ETV Bharat / opinion

లాక్​డౌన్​ కాలంలో మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా? - corona virus news

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో మహిళలతో పోలిస్తే పురుషులు నాలుగు రెట్లు అధికంగా ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే కుంగుబాటు సమస్యలు ఉన్నవారు మరింత అభద్రతా భావానికిలోనై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యను ఎదుర్కోవచ్చో నిపుణులు సూచిస్తున్న మార్గాలు ఇవే..

depression
మానసిక ఒత్తిడి
author img

By

Published : Apr 30, 2020, 9:15 AM IST

మహమ్మారి కరోనా దూకుడుకు లాక్‌డౌన్‌తో కళ్ళెం పడినప్పటికీ అది పరోక్షంగా ప్రజల మానసిక స్థితిగతులపై ప్రభావాన్ని చూపుతుండటం కలవరపెడుతోంది. దీర్ఘకాల స్వీయ గృహ నిర్బంధం, ఉపాధి అవకాశాలకు గండిపడటం, ఆదాయం కోల్పోవడం, దైనందిన అవసరాలను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు, రేపటి గురించిన ఆలోచనలు- మానసిక కుంగుబాటుకు కారణమవుతున్నట్లు మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.

ఒక రకమైన జీవనశైలికి అలవాటు పడిన ప్రజలు, అందుకు భిన్నమైన పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కలవరపడతారు. వాటిని తట్టుకుని ముందుకు సాగేది కొందరైతే, జీర్ణించుకోలేక తీవ్ర మానసిక ఒత్తిళ్లకు, ఆందోళనకు, సంఘర్షణకు గురై తొందరపాటు చర్యలకు పాల్పడేవారు మరికొందరు. నిరుద్యోగం, పేదరికంలో మగ్గుతున్నవారు, గృహహింస, లైంగిక వేధింపుల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నవారు, కొవిడ్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఈ తీవ్ర ఆందోళనకు గురవుతున్నవారిలో ప్రధానంగా ఉన్నారు.

లాక్‌డౌన్‌వల్ల నేరాలు తగ్గుముఖం పట్టినా, గృహహింస పెచ్చుమీరిపోయిందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనాతో జరుగుతున్న పోరాటంలో ముందువరసలో ఉన్న ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల్లో ఆందోళన, ఒత్తిడి అధికమవుతున్నట్లు అంచనా. వీరిలో ఇప్పటికే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నట్లయితే, వారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

ఉద్యోగ భద్రత..

చికిత్సకు అవసరమైన మందులు కాని, మానసిక వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంవల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి మరింత రెట్టింపు కావడానికి దోహదం చేస్తోంది. ఇంటిల్లిపాదీ ఒకేచోట ఉండటంవల్ల అన్ని పనులు చూసుకోవాల్సి రావడం, ఉద్యోగ భద్రతకు పొంచి ఉన్న ముప్పు మొదలైన పరిస్థితులు కూడా గృహిణులు, ఉద్యోగుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

ఆర్థికపరమైన అంశాలు..

మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను కౌన్సెలింగ్‌ ద్వారా కొంతవరకు పరిష్కరించవచ్ఛు వాస్తవానికి ప్రజల ఆందోళనకు ఆర్థికపరమైన అంశాలే ప్రధానంగా కారణమవుతున్నాయి. అయినవారి కోసం ఇళ్లకు చేరుకోవాలన్న ఆరాటమూ మరో పార్శ్వం. మూటలు నెత్తిన పెట్టుకుని సొంతూళ్లకు వందలాది కిలోమీటర్ల దూరం కాలినడకన బయలుదేరుతున్న వలస జీవుల వెతలు అన్నీ ఇన్నీ కావు. కార్మికులు, వలస జీవులు, దిగువ మధ్యతరగతి, దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజలను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలు- ఆహారం, ఆవాసాల కొరత.

విధాన రూపకర్తలు బాధితుల కోసం ఉద్దేశించిన ఉపశమన చర్యలు వాస్తవిక సమస్యలను పరిష్కరించే విధంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. సహాయం కోసం ఉదారంగా ముందుకు వచ్చే దాతలు, సంపన్నుల చర్యలు బాధితుల గౌరవాభిమానాలను సవాలు చేసేవిధంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సహాయాన్ని పొందుతున్న క్రమంలో భాగంగా వారు అవమానాలకు గురైనట్లుగా భావిస్తే అది దీర్ఘకాలికంగా వారి మానసిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది.

ఆత్మహత్యలకూ దారి తీస్తాయి..

సమాజంలోని కుల, మత, వర్గ, లింగ విచక్షణ, అసమానతలు- పీడిత, బాధిత వర్గాల ప్రజల మానసిక స్థితిగతులపై గణనీయ ప్రభావం చూపుతాయి. ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఆత్మహత్యలకూ దోహదమవుతున్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైన మాట వాస్తవం. మహిళలతో పోలిస్తే పురుషులు నాలుగు రెట్లు అధికంగా ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే కుంగుబాటు సమస్యలు ఉన్నవారు మరింత అభద్రతా భావానికిలోనై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దురలవాట్లతో..

కరోనా సోకితే బతికి బయటపడగలమా లేదా అనే ఆలోచనలు, స్నేహితులు, ఆటపాటలతో కాలం గడపడానికి బదులు ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయామనే భావన యువతలో కనిపిస్తోంది. పొగ తాగడం, మద్యపానం, మత్తు పదార్థాలకు తీవ్రంగా అలవాటుపడినవారు కొంతకాలంగా వాటికి దూరం కావడంవల్ల మానసికం కుంగుబాటుకు గురవుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్యే ఉంటున్నా తెలియని గుబులుతో నిరాశ, నిస్పృహల్లోకి జారుతున్నారు. భయాందోళనలతో కొంతమంది నిద్రపట్టక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సున్నిత మనస్కులు భవిష్యత్తు మీద బెంగతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటన్నింటికీ పరిష్కారం- ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యంతో ముందుకు నడవడమే.

ఎలా జయించాలి..?

ఎప్పటికప్పుడు ప్రభుత్వం, వైద్య-ఆరోగ్యశాఖ అందిస్తున్న సూచనలు, మార్గదర్శకాలను పాటించాలి. ఈ పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్లు కలకాలం ఉండవనే ఆశావహ దృక్పథం ఇప్పుడెంతో అవసరం. కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జీవితాన్ని గడపడానికే సమయం కేటాయించాలి. జనవరి 2020లోనే కరోనా మహమ్మారి వ్యాప్తిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నింటికీ శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారిని అదుపు చేయడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రభుత్వాలకు, పౌరులకు పలు మార్గదర్శకాలను, సూచనలను విడుదల చేసింది. వీటిని తు.చ. తప్పకుండా పాటించి, ఆత్మవిశ్వాసంతో కరోనాపై అంతిమంగా విజయం సాధించవచ్చు.

(రచయిత- మనస్వి)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.