ETV Bharat / jagte-raho

శంషాబాద్​ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్​

శంషాబాద్​ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం, కోటిన్నర విలువైన విదేశీ నగదు లభించింది. పక్కా సమాచారంతో విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద తనిఖీ చేయగా.. ఈ మొత్తం లభించింది.

gold
author img

By

Published : May 28, 2019, 8:27 PM IST

శంషాబాద్​ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్​

శంషాబాద్​ విమానాశ్రయంలో సోదాల్లో మరోసారి పెద్ద ఎత్తున బంగారం బయటపడింది. దుబాయ్​ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీని ముందస్తు సమాచారంతో అధికారులు తనిఖీ చేశారు. అందులో 11.1 కిలోల పుత్తడిని గుర్తించారు. దీని విలువ సుమారు 3 కోట్ల 63 లక్షల 52 వేల 500 రూపాయలుగా అంచనా వేశారు. వీటితో పాటు 4 లక్షల 25 వేల విలువైన సింగపూర్​ డాలర్లు, యూఏఈ దీరమ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహిళ గత మూడు నెలలుగా నివాసం ఉంటున్న ఓ ఐదు నక్షత్రాల హోటల్​ గదిలో అధికారులు సోదాలు చేశారు. ఒక కోటి 50 లక్షల 64 వేల 12 రూపాయల విలువైన అమెరికా​ డాలర్లు, సౌదీ రియాల్స్​ స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్​లో బంగారం ఎవరిచ్చారు.. హైదరాబాద్​లో ఎవరికి ఇవ్వమన్నారు.. గతంలో బంగారం ఎంత మేర అక్రమ రవాణా చేసిందనే కోణంలో ఆరా తీస్తున్నట్లు డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ అదనపు డైరెక్టర్​ ప్రసాద్​ తెలిపారు.

ఇవీ చూడండి: సైబర్​ నేరాల దర్యాప్తులో నిర్లక్ష్యం... బాధితులకేదీ న్యాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.