ETV Bharat / jagte-raho

నదిలో దూకి యువకుడు ఆత్మహత్య - తెలంగాణ వార్తలు

అమ్మా నేను చనిపోతున్నాను... నాకు బతకాలని లేదు అంటూ.. తల్లికి ఫోన్ చేసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్తున్నా అని చెప్పి నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

young man suicide
నదిలో దూకి యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Jan 11, 2021, 1:04 PM IST

"అమ్మా... నాకు బతకాలని లేదు, నేను చనిపోతున్నా" అంటూ తల్లికి ఫోన్ చేసి నదిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజోలి గ్రామానికి చెందిన మెయిబు.. పదో తరగతి పూర్తి చేసి మగ్గం నేస్తూ తల్లికి తోడుగా ఉంటున్నాడు.

కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయాడని.. చనిపోతానంటూ తిరుగుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఒకసారి చేయి కోసుకున్నాడని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నానని చెప్పి రాజోలిలోని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రేమ విఫలమై బాలిక ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.