ETV Bharat / opinion

Hamas Secret Weapon : 'రహస్య ఆయుధం'తో హమాస్ దొంగదెబ్బ!.. ఇజ్రాయెల్​ను ఢీకొట్టేందుకు భారీ స్కెచ్​! ​

Hamas Secret Weapon : పక్కా ప్రణాళికతోనే ఇజ్రాయెల్​లో హమాస్​ మారణహోమం సృష్టించిందా? ఇజ్రాయెల్ చేపట్టే భూతల దాడులకు హమాస్​ 'రహస్య ఆయుధం'తో బదులివ్వబోతోందా? దీనిపై హమాస్​ ఇంతకుముందే క్లూ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సొరంగాలు నిర్మించే అనుభవంతో.. శక్తిమంతమైన ఇజ్రాయెల్​ దాడులను ఎదుర్కునేందుకు హమాస్​ వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఇంతకీ హమాస్​ ప్రయోగించే ఆ రహస్య ఆయుధం​ ఏంటో తెలుసుకోవాలంటే 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం చదవండి.

Hamas Secret Weapon
Hamas Secret Weapon
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 1:48 PM IST

Hamas Secret Weapon : గాజాపై ఇజ్రాయెల్​ భారీ భూతల దాడులకు సిద్ధమవుతున్న తరుణంలో.. హమాస్​ కూడా ఆ దాడులను ధీటుగా ఎదుర్కోవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తే.. సొరంగాలు నిర్మించడంలో తమకున్న నైపుణ్యాన్ని ఉపయోగించుకుని.. ప్రత్యర్థి దాడులకు చెక్​ పెట్టాలనుకుంటోంది హమాస్. అందులో భాగంగా తమ వద్దనున్న 'రహస్య ఆయుధం'తో తమ కన్నా శక్తిమంతమైన ఇజ్రాయెల్​తో భీకర పోరుకు వినూత్న విధానం అవలంభించబోతోందని సమాచారం. హమాస్​ ప్రయోగించే ఆ రహస్య ఆయుధం​ గురించి 'ఈటీవీ భారత్'కు ప్రత్యేకంగా వివరించారు ​దిల్లీకి చెందిన మేధోమథన సంస్థ 'ఇమాగ్​​ఇండియా' (ImagIndia) అధ్యక్షుడు రాబిందర్ సచ్​దేవ్​.

హమాస్ రహస్య ఆయుధం..
గత దశాబ్ద కాలంగా సొరంగాలు ఉపయోగించుకుని.. ఇజ్రాయెల్​ సేనలను చిరాకు పెట్టిస్తోంది హమాస్​. గాజాలో తవ్విన సొరంగాలు నిజానికి.. ఇజ్రాయెల్ దిగ్భందనాన్ని అధిగమించడానికి, ఈజిప్టు నుంచి వస్తువులను అక్రమంగా తరలించేందుకు ఉపయోగించేవారు. ఆ తర్వాత హమాస్​, పాలస్తీనా ఇస్లామిక్​ జిహాద్​కు చెందిన మిలిటెంట్లు కొత్త సొరంగాలు తవ్వి.. అందులో ఇజ్రాయెల్ ఉపగ్రహాలు, విమానాలు గుర్తించకుండా రాకెట్లు, రాకెట్​ లాంఛర్లను భద్రపరిచేవారు. వాటితో ఇజ్రాయెల్​పై దాడికి దిగేవారు. ఇప్పుడు ఈ సొరంగాలను ఉపయోగించుకునే ఇజ్రాయెల్ దాడులకు ఎదుర్కునేందుకు హమాస్​ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒక బాంబును సముద్రంలోకి ప్రయోగిస్తారు. ఆ విస్ఫోటనం వల్ల వచ్చిన నీటితో వరదలు సృష్టించేలా వ్యూహం సిద్ధం చేసినట్లు దిల్లీకి చెందిన మేధోమథన సంస్థ 'ఇమాగ్​​ఇండియా (ImagIndia)' ఓ నివేదికలో పేర్కొంది.

Hamas Secret Weapon
గాజా సరిహద్దు వైపు దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ ట్యాంకులు

సముద్ర వరద సృష్టించే సొరంగాలు..
'ఈ సముద్ర వరద ఎలా సృష్టిస్తారో తెలుసుకోవాలంటే.. ముందు గాజా భౌగోళిక స్వరూపంపై అవగాహన ఉండాలి. గాజా స్ట్రిప్.. మధ్యదరా సముద్రం తూర్పు తీరంలో ఉన్న ఓ ఇరుకైన భూభాగం. తూర్పు, ఉత్తరాన ఇజ్రాయెల్.. నైరుతి వైపు ఈజిప్ట్ సరిహద్దులుగా కలిగి ఉంది. దాదాపు 365 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉన్న గాజాలో.. దాదాపు 25 శాతం భూభాగం సముద్ర మట్టం కన్నా దిగువన ఉంటుంది. గాజాలో సముద్ర మట్టానికి దిగువన ఉన్న నాలుగు ప్రాంతాలలో.. మూడు ప్రాంతాలు ఉత్తర, మధ్య గాజాలో ఉన్నాయి. మరో ప్రాంతం దక్షిణాన గాజా- ఈజిప్టు మధ్య ఉన్న రాఫా క్రాసింగ్. హమాస్​లో..​ సాధారణంగా 50 అడుగుల లోతులో సొరంగాలు నిర్మించింది. అయితే ఈ వరద సృష్టించడానికి మాత్రం 3-4 అడుగుల లోతులో సొరంగాలు నిర్మించనుంది. వాటిని మధ్యదరా సముద్ర తీర ప్రాంతానికి అనుసంధానం చేస్తుంది. ఇజ్రాయెల్ ఆక్రమణకు వచ్చినప్పుడు.. సముద్రంలో బాంబుతో విస్ఫోటనం సృష్టిస్తుంది. అనంతరం సొరంగాల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో వరద వచ్చేట్లు చేసి చిత్తడి నేలల్ని తయారు​ చేస్తుంది. ఫలితంగా ఇజ్రాయెల్ ట్రక్కులు, ట్యాంకులు ముందుకు వెళ్లడం అసాధ్యం అవుతుంది' అని రాబిందర్ సచ్​దేవ్​ 'ఈటీవీ భారత్​'కు వివరించారు.

Hamas Secret Weapon
ఇజ్రాయెల్- హమాస్​ యుద్ధం

కానీ అదెలా సాధ్యం!?
అయితే ఇలా సొరంగాల్లో నీటిని నింపడం ద్వారా ఇజ్రాయెల్​ దళాలకు మరో ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. 50 అడుగుల లోతులో ఉన్న సొరంగాలను ధ్వంసం చేయడానికి ఈ ఏడాది మేలో ఇజ్రాయెల్-అమెరికా మధ్య 750 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా కచ్చితత్వంతో టార్గెట్​ను ఛేదించే గైడెడ్​ ఆయుధాలను ఇజ్రాయెల్ కొనుగోలు చేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్​ వద్ద.. భూగర్భంలో విధ్వంసం సృష్టించే 'బంకర్​ బస్టర్లు' ఉన్నాయి. ఒకవేళ వీటిని ఇజ్రాయెల్​ ప్రయోగిస్తే.. పరిస్థితి మరింత దిగజారుతుంది. వరద ఎక్కువ ప్రాంతానికి వ్యాపించి కల్లోలం సృష్టిస్తుంది. అయితే అంత తక్కువ లోతులో హమాస్​ సొరంగాలు ఎలా నిర్మిస్తుందన్నదే ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న.

సీక్రెట్​ ఆయుధం.. ముందుగానే క్లూ ఇచ్చిన హమాస్​!
హమాస్​.. జరగబోయే పరిణామాలను పూర్తిగా అంచనా వేసుకుని, పక్కా ప్రణాళికతో ఇజ్రాయెల్​పై దాడులకు దిగినట్లు ఈ నివేదికలతో స్పష్టమవుతోంది. అనూహ్యంగా క్షిపణులతో ఒకేసారి ముప్పేట విరుచుకుపడటం నుంచి సాధన చేసి మరీ ఇజ్రాయెల్​ భూభాగంలో చొచ్చుకెళ్లి మారణహోమం సృష్టించడం వరకు అంతా అందులో భాగమే అన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా.. ఈ దాడులకు హమాస్​ 'ఆపరేషన్​ అల్​ అఖ్సా ఫ్లడ్​' అని కోడ్​నేమ్​ పెట్టుకోవడం.. ఈ 'రహస్య ఆయుధం' నిజమే అన్న నివేదికలను బలపరుస్తోంది.

Palestine President Hamas : హమాస్ మిలిటెంట్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు: పాలస్తీనా అధ్యక్షుడు

Israel Hamas War 2023 : పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధోన్మాదం.. రావణకాష్ఠం ఆగాలంటే భారత్‌ సూచనలే బెటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.