ETV Bharat / opinion

CPEC Project News: డ్రాగన్‌ కలల ప్రాజెక్టు 'సీపెక్'​కు తప్పని చిక్కులు..

author img

By

Published : Oct 3, 2021, 6:59 AM IST

పశ్చిమ చైనాలోని కష్గర్​ను అరేబియా సముద్ర తీర ప్రాంతమైన గ్వాడర్​ ఓడరేవుకు అనుసంధానించేదే సీపెక్(చైనా-పాకిస్థాన్​ ఎకనామిక్​ కారిడర్​)​​(CPEC Project News). ఇందులో భాగంగా 70బిలియన్​ డాలర్ల విలువగల రైల్వే, హైవే ప్రాజెక్టులను నిర్మించనుంది చైనా(CPEC Project Of China). అయితే.. డ్రాగన్‌ కలల ప్రాజెక్టుకు చిక్కులు తప్పటం లేదు. ఆర్థిక సమస్యలు, భద్రతాపరమైన చిక్కులూ ఎదురవుతున్నాయి.

CPEC Project
సీపెక్ ప్రాజెక్టు

ఎంతో ఆర్భాటంగా మొదలైన చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సిపెక్‌) ప్రాజెక్టుకు(CPEC Project News) ఆర్థిక సమస్యలు తలెత్తాయి. టెర్రరిస్టులవల్ల భద్రతాపరమైన చిక్కులూ ఎదురవుతున్నాయి. సిపెక్‌ కింద విద్యుత్‌ కేంద్రాలను నిర్మిస్తున్న చైనా కంపెనీలకు పాక్‌ ప్రభుత్వం 140 కోట్ల డాలర్ల (రూ.10,380 కోట్ల) బకాయిలు చెల్లించాల్సి ఉంది. సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగకపోవటంతో చైనా కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. పాక్‌ ప్రభుత్వ శాఖల నుంచి చైనా కంపెనీలకు తక్షణం ఎంతో కొంత సొమ్ము ముట్టేలా చూడటానికి సిపెక్‌ వ్యవహారాలపై ప్రధానమంత్రి ప్రత్యేక సలహాదారు అయిన ఖాలిద్‌ మన్సూర్‌ ప్రయత్నిస్తున్నారు. విద్యుత్‌ ప్రాజెక్టుల రుణ పునర్‌వ్యవస్థీకరణకు చైనా ప్రభుత్వంతో పాకిస్థాన్‌ సంప్రతింపులు జరుపుతోంది. పాక్‌లో సిపెక్‌తో(CPEC Project Of China) పాటు ఇతర ప్రాజెక్టులనూ చైనా కంపెనీలు నిర్మిస్తున్నాయి. ఇలాంటి కంపెనీల సంఖ్య 135 వరకు ఉంటుంది.

సిపెక్‌(CPEC Project Of China) కిందనే కాకుండా స్వతంత్రంగానూ చైనా కంపెనీలు విద్యుత్కేంద్రాలను నిర్మిస్తున్నాయి. అలాంటి ప్రాజెక్టుల్లో ఒకటి- దాసు జలవిద్యుత్‌ కేంద్రం. పాక్‌ సైన్యం పహరాలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులోని చైనా సిబ్బందిపై రెండు నెలల క్రితం టెర్రరిస్టు దాడి జరిగింది. మొమ్యాండ్‌ డ్యామ్‌ పనులు చేస్తున్న చైనా కంపెనీల సిబ్బందిపైనా టెర్రరిస్టులు దాడి చేశారు. పాకిస్థాన్‌లో చైనీయులు ఆర్థికంగా, వ్యక్తిగత భద్రతపరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

చైనా కంపెనీల నిర్మాణ పనులు నాసిరకంగా ఉండటంతో- ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలు చైనా కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దుచేస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన 'ఎవ్రీవే ట్రాఫిక్‌ అండ్‌ లైటింగ్‌ టెక్‌' కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పది కోట్ల డాలర్ల ప్రాజెక్టు కింద ప్రత్యేక రవాణా నిర్వహణ వ్యవస్థను రూపొందించి, రవాణా భద్రతను పెంపొందించాలి. ఆ కంపెనీ పనుల్లో నాణ్యత లేదంటూ ఘనా ప్రభుత్వం కాంట్రాక్టును రద్దు చేసింది.

డ్రాగన్​పై అనుమానం..

కాంగో దేశం సైతం చైనా(Congo China) కంపెనీలకు గనుల ప్రాజెక్టులను ఇవ్వడాన్ని పునస్సమీక్షించాలని నిర్ణయించింది. డ్రాగన్‌ తమ ఖనిజ వనరులను దోపిడి చేయడానికే వచ్చిందని భావిస్తోంది. తమ దేశ ప్రజలు ఇప్పటికీ పేదరికంలో మగ్గుతుంటే, ఇక్కడికి వచ్చిన చైనా కంపెనీలు డబ్బు పోగేసుకుంటున్నాయని సాక్షాత్తు కాంగో దేశాధ్యక్షుడు ఫిలిక్స్‌ షిసెకేడి వ్యాఖ్యానించారు. కాంగో(Congo China) నుంచి చైనా ఖనిజ వనరులను తవ్వితీసుకుని, దానికి బదులుగా రోడ్లు, ఇతర మౌలిక ప్రాజెక్టులను నిర్మించేలా గతంలో ఒప్పందం కుదిరింది. దానివల్ల తమకు లబ్ధి చేకూరడం లేదు కాబట్టి దాన్ని సమీక్షించాలని అధ్యక్షుడు నిశ్చయించారు. ప్రపంచంలో అత్యధిక కోబాల్ట్‌ నిక్షేపాలు, ఆఫ్రికాలో అత్యధిక రాగి నిల్వలు ఉన్నది కాంగోలోనే. ఇక్కడి ఖనిజ నిక్షేపాలను తవ్వితీసుకోవడానికి అనుమతించినందుకు బదులుగా కాంగోలో రోడ్లు, ఆస్పత్రులు నిర్మాణానికి 2007లో సైనో హైడ్రో, చైనా రైల్వే సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

నేడు కాంగో గనుల్లో 70శాతం పెట్టుబడులు చైనా పెట్టినవే. చైనా కంపెనీలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాయంటూ కాంగోలో దక్షిణ కివూ రాష్ట్రం గతనెలలో ఆరు కంపెనీలను తక్షణమే పనులు నిలిపేయాలని ఆదేశించింది. కెన్యా, చైనాల మధ్య కుదిరిన 320 కోట్ల డాలర్ల రైల్వే ప్రాజెక్టు ఒప్పందం తమ దేశ చట్టాలకు అనుగుణంగా లేదంటూ నిరుడు జులైలో కెన్యాలోని ఒక రాష్ట్ర హైకోర్టు దాన్ని రద్దు చేసింది.

అనేక ఆఫ్రికా దేశాల్లో కాంట్రాక్టులు పొందడానికి చైనా కంపెనీలు స్థానిక అధికారులకు లంచాలు ఇస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. 65శాతం చైనా రుణాలు మౌలిక వసతుల ప్రాజెక్టుల్లోకి ప్రవహిస్తున్నాయి. కొవిడ్‌వల్ల ఆర్థికంగా చితికిపోయిన పేద ఆఫ్రికా దేశాలు చైనా రుణాలకు వడ్డీ చెల్లించలేకపోతున్నాయి.

అందుకే, డ్రాగన్‌తో ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ (బీఆర్‌ఐ) పథకంలో అంతర్భాగాలు. తన కలల ప్రాజెక్టు అయిన బీఆర్‌ఐకి తగులుతున్న ఎదురుదెబ్బలు చైనాను కలవరపరుస్తున్నాయి.

- ఆర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.