ETV Bharat / jagte-raho

హైవే హత్య కేసును ఛేదించిన రైల్వేకోడూరు పోలీసులు - mystery murder chased

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవ రాజపురం హైవేపై ఈ నెల 19న జరిగిన హత్యను రైల్వే కోడూరు పోలీసులు ఛేదించారు. నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నారాయణ స్వామి స్పష్టం చేశారు.

హైవే హత్య కేసును ఛేదించిన రైల్వేకోడూరు పోలీసులు

author img

By

Published : Oct 23, 2020, 10:53 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవ రాజపురం హైవేపై ఈ నెల 19న జరిగిన హత్యను రైల్వే కోడూరు పోలీసులు ఛేదించారు.

ఆరు రోజుల్లోనే..

కోడూరు పోలీస్​స్టేషన్ పరిధిలో రాఘవపురం హైవే పక్కన ఉన్న రేకుల షెడ్ లో 19వ తేదీ ఎర్రగుంట్ల మండలం, చిలమకూరుకు చెందిన కృష్ణమ నాయుడు హత్యకు గురయ్యారు. రైల్వేకోడూరు పంచాయతీ సెక్రటరీ ఓబులేసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆనందరావు దర్యాప్తు చేసి ఆరు రోజుల్లోనే నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

మద్యం మత్తులో..

చనిపోయిన వ్యక్తికి నిందితుడికి పరిచయం ఉండేదని.. తరచుగా ఇద్దరు మద్యం సేవించేవారన్నారు. ఈ క్రమంలో తాగిన మైకంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలో సిమెంట్ ఇటుకతో మృతుడి తలపై దాడి చేశారన్నారు. మద్యం మత్తులో చేసిన నేరం ఓ నిండు ప్రాణం బలిగొందని వివరించారు.

డీఎస్పీ అభినందన..

నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నారాయణ స్వామి పేర్కొన్నారు. వారంలోనే కేసును ఛేదించిన కోడూరు పోలీసులను డీఎస్పీ అభినందించారు.

ఇవీ చూడండి : నవంబర్‌లో భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్‌' మూడో దశ ట్రయల్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.