ETV Bharat / opinion

Online Loan Scams : ఆన్​లైన్​ లోన్​ యాప్‌ల మోసాలకు కళ్లెం వేయాల్సిందే! - ఆన్​లైన్​ రుణ యాప్​ల మోసాలు

Online Loan Scams : డిజిటల్‌ రుణ ప్రక్రియలో అక్రమాలను నియంత్రించే దిశగా రిజర్వు బ్యాంకు రూపొందించిన నిబంధనల పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ నిబంధనలు పకడ్బందీగా లేవనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మోసపూరితమైన రుణ యాప్‌లకు అవి వర్తించకపోవడం ఎంతవరకూ సహేతుకమనే ప్రశ్న తలెత్తుతోంది.

Online Loan Scams
Online Loan Scams
author img

By

Published : Nov 11, 2022, 8:30 AM IST

Online Loan Scams : భారత్‌లో పెద్దనోట్ల రద్దు తరవాత డిజిటల్‌ చెల్లింపులు ఉవ్వెత్తున పెరిగాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) డిజిటల్‌ కరెన్సీతో ప్రయోగం ప్రారంభించింది. మారిన వాతావరణంలో ఇటీవల ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) రంగంలో పెట్టుబడులు ఊపందుకొన్నాయి. అదేసమయంలో డిజిటల్‌ రుణయాప్‌లు పెద్దయెత్తున రంగప్రవేశం చేశాయి. ఇవి ఖాతాదారులను వేధిస్తున్నాయనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఈ ఏడాది సెప్టెంబరు నెలలో డిజిటల్‌ రుణదాతలకు మార్గదర్శక నిబంధనలు విడుదల చేసింది. ఈ నిబంధనలు ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, ఆర్‌బీఐ వద్ద రిజిస్టరైన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కొన్ని సహకార సంస్థలు, మైక్రోఫైనాన్స్‌ సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి. ఆర్‌బీఐ ఇటువంటి నిబంధనలను జారీ చేయడం ఇదే మొదటిసారి. ఆదరాబాదరాగా తెచ్చిన ఆ మార్గదర్శకాలు అరకొరగా ఉన్నాయి. కొన్ని కీలకమైన అంశాలపై పరిశీలన జరపాల్సి ఉందని ఆర్‌బీఐ చెబుతోంది.

దోపిడికి ఆస్కారం
ఆర్‌బీఐ విడుదల చేసిన మార్గదర్శకాల వల్ల దాని ప్రతిష్ఠ మసకబారే ప్రమాదముంది. ఆర్‌బీఐ తాజా నిబంధనలు డిజిటల్‌ రుణ దాతలను మూడు రకాలుగా వర్గీకరించాయి. 1.ఆర్‌బీఐ నియంత్రణలో పనిచేసే బ్యాంకులు, సంస్థలు 2.ఆర్‌బీఐ కాకుండా ఇతర చట్టాలు, నిబంధనల పరిధిలోకి వచ్చే సంస్థలు 3.చట్టానికి, వ్యవస్థాగత నియంత్రణలకు వెలుపల వడ్డీ వ్యాపారం చేసేవారు. తాజా మార్గదర్శకాలు ఆర్‌బీఐ నియంత్రణలోని సంస్థలు, బ్యాంకులకే వర్తిస్తాయి తప్ప మిగిలిన రెండు వర్గాలకు, ముఖ్యంగా చైనా రుణ యాప్‌లకు వర్తించవని గమనించాలి. వీటిని నియంత్రించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.

లేదా సంబంధిత చట్టాలు ఏమైనా ఉంటే వాటి అజమాయిషీలో ఈ తరహా రుణదాతలు పనిచేయాల్సి ఉంటుంది. రిజిస్టరైన రుణ వితరణ సంస్థలు, అప్పులిచ్చే ఇతర సంస్థలు, యాప్‌ల పాత్రను ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. అన్ని రుణాల పంపిణీ, చెల్లింపులు రిజిస్టర్డ్‌ సంస్థల ద్వారా జరగాలి. ఆ సంస్థలు, ఖాతాదారులు ఇందుకయ్యే రుసుములను రుణ సేవలు అందించే సంస్థలకు చెల్లించాలి. డిజిటల్‌ రుణాల మంజూరుకు అయ్యే ఖర్చులను ప్రామాణిక కీలకాంశాల ప్రకటనలో తెలపాలి. ఖాతాదారుడు కోరితే తప్ప రుణ పరిమితిని పెంచడానికి వీల్లేదు. ఖాతాదారుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడానికి ప్రత్యేక యంత్రాంగం ఉండాలి.

డిజిటల్‌ రుణయాప్‌లు తమ ఖాతాదారులు అనుమతిస్తే తప్ప- వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి వీల్లేదు. రుణ మంజూరు పత్రాలన్నీ డిజిటల్‌ పద్ధతిలో సంతకం చేసి ఉండాలి. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ.. ఎంత వడ్డీ వసూలు చేయవచ్చో ఆర్‌బీఐ స్పష్టంగా నిర్దేశించకపోవడం ఖాతాదారుల దోపిడికి వీలు కల్పిస్తోంది. రుణదాత, గ్రహీత ముందే అంగీకరించిన అంశాలు లేదా ఒప్పందం ఆధారంగా రుణ ఒప్పందాలు, బీమా ఒప్పందాలు అమలవుతాయి. ఆర్‌బీఐ గరిష్ఠ వడ్డీ పరిమితిని నిర్దేశించకపోవడంవల్ల చిత్తం వచ్చినట్లు వడ్డీ పిండుకునే అవకాశాన్ని రిజిస్టర్డ్‌ రుణ వితరణ సంస్థలకు ఇచ్చినట్లయింది.

ముందస్తు ఒప్పందంలో ఆస్తుల తనఖాపై ఏడాదికి 36శాతం వడ్డీకి రుణదాత, గ్రహీత అంగీకరిస్తే- ఏదైనా వివాదం తలెత్తినప్పుడు దిగువ కోర్టులు జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సందర్భాలు అనేకం. ఒప్పందం ప్రకారం అధిక వడ్డీ చెల్లించాల్సిందేనని అవి తీర్పు ఇచ్చాయి. తాజాగా ఆర్‌బీఐ సైతం అధిక వడ్డీపై నియంత్రణ విధించడానికి నిరాకరించింది. దీంతో డిజిటల్‌ రుణ యాప్‌ల నిర్వాహకులు అధిక వడ్డీ గుంజుకోవడానికి మార్గం సుగమమైంది. భవిష్యత్తులో ఏమైనా బ్యాంకులు ఆర్‌బీఐ నిర్దేశించిన వడ్డీకి రుణాలివ్వకుండా తమ డిజిటల్‌ రుణ యాప్‌ల ద్వారా ఎక్కువ వడ్డీకి రుణాలిచ్చినా అడ్డేమీ ఉండదు.

ప్రత్యేక చర్యలు అత్యావశ్యకం
ఈ మధ్య కొన్ని ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారుల నుంచి తక్కువ మొత్తాల్లో రుసుములు వసూలు చేస్తున్నాయి. అదేమని ప్రశ్నిస్తే కంప్యూటర్‌లో పొరపాటు జరిగిందని సాకు చెబుతున్నాయి. డిజిటల్‌ సాంకేతికత అన్ని పొరపాట్లను, లోపాలను పరిహరిస్తుందని ఊదరగొడుతుంటారు. కానీ, సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ఉద్దేశపూర్వకంగా పొరపాటు జరిగేట్లు కోడింగ్‌ చేస్తే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నేడు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న డిజిటల్‌ రుణ యాప్‌లలో మోసపూరితమైనవి చాలా ఉన్నాయి.

అలాంటి వేలాది యాప్‌ల నియంత్రణ బాధ్యతను ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసు శాఖలకు వదిలేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. డిజిటల్‌ రుణ యాప్‌ల నియంత్రణకు కావలసిన అధునాతన సాంకేతికతలను పోలీసు శాఖలు సమకూర్చుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. దానికోసం ప్రత్యేక విభాగాలను తెరవాల్సి ఉంటుంది. కొత్త సాంకేతికతలు, బ్యాంకింగ్‌, ఒప్పంద చట్టం, కోర్టు ప్రక్రియలపై అవగాహన పెంచుకోవలసి ఉంటుంది.

కాబట్టి ఆర్‌బీఐ డిజిటల్‌ రుణ వితరణ మార్గదర్శకాలను అమలు చేసే బాధ్యతను కేవలం రాష్ట్ర ప్రభుత్వాలపై మోపకుండా కేంద్ర మంత్రిత్వ శాఖలు, టెలికాం సంస్థలు, సెబి, రాష్ట్రాలు కలిసికట్టుగా ఆ గురుతర బాధ్యతను నెరవేర్చాలి. ఒక ప్రత్యేక, స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పరచి అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు భాగస్వాములు కావాలి. ఆ సంస్థ నేరుగా పార్లమెంటుకే జవాబుదారీ వహించాలి. డిజిటల్‌ రుణ వితరణ సజావుగా, న్యాయంగా జరగడానికి ఇలాంటి ఏర్పాటు చాలా అవసరం.

సమస్యలపై శీతకన్ను
నష్టాలను ఎవరు భరించాలి, డేటా భద్రత, ఖాతాదారుల ప్రయోజనాల రక్షణ, రుణ వసూలు పద్ధతులు తదితర అంశాలపై తుది విధానం ఖరారు కాకముందే ఆర్‌బీఐ హడావుడిగా మార్గదర్శకాలను విడుదల చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటిత-అసంఘటిత రంగాల్లో రుణాల మంజూరు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారంపై ఆర్‌బీఐకి అవగాహన లోపించిందని మార్గదర్శకాలను చూస్తే అర్థమవుతుంది. 2010లో ఆంధ్రప్రదేశ్‌ మైక్రోఫైనాన్స్‌ సంస్థల సంక్షోభంలోనూ ఆర్‌బీఐ ఇటువంటి అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించింది.

రుణదాతలు తమను తాము నియంత్రించుకోవాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లుంది. కానీ, ఫైనాన్స్‌ రంగం స్వీయ నియంత్రణ పాటిస్తుందనుకోవడం భ్రమ అని 2008లో సంభవించిన అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, 2010నాటి మైక్రోఫైనాన్స్‌ సంక్షోభం స్పష్టం చేశాయి. రుణ మంజూరు, వసూలులో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి 'స్వీయ నియంత్రణ' అనే సాకు తోడ్పడుతుంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తే తప్ప ప్రభుత్వం, ఆర్‌బీఐ రంగంలోకి దిగడం లేదు.

ఇవీ చదవండి : సంపాదన ఇప్పుడే స్టార్ట్ అయిందా?.. ఈ 10 టిప్స్‌ మీ కోసమే!

క్రెడిట్‌ కార్డ్ క్యాన్సిల్‌ చేయాలా? ఈ తప్పులు చేయొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.