ETV Bharat / jagte-raho

19 కేసుల్లో నిందితులు.. పట్టుకున్నారు పోలీసులు - hundi theft team news today

19 కేసుల్లో నిందితులుగా ఉన్న హుండీల దొంగల ముఠా.. పట్టుబడింది. విజయనగరం, విశాఖ జిల్లాల పోలీసులు.. వీరి ఆట కట్టించారు.

హుండీలు దోచే ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్ : విశాఖ రేంజీ డీఐజీ

author img

By

Published : Sep 27, 2020, 7:35 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ, విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ శివారు ప్రాంతమైన మధురవాడ వాంబే కాలనీకి చెందిన ఆరుగురు యువకులు ఓ ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

జిల్లాలో 19 కేసులు..

వీరు ఉదయం పూట రెక్కీ నిర్వహించి.. రాత్రి వేళల్లో ఆటోలో బయలుదేరి ఆలయాల్లోని హుండీలు, ఇతర వస్తువులు దొంగతనాలు చేస్తుంటారు. ఇలా విశాఖ, విజయనగరం జిల్లాలో 19 కేసులు నమోదైనట్లు విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు వెల్లడించారు.

పాత నేరగాళ్లే..

పట్టుబడ్డ ఆరుగురు నిందుతులు పాత నేరస్తులేనని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరిపై 11 కేసులు ఉండగా, మరొకరిపై 7 కేసులు ఉన్నాయని వివరించారు. రాత్రి పూట గస్తీ కాస్తున్న క్రైం పోలీసులకు నిందితులు చిక్కారని.. వీరి నుంచి రూ.21 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీలకు మతపరమైన వివాదాలకు సంబంధం లేదని.. పోలీసు శాఖ పూర్తి అప్రమత్తతతో ఉందని డీఐజీ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

'షీర్‌జోన్‌, ఉపరితల అవర్తనం ప్రభావంతోనే భారీ వర్షాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.