ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో... ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది ఓ ప్రియురాలు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్య తండాకి చెందిన ఓ యువతి అదే తండాకు చెందిన సంతోశ్లు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి సంతోశ్ మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. వివాహం చేసుకోవాలని బాధితురాలు నిలదీయగా... సంతోశ్ నిరాకరించడంతో అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టింది.
సంతోశ్ బంధువులు కొందరు తనపై దాడి చేశారని ఆరోపించింది. అతని తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆగ్రహించిన స్థానికులు రహదారిపై ముళ్ల కంచె వేసి ఆందోళనకు దిగారు.
"పెళ్లి చేసుకుంటానని సంతోశ్ నమ్మించాడు. అన్ని రకాలుగా మోసం చేశాడు. వివాహం కోసం నిలదీస్తే ఆయన తల్లిదండ్రులు ఒప్పు కోవడం లేదని అంటున్నాడు. అతనితో పెళ్లి జరిపించి న్యాయం చేయాలి."
-బాధితురాలు
ఇదీ చదవండి: