ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో.. మెట్రో రైలులో చిందులు - మెట్రోలో వ్యక్తి హల్​చల్​

హైదరాబాద్​ మెట్రోలో ఓ వ్యక్తి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశాడు. చరవాణిలో పెద్దగా పాటలు పెట్టుకొని నృత్యం చేశాడు. ప్రయాణికులు సిబ్బందికి సమాచారం అందించగా అతన్ని తార్నాక స్టేషన్​లో దించివేశారు.

hyderabad metro
author img

By

Published : Sep 13, 2019, 11:33 PM IST

మద్యం మత్తులో.. మెట్రో రైలులో చిందులు

హైదరాబాద్ మెట్రో రైలులో ఓ వ్యక్తి హల్​చల్ చేశాడు. చరవాణిలో పాటలు పెద్దగా పెట్టుకొని నృత్యం చేస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. సికింద్రాబాద్ నుంచి నాగోలు వైపు వెళ్తున్న మెట్రో రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. తోటి ప్రయాణికులు ఇతని ప్రవర్తనను చరవాణిలో చిత్రీకరించారు. అతను మద్యం మత్తులో ఇలా ప్రవర్తించినట్లు ప్రయాణికులు మెట్రో సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. తార్నాక స్టేషన్​లో సిబ్బంది అతన్ని దించేశారు.

ఇవీ చూడండి:

యాదాద్రిలోనే కాదు... బుద్ధవనంలోనూ కేసీఆర్ శిల్పాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.