దూద్ పేడా(doodh peda home cooking).. ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్‌ను తినడానికి చాలామంది ఇష్టపడతారు. దాదాపు మన పరిసరాల్లో ఉండే అన్ని పాల కేంద్రాలు సహా బేకరీల్లోనూ దొరుకుతుంది. పండగలప్పుడు ఇంట్లో చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ మిఠాయిని(doodh peda calories) సులభంగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
లీటరు పాలకు సరిపడా పదార్థాలు
చిక్కటి పాలు- లీటరు
60 గ్రాముల చక్కెర
100 గ్రాముల ప్లెయిన్ కోవా
కాస్తంత ఇలాచి పొడి
కొంచెం నెయ్యి
తయారీ విధానం
ముందుగా(doodh peda recipe) ఓ పాన్‌లో ఒక లీటరు పాలు తీసుకుని అవి 150 ఎం.ఎల్ అయ్యేవరకు మరిగించాలి. అలా మరిగించుకున్న పాలల్లో చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ప్లెయిన్ కోవా, ఇలాచి పొడి వేసి మరోసారి బాగా కలుపుకొని దగ్గరగా ముద్దలా అయ్యేలా చేసుకోవాలి.
అనంతరం ఈ పేస్ట్‌ను.. నెయ్యి రాసిన ప్లేట్ మీద పరుచుకుని కాస్త చల్లగా అయ్యాక గుండ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే.. కమ్మని దూద్‌పేడా రెడీ అవుతుంది. మనకి ఇష్టం ఉంటే ఈ స్వీట్‌పై జీడిపప్పు లేదా బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: వంటింట్లో ఆ సమస్యా? అయితే ఇలా చేయండి..!