భర్త వేధింపులతో పాటు పడక గదిలో తీసుకున్న ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో అప్లోడ్ చేయటం వల్ల... అవమానం భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో ఈ ఘటన జరిగింది. మెట్‌పల్లికి చెందిన రఫీకి లక్ష్మీపూర్‌కు చెందిన యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడుతున్నాడు.
అంతేగాక... పడక గదిలో తీసుకున్న ఫొటోలను పైశాచికంగా వాట్సాప్ స్టేటస్‌లో అప్లోడ్ చేశాడు. అవమానం భరించలేక వివాహిత ఇంట్లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబీకులు బాధితురాలిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు.. భర్త రఫీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.