ETV Bharat / priya

మీ పిల్లలు కుకీలు కావాలని మారం చేస్తున్నారా? మిల్లెట్​​తో ఇలా ట్రై చేయండి! టేస్ట్​ అండ్​ హెల్త్​ గ్యారెంటీ! - best millet cookies recipe

Millet Cookies Recipe : మీ పిల్లలు కుకీలు కావాలని గొడవ చేస్తున్నారా..? బయట కొనే వాటితో ఆరోగ్యం పాడవుతుందని మీరు ఆందోళన చెందుతున్నారా..? అయితే ఇక నో వర్రీ. చిరుధాన్యాలతో ఎంతో టేస్టీగా ఉండే కుకీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Millet Cookies Recipe
Millet Cookies Recipe
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 6:34 PM IST

Millet Cookies Recipe : చిన్న పిల్లలు కుకీలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మార్కెట్లో దొరికే చాలా వాటిలో ఎక్కువ మైదా పిండితో తయారు చేసినవే ఉంటాయి. వీటిని కొనడానికి కొద్దిమంది తల్లిదండ్రులు ఇష్టపడరు. అంతేకాకుండా ఇవి పిల్లల ఆరోగ్యానికి అంత మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే పిల్లల కోసం స్పెషల్‌గా చిరుధాన్యాలతో కుకీస్‌ను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

పోషకాల గని: మిల్లెట్​లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్ ఉండడంతో పాటు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌గా ఇది పాపులర్. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ రహిత శాకాహారి ధాన్యంగా వీటిని చెప్పొచ్చు. ఇందులో ఫాస్పరస్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. కండరాల పనితీరుకు, డయాబెటిస్​ను కంట్రోల్​ ఉంచడం, జీర్ణప్రక్రియను మెరుగుపర్చడం.. ఇలా ఎన్నో రకాలుగా ఇవి ఉపయోగపడతాయి.. మరి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని అందించే మిల్లెట్​​ కుకీస్​ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిల్లెట్​ కుకీస్​ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

  • ​కొర్రలు-100 గ్రాములు
  • సామలు-100 గ్రాములు
  • వరుగులు-100 గ్రాములు
  • బ్రౌన్​ షుగర్​-300 గ్రాములు(పొడి చేసుకోవాలి)
  • మిల్క్​ పౌడర్​- 150 గ్రాములు
  • బటర్-300 గ్రాములు​
  • చిటికెడు ఉప్పు
  • నీళ్లు కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా కొర్రలు, సామలు, వరుగులు ఓ మిక్సీ జార్​లో తీసుకుని పొడి చేసుకోవాలి.(ఇవి కాకుండా మిగతా మిల్లెట్​తో కూడా ట్రై చేయవచ్చు)
  • తర్వాత బ్రౌన్​ షుగర్​ను కూడా మిక్సీ జార్​లో వేసుకుని పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మిల్లెట్​​ పొడి, బ్రౌన్​ షుగర్​ పొడి వేసుకోవాలి.
  • తర్వాత అందులో మిల్క్​ పౌడర్​ వేసుకోవాలి. మిల్క్​ పౌడర్​ లేని వాళ్లు పాలు కూడా పోసుకోవచ్చు(150 ml)
  • ఇప్పుడు ఆ మిశ్రమంలో బటర్​, చిటికెడు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  • పిండి మరీ పొడిగా, గట్టిగా లేకుండా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కుకీలుగా ఒత్తుకోవాలి.
  • ఇప్పుడు కుకీ ట్రే తీసుకుని అందులో బటర్​ పేపర్​ లేదా కొద్దిగా వెన్న రాసి కొద్దిగా పొడి చల్లుకోని అందులో రెడీ చేసుకున్న కుకీలు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఆ కుకీ ట్రేను ఓవెన్​లో 20 నిమిషాల పాటు 160 డిగ్రీల వద్ద బేక్​ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా అండ్​ హెల్దీగా ఉండే కుకీస్​ రెడీ!

ఈ కేక్స్​తో క్రిస్మస్​ వెరీ వెరీ స్పెషల్ - తిన్నారంటే వావ్ అనాల్సిందే!

మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్​లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!

మొక్కజొన్న కంకి.. మధురమైన రుచులు చూడండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.