ETV Bharat / opinion

సరైన వసతులుంటే.. విశ్వగురు పీఠంపై భారత్?

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కోరుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే విదేశీ విద్యార్థులపై ట్రంప్​ తీసుకున్న తాజా నిర్ణయం వారి ఆశలకు పూర్తి వ్యతిరేకంగా మారింది. మరి వారికి ప్రత్యామ్నాయం ఏది? ఒకప్పుడు ప్రపంచానికే జ్ఞానాన్ని బోధించిన భారతీయ విశ్వవిద్యాలయాలే ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. ఇప్పటికైనా అగ్రశ్రేణి అధ్యాపకులతో బోధన గావించాలని ప్రముఖులు అంటున్నారు. ఈ మేరకు అన్ని స్థాయిల ప్రమాణాలను మెరుగుపరచుకుంటే భారత్​ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుంది.!

INDIAN UNIVERSITIES AND IMPROVEMENT STRATEGIES
విశ్వగురు పీఠంపై భారత్‌?
author img

By

Published : Jul 9, 2020, 7:19 AM IST

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని తపించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. తమ కలను నిజం చేసుకునే క్రమంలో అగ్రరాజ్యం చేరిన అటువంటివారిపై ట్రంప్‌ సర్కారు తాజా నిర్ణయం, ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ అథారిటీ నిర్దేశాలు పిడుగుపాటులా పరిణమించాయి. ఐసీఈ (ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ప్రకటన అనుసారం- కొవిడ్‌ విజృంభణ దృష్ట్యా విద్యాసంస్థలు పూర్తిగా ఆన్‌ లైన్‌ బోధనకు మారిపోతే, ఆయా కళాశాలల్లోని విదేశీ విద్యార్థులు అమెరికాను విడిచిపెట్టి స్వదేశానికి పయనం కట్టాల్సిందే.

లక్షల మంది విద్యార్థులపై..

లక్షలమంది భవిష్యత్తును ప్రభావితం చేసే ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి విద్యాలయాలూ తీవ్రంగా తప్పుపడుతున్న నేపథ్యంలో- న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కోలాటం ముమ్మరించే అవకాశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. తిరుగుముఖం పట్టడం అనివార్యమైతే అత్యధికంగా నష్టపోయేది చైనా, భారత విద్యార్థులే. ఎఫ్‌-1, ఎమ్‌-1 వీసాలతో ఉన్నత విద్యార్జనను లక్షించి అక్కడికి తరలివెళ్ళిన సుమారు రెండు లక్షలమంది భారతీయ విద్యార్థుల్లో లక్షమందికి పైగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు.

మాతృ దేశంలో వసతులు లేకనే..

మొత్తం 10 లక్షలమందికి మించిన విదేశీ విద్యార్థుల రూపేణా ఏటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సగటున సమకూరుతున్న మొత్తం మూడు లక్షల కోట్లరూపాయలకు పైమాటే. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం భారత విద్యార్థులు, వారి కుటుంబాలు వివిధ రుసుముల రూపేణా ఏటా వెచ్చిస్తున్న సొమ్ము పాతికవేల కోట్ల రూపాయలని అంచనా. పనికొచ్చే చదువుల కోసం వ్యయప్రయాసలకోర్చి ఇలా లక్షలమంది విద్యార్థులు రెక్కలు కట్టుకుని విదేశాలకు తరలిపోవడం ఇంకెన్నాళ్లు? మాతృదేశంలోనే సరైన వసతులుంటే విదేశీ సంస్థలకు ఇంతమంది భారతీయ విద్యార్థులు మహరాజ పోషకులు ఎందుకవుతారు?

ప్రపంచానికే జ్ఞానం నేర్పిన యూనివర్సిటిలే..

వరసగా తొమ్మిదో ఏడాదీ ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిన హార్వర్డ్‌తోపాటు ఆక్స్‌ఫర్డ్‌, యేల్‌, బొలోగ్నా ప్రభృత ప్రతిష్ఠాత్మక సంస్థలు వేరూనకముందే 'విశ్వగురు'గా భారత్‌ కీర్తి గడించింది. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంనుంచి 18 వందల సంవత్సరాల తరబడి తక్షశిల, నలంద, విక్రమశిల, వల్లభి, సోమాపుర వంటి మహా విద్యాలయాలు ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టాయి. అంతటి ఘనకీర్తి మంచుకొండగా కరిగిపోయి నేడు దేశంలో మూడింట రెండొంతుల విశ్వవిద్యాలయాలు, 90శాతం కళాశాలలు నేలబారు ప్రమాణాలతో నీరోడుతున్నాయి. గట్టి పునాదులపై సమున్నతంగా తేజరిల్లాల్సిన భారత ఉన్నత విద్యారంగం పరువు ప్రతిష్ఠలు క్షీణిస్తున్నాయని ప్రథమ ప్రధాని నెహ్రూయే వాపోయినా- ఇన్నేళ్లలో పకడ్బందీ దిద్దుబాటు చర్యలు పట్టాలకు ఎక్కకపోవడం దురదృష్టకరం.

నిపుణులు చెబుతోన్నదేంటంటే.?

ప్రపంచస్థాయి మేటి విశ్వవిద్యాలయాల జాబితాలో, పరిశోధన పత్రాల సమర్పణలో, పేటెంట్ల సాధనలో ఇండియా వెలాతెలా పోతోంది. సింగపూర్‌, తైవాన్‌, హాంకాంగ్‌ వంటివీ మెరుగైన ర్యాంకులు ఒడిసిపడుతుండగా భారతీయ విద్యాసంస్థలు చిన్నబోతున్నాయి. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్‌ చోటుచేసుకోవాలంటే మెరికల్లాంటి అధ్యాపక సిబ్బందిని కొలువు తీర్చాల్సిందేనని ఆక్స్‌ఫర్డ్‌ నిపుణులు ఉద్బోధించారు. మేలిమి బోధన, సృజనాత్మక పరిశోధనలకు అగ్ర ప్రాధాన్యమిచ్చి మేధాలబ్ధి పొందుతున్న దేశాల నుంచి ఇండియా నేర్వాల్సిన గుణపాఠాలెన్నో ఉన్నాయన్నది అసోచామ్‌, ఎస్‌ సంస్థల ఉమ్మడి అధ్యయన సారాంశం. పరిశ్రమలు, ప్రభుత్వాలతో విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా దేశాల్లో అద్భుతాలు ఆవిష్కరిస్తోంది. ‘భారత్‌లో తయారీ’ స్ఫూర్తికి ఓటేస్తున్న కేంద్రప్రభుత్వం విద్యారంగానా దేశ ప్రాభవ పునరుద్ధరణకు కంకణబద్ధం కావాలి. ఆ మేరకు అన్ని అంచెల్లోనూ ప్రమాణాల ఉన్నతీకరణే భారత్‌ను మళ్ళీ గురుస్థానంలో ప్రతిష్ఠించగలిగేది!

ఇదీ చదవండి: ట్రంప్ సర్కార్‌ నిర్ణయంపై విద్యాసంస్థల న్యాయ పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.