దొంగ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుంటూరు జిల్లా మేడికొండ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు రూరల్ వెంగళాయపాలేనికు చెందిన షేక్ అహ్మద్.. తెలంగాణలోని నిజామాబాద్‌లో నెట్వర్కింగ్ డిప్లోమా పూర్తి చేసి అక్కడే కొన్నాళ్లు పనిచేశాడు. లాక్డౌన్ సమయంలో తిరిగి గుంటూరుకు చేరుకున్న అహ్మద్‌కు తురకపాలెంకు చెందిన మహిళతో వివాహమైంది. వరుసకు అన్నయ్య అయ్యే అదే గ్రామానికి చెందిన కరీముల్లాతో జత కలిసిన అహ్మద్... కలర్ జీరాక్స్ మెషీన్ సాయంతో పేరేచర్లలో కొన్నాళ్లుగా నకిలీ నోట్లు తయారు చేస్తున్నాడు.
మూడు నెలల కాలంలో లక్షా పది వేల రూపాయల వరకు దొంగనోట్లను ముద్రించారు. వృద్ధులు, నిరక్ష్యరాస్యులైన వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని 96 వేల రూపాయల నకిలీ నోట్లు ఇప్పటి వరకు మార్చినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారి స్థావరంపై దాడి చేసి 13 వేల నకిలీ కరెన్సీ, జిరాక్స్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. వీరు ప్రధానంగా 50, 100, 200, 500 నోట్లు ముద్రించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.
కలర్ జిరాక్స్‌తో నకిలీ నోట్లు
ఇదీ చదవండి: