 కప్పులు, కరివేపాకు: 3 రెబ్బలు, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి: 4 టేబుల్‌స్పూన్లు, పసుపు: టీస్పూను, ఉప్పు: తగినంత, ధనియాలపొడి: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం

  • చేపముక్కల్ని ఉప్పు, పసుపు వేసి బాగా కడగాలి. తరవాత కడిగిన ముక్కలకి కాస్త ఉప్పు, పసుపు పట్టించి పక్కన ఉంచాలి.
  • చింతపండుని ఓ గంటముందే గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి రసం పిండాలి.
  • మందపాటి గిన్నెలో ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, దనియాలపొడి, చింతపండు రసం, నీళ్లు పోసి, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ఓసారి ఉప్పూకారం సరిచూసి, చాలకపోతే మరికాస్త వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మీద తేలినట్లుగా నూనె వేసి మరిగించాలి. తరవాత మంట తగ్గించి సిమ్‌లో పావుగంటసేపు ఉడికించాలి. గ్రేవీ చిక్కబడి దాదాపుగా ఉడికింది అనుకున్నాక చేపముక్కలు, పచ్చిమిర్చి వేసి మరో పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. ముక్కల్ని కదపకుండా ఓసారి ఫోర్కుతో ఉడికిందో లేదో చూసి స్టవ్‌ ఆఫ్‌ చేసి కొత్తిమీరతో అలంకరిస్తే సరి. ఎంతో రుచికరమైన పల్లె చేపల పులుసు రెడీ అయినట్లే.

ఇదీ చదవండి: చిరుజల్లుల వేళ 'పొటాటో వెడ్జెస్‌' చేసుకోండిలా!

Last Updated : Aug 17, 2020, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.