ఎంతో మంది ఆహార ప్రియులకు బిర్యానీ ఫేవరెట్ ఫుడ్. గల్ఫ్ దేశాల్లో ప్రత్యేకంగా లభించే ఈ వంటకం ఇటీవల కాలంలో ట్రెండీగా మారిపోయింది. యువత, ఫ్యామిలీ.. ప్రతిఒక్కరూ దీనికే ఆకర్షితులవుతున్నారు. అయితే దీన్ని ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే..
కావాల్సినవి
చికెన్, బాస్మతీ రైస్, నూనె, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, సరిపడా నీళ్లు, ఉప్పు, నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, టొమాటొ
మండిబిర్యానీ మసాలా తయారీ
ధనియాలు- 1 టీస్పూన్ , జీలకర్ర- 1 టీస్పూన్, యాలకులు- 1 టీస్పూన్ , దాల్చిన చెక్క- 1 టీస్పూన్ , లవంగాలు- 1 టీస్పూన్ , బిర్యానీ ఆకు, ఎండు మిరపకాయలు
తయారీ విధానం
ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో నూనె వేడి చేసుకొని, అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు, పుదీనా, కొత్తిమీర, సరిపడా నీళ్లు, ఉప్పు, ముందుగా కట్ చేసుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీజార్ తీసుకుని, అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి.
ఆ తర్వాత మనం ఉడికించుకుంటున్న చికెన్ మిశ్రమంలో మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసి మళ్లీ ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలని తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని, అందులో పెరుగు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా, సరిపడా నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలకు అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేడి చేసుకొని, ముందుగా మసాలా పట్టించుకున్న చికెన్‌ను డీప్ ప్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ముందుగా ఉడికించుకున్న చికెన్ స్టాక్‌ను సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యివేడి చేసుకొని సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు, కిస్మిస్, జీడీపప్పు, టొమాటొ ప్యూరి, ముందుగా రెడీ చేసుకున్న స్టాక్ వేసి మూతపెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ స్టాక్ ఉడుకుతూ ఉండగా.. నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి మూతపెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే మండిరైస్ రెడీ.. మండి రైస్‌తో పాటు ప్రై చేసుకున్న చికెన్‌ను సర్వ్ చేసుకుంటే మండి బిర్యానీ రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: చిల్లీ పన్నీర్.. సాయంత్రం వేళ గరంగరంగా!