ETV Bharat / priya

నాన్​వెజ్ స్పెషల్​.. ఊరగాయ మాంసం చేయండిలా! - ప్రత్యేకమైన మాంసం కర్రీ

మటన్​తో ఇప్పటికే ఎన్నో వెరైటీలు (non veg curries) ఆస్వాదించాం.. మరి ఊరగాయ మటన్ (ooragaya matton curry)​ ఎప్పుడైనా చేశారా? ఓ వైపు ఊరగాయ, మరో వైపు మటన్ ఘాటుతో వావ్​ అనిపించే 'ఊరగాయ మటన్​'ను తయారు చేసేయండి మరి..

ooragaya matton curry
ఊరగాయ మాంసం కర్రీ
author img

By

Published : Oct 6, 2021, 4:23 PM IST

మాంసం ప్రియులకు అతి ఇష్టమైంది మటన్. ఈ మటన్​ను ఎప్పుడూ ఒకేలా చేసుకోకుండా కొత్తగా రుచి (ooragaya matton recipe) చూడాలని ఉందా? అయితే.. ఇంట్లో ఉండే ఊరగాయతో ట్రై చేయాల్సిందే!. ఊరగాయ, మటన్​ను కలిపి ఘాటుగా (ooragaya matton curry) రుచి చూడాల్సిందే మరి!. ఊరగాయ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలంటే..

ooragaya matton curry
ఊరగాయ మాంసం కర్రీ

కావాల్సిన పదార్థాలు:

  • మటన్​-250 గ్రాములు
  • ఆవకాయ మసాలా ముద్ద- ఒక కప్పు
  • జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంపు, ఇంగువ- సగం చెంచా
  • ఎండు మిరపకాయలు-రెండు
  • వెల్లుల్లి రెబ్బలు
  • ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లులి
  • పసుపు, కారం, గరం మసాలా
  • ధనియాల పొడి, జీర పొడి, ఉప్పు, కొత్తిమీర.

తయారీ విధానం:

ఒక గిన్నెలో ఆవ నూనె వేడి చేసి అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆవకాయ వేసి తగినన్ని నీళ్లు పోసి కాసేపు ఉడకనీయాలి. అనంతరం మటన్​ వేసి బాగా ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత తగినంత కొత్తిమీర వేసుకుని పొయ్యి ఆఫ్ చేసుకుంటే రుచికరమైన ఊరగాయ మాంసం తయారీ పూర్తవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:నాన్​వెజ్​ స్పెషల్​.. మిక్స్​డ్ ఫ్రైడ్ బిర్యానీ చేసేద్దామా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.