ETV Bharat / jagte-raho

విజయారెడ్డి కేసులో నిందితులు దొరికారు

విశాఖ  మాజీ కార్పొరేటర్‌ విజయారెడ్డి హత్య కేసును  పోలీసులు ఛేదించారు. హత్యకేసు ఏ1 నిందితులుగా  హేమంత్, ఏ2  రాధికను అరెస్టు చేశారు.

విజయారెడ్డి
author img

By

Published : Mar 5, 2019, 2:36 PM IST

విశాఖ మాజీ కార్పొరేటర్‌ విజయారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకేసు ఏ1 నిందితులుగా హేమంత్, ఏ2 రాధికను అరెస్టు చేశారు. ఎన్జీవోస్ కాలనీలోని ఫ్లాట్‌ను విజయారెడ్డి విక్రయించాలని అనుకున్నారన్నారు. ఈ విషయం తెలుసుకున్న హేమంత్ గతేడాది ఆగస్టులో విజయారెడ్డిని సంప్రదించారని సీపీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో మళ్లీ ఫ్లాట్ కొనుగోలు కోసం వచ్చారన్నారు. రాధిక అనే మహిళ ఫ్లాట్ కొంటుందని హేమంత్ విజయారెడ్డిని కలిసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 23న హేమంత్, రాధిక కలిసి విజయారెడ్డి ఫ్లాట్‌కు వెళ్లారు. రూ.1.35 కోట్లకు ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. వారికి తమ ఆస్తుల వివరాలన్నీ విజయారెడ్డి చెప్పారని సీపీ వివరించారు. బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయం కోసం చూశారన్నారు. ఫిబ్రవరి 25న ఉదయం ఫ్లాట్‌కు హేమంత్ వచ్చినట్లు తెలిపారు. డాక్యుమెంట్లు అడగడంతో విజయారెడ్డి గదిలోకి వెళ్లారని ...ఇదే అవకాశంగా భావించిన హేమంత్ విజయారెడ్డిపై విచక్షణారహితంగా కత్తితో దాడిచేసి హత్యచేశాడు. అనంతరం బంగారం, కారు తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బంగారాన్ని రూ.2.75 లక్షలకు విక్రయించరాని తెలిపారు. నిందితుల నుంచి 105 గ్రాముల బంగారం, కారు, ద్విచక్రవాహనం, రూ.2.75 లక్షలు స్వాధీనం చేసుకున్నామని సీపీ మహేష్‌ చంద్ర లడ్డా వివరించారు.

విజయారెడ్డి కేసులో నిందితులు దొరికారు
మాజీ కార్పోరేటర్ దారుణహత్య
undefined

Chandigarh, Mar 03 (ANI): On avalanche in Namgya, Kinnaur Himachal Pradesh Chief Minister Jairam Thakur said, "A team of experts is conducting rescue operation at the site. Due to bad weather, the operation has been progressing slowly. Body of 1 of the 5 missing Army personnel was recovered yesterday after 11 days."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.