ETV Bharat / opinion

Pradhan Mantri Jan Aushadhi : దేశంలో 10,500 ప్రభుత్వ మందుల దుకాణాలు.. సామాన్యులకు చాలా చౌకగా.. - ప్రధాన్ మంత్రి జన్​ ఔషధి కేంద్రాలు

Pradhan Mantri Jan Aushadhi : భారత్‌లో బ్రాండెడ్‌ ఔషధాల ధరలు చుక్కలనంటుతున్నాయి. దాంతో రోగులపై తీవ్ర ఆర్థిక భారం తప్పడంలేదు. దీన్ని నివారించేందుకు దేశవ్యాప్తంగా జనరిక్‌ ఔషధాల వినియోగాన్ని ఇతోధికం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 10,500 జనరిక్‌ మందుల దుకాణాలను కొలువు తీర్చాలని లక్షించింది.

generic medicines
generic medicines
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 3:27 PM IST

Pradhan Mantri Jan Aushadhi : భారత్‌లో వైద్య చికిత్సల వ్యయంలో డెబ్భై శాతాన్ని ప్రజలు తమ జేబుల నుంచే వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా, వైద్యులు బ్రాండెడ్‌ ఔషధాలనే రాస్తున్నారు. వాటి కొనుగోళ్లకు రోగులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్‌, మూత్రపిండ వ్యాధులతో పాటు వృద్ధాప్య సమస్యలు అధికమవుతున్నాయి. జీవన శైలి సంబంధిత వ్యాధులైన ఊబకాయం, మానసిక రుగ్మతలు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో వైద్య వ్యయం, ఔషధ వినియోగం మరింత పెరగనున్నాయి.

భారత్‌లో అత్యవసర వినియోగ జాబితాలో ఉన్న 25శాతం ఔషధాల ధరలు మాత్రమే కేంద్రం నియంత్రణలో ఉన్నాయి. మిగిలిన 75శాతం మందుల ధరలను ఆయా సంస్థలే నిర్ణయిస్తున్నాయి. దాంతో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం తప్పడం లేదు. ఒక సర్వే మేరకు రాబోయే దశాబ్ద కాలంలో దేశీయంగా మందుల కొనుగోళ్లు మూడింతలు పెరగనున్నాయి. ఔషధాల ధరలు సైతం రాబోయే అయిదేళ్లలో తొమ్మిది నుంచి పన్నెండు శాతం మేర ఎగబాకవచ్చని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో చౌకగా రోగులకు నాణ్యమైన జనరిక్‌ మందులను అందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి జన్‌ ఔషధి కేంద్రాలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 10,500 జనరిక్‌ మందుల దుకాణాలను కొలువు తీర్చాలని లక్షించింది.

చాలా చవకగా..
Generic Medicine Central Government : బ్రాండెడ్‌ మందుల కంటే 50శాతం నుంచి 90శాతం దాకా తక్కువ ధరలోనే జనరిక్‌ మందులు లభిస్తాయి. వాటి వినియోగాన్ని దేశీయంగా మరింతగా పెంచాలని కేంద్రం ఆశిస్తోంది. అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తదితర దేశాలు దశాబ్దాలుగా ఇదే బాటలో పయనిస్తూ మంచి ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో దేశీయంగా రోగులకు వైద్యులు జనరిక్‌ మందులనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను అతిక్రమించే వైద్యులకు జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులను సైతం నిర్ణీత కాలం పాటు రద్దుచేస్తామని ప్రకటించింది. మరోవైపు ఇండియాలో బ్రాండెడ్‌ మందుల కారణంగా రోగుల మీద పడుతున్న ఆర్థిక భారంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై విచారణ సందర్భంగా అత్యంత చవకగా లభించే జనరిక్‌ ఔషధాలను కాదని, ఖరీదైన మందులు రాసే వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ఇటీవల కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ప్రపంచ దేశాలకు కారుచౌకగా నాణ్యమైన జనరిక్‌ మందులను సరఫరా చేసే భారతీయ ఔషధ సంస్థలు కొన్ని, దేశీయంగా మాత్రం నాసిరకమైనవి విక్రయిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. భారత్‌ నుంచి ఎగుమతి అయిన దగ్గు మందులు వికటించి గాంబియాలో చిన్నారులు మరణించారు. ఇలాంటి ఘటనలు పలు ఔషధ సంస్థల నాణ్యతా ప్రమాణాలపై భయాందోళనలు లేవనెత్తుతున్నాయి. ప్రతి బ్యాచ్‌ మందుల నాణ్యతను తనిఖీ చేశాకే వాటిని విపణిలోకి అనుమతించాలి. భారత్‌లో 10శాతం లోపే నాణ్యతా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ లొసుగులను ఆసరాగా చేసుకొని పలు కంపెనీలు నాసిరకం మందులు యథేచ్ఛగా తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో నాణ్యమైన జనరిక్‌ మందులు దేశీయ విపణిలో విరివిగా లభించే దాకా భారత వైద్య మండలి తన నిర్ణయాన్ని వాయిదా వేయాలని భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) కోరింది. ఐఎంఏ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర వైద్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఎన్‌ఎంసీకి సూచించినట్లు కథనాలు వెలువడ్డాయి. దాంతో తన ఆదేశాలను ఎన్‌ఎంసీ ప్రస్తుతానికి నిలిపివేసింది.

అరకొర కేంద్రాలు
Generic Medicine Govt Of India : భారత్‌లో జనరిక్‌ మందుల వినియోగం పెరగాలంటే వాటి నాణ్యత, సమర్థతను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. వైద్యులు, ప్రజల్లో వాటిపై భరోసా నింపాలి. జనరిక్‌ మందులు విక్రయించే జన్‌ ఔషధి కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలి. దేశీయంగా చాలా రాష్ట్రాల్లో రెండు మూడు లక్షల జనాభాకు ఒక జన్‌ ఔషధి కేంద్రమే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటి సంఖ్య పెంచడమే కాదు, అన్ని రకాల మందులు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూడటం తప్పనిసరి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ దవాఖానాలు, పలు రకాలుగా సర్కారీ రాయితీలు పొందే కార్పొరేట్‌ ఆస్పత్రులు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటున్న నెట్‌వర్క్‌ వైద్యశాలల్లో జనరిక్‌ మందుల వాడకాన్ని తప్పనిసరి చేయాలి. వాటివల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. జనరిక్‌ ఔషధాల నాణ్యత తనిఖీల కోసం అవసరమైన యంత్రాంగాన్ని కొలువుతీర్చి, నిర్దిష్ట విధివిధానాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మందుల కంపెనీల అనుమతుల జారీలో, నాణ్యతా ప్రమాణాల తనిఖీలో ఎలాంటి అవినీతికి, ప్రలోభాలకు తావు లేకుండా చూడటం మరో ప్రధాన అంశం. అప్పుడే వైద్యులకు, ప్రజలకు జనరిక్‌ ఔషధాల పట్ల నమ్మకం పెరిగి, వాటి వినియోగం జోరందుకుంటుంది. తద్వారా ప్రజలపై ఔషధాల ఆర్థిక భారం దిగివస్తుంది.

భారీగా ఎగుమతులు
భారతీయ ఫార్మా రంగం ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తోంది. పరిమాణం పరంగా 14వ స్థానంలో ఉంది. దాదాపు మూడు వేల ఔషధ సంస్థలు, పది వేలకు పైగా మందుల తయారీ కర్మాగారాలు ఇండియాలో ఉన్నాయి. అరవై దాకా చికిత్సా విభాగాల్లో అవసరమయ్యే 60 వేల రకాలకు పైగా జనరిక్‌ మందులను సమర్థంగా అవి ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగమవుతున్న జనరిక్‌ మందుల్లో 20శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి. అమెరికాలో దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న 40శాతం జనరిక్‌ మందులు ఇండియా నుంచే ఎగుమతి అవుతున్నాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో వినియోగించే నాలుగో వంతు జనరిక్‌ ఔషధాలు భారత్‌ నుంచే వెళ్తున్నాయి. అయితే, ఇండియాలో జనరిక్‌ మందుల వినియోగం కేవలం పది శాతమే. ఫలితంగా ప్రజలపై బ్రాండెడ్‌ ఔషధాల భారం తప్పడం లేదు.

Generic Medicine NMC Guidelines : 'ఆ మందులు రాయకుంటే డాక్టర్ల లైసెన్స్​ రద్దు'.. NMC కీలక ఆదేశాలు

'ఆ రెండు దగ్గుమందులు వాడొద్దు'.. WHO హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.